నేటి రాశి ఫలాలు జూన్ 25, 2025: ఈరోజు ఈ రాశి వారికి రాబడి పెరుగుతుంది, శుభవార్తలు.. శివారాధన మేలు కలుగుతుంది!

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 25.06.2025 బుధవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Published on: Jun 25, 2025 4:00 AM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link
పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

హిందుస్తాన్ టైమ్స్

రాశిఫలాలు (దిన ఫలాలు) : 25.06.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ

మాసం: జ్యేష్ట, వారం : బుధవారం, తిథి : కృ. అమావాస్య, నక్షత్రం : మృగశిర

మేష రాశి

మేష రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు. భూ లావాదేవీల్లో లాభం పొందుతారు. అన్నదమ్ములతో సఖ్యత నెలకొంటుంది. ప్రయాణాల వల్ల పనులు నెరవేరుతాయి. శుభకార్య ప్రయత్నాలు ముందుకుసాగుతాయి. పాత బాకీలు వసూలవుతాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించండి.

వృషభ రాశి

గ్రహస్థితి అనుకూలంగా ఉంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. శుభకార్య ప్రయత్నాలు సఫలమవుతాయి. బంధు మిత్రులను కలుసుకుంటారు. ఇంట్లో సందడి వాతావరణం నెలకొంటుంది. విద్యార్థులు కష్టానికి తగ్గ ప్రతిఫలం పొందుతారు. వ్యాపారులకు అదృష్టం కలిసివస్తుంది. కొత్త ఒప్పందాలకు అనువైన సమయం. ఆర్థిక లావాదేవీల్లో తొందరపాటు తగదు. శుభవార్త వింటారు. సూర్యారాధన శుభప్రదం.

మిథున రాశి

మిథునరాశి వారికి ప్రతి విషయంలోనూ శ్రద్ధ అవసరం. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. రోజువారీ కార్యకలాపాల్లో చిన్నచిన్న ఆటంకాలు తలెత్తుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. శుభవార్త వింటారు. పరిస్థితుల్లో అనుకూల మార్పులు మొదలవుతాయి. రాబడి పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. సమయపాలన పాటించడం అవసరం. శివారాధన వల్ల మేలు జరుగుతుంది.

కర్కాటక రాశి

కర్కాటకరాశి వారికి మంచి ఆలోచనలు స్ఫురిస్తాయి. మానసికంగా సంతృప్తిగా ఉంటారు. ఆరోగ్యం బాగుంటుంది. ఉత్సాహంగా పనులు చేస్తారు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. విద్యార్థులకు మంచి సమయం. వ్యాపారులకు ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. అన్నదమ్ములతో మనస్పర్ధలు రావొచ్చు. వాహన మరమ్మతుల కారణంగా ఖర్చులు పెరగవచ్చు. పెద్దల అండదండలు పొందుతారు. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. దుర్గాదేవి ఆరాధన శుభప్రదం.

సింహ రాశి

సింహ రాశినిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. రోజువారీ కార్యకలాపాలు నిర్విఘ్నంగా కొనసాగుతాయి. గతంలో నిలిచిపోయిన పనుల్లో కదలిక వస్తుంది. రావలసిన డబ్బు సకాలంలో అందుతుంది. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండటం మంచిది. విలువైన వస్తువుల విషయంలో అజాగ్రత్త కూడదు. ఖర్చుల నియంత్రణ అవసరం. కుటుంబ సభ్యుల సలహాలు పాటించండి. పిల్లల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. గణపతి ఆలయాన్ని సందర్శించండి.

కన్య రాశి

కన్య రాశి వారి పనులు సకాలంలో పూర్తవుతాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు మంచి సమయం. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది. బంధువర్గంతో సఖ్యత పెరుగుతుంది. కోర్టు వ్యవహారాల్లో వృథా ఖర్చులు ఉంటాయి. అదృష్టంతో వ్యవహారాలు చక్కబడతాయి. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. అధికారుల అండదండలు లభిస్తాయి. లక్ష్మీ ధ్యానం శుభప్రదం.

తుల రాశి

తుల రాశి వారికి గ్రహస్థితి మిశ్రమంగా ఉంది. ఆలోచనలు అమలుచేయడంలో జాప్యం జరుగుతుంది. పెద్దల సహకారంతో పనుల్లో కదలిక వస్తుంది. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. విద్యార్థులు కష్టపడాల్సిన సమయం. దానికి తగ్గ ఫలితం పొందుతారు. ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. శుభకార్య ప్రయత్నాల్లో ఆటంకాలు ఏర్పడతాయి. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందకపోవచ్చు. సమయపాలన అవసరం. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మేలు చేస్తుంది.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశివారికి రావలసిన డబ్బు అందుతుంది. రోజువారీ లావాదేవీలు అనుకూలంగా సాగుతాయి. పెద్దల సలహాలు పాటించడం అవసరం. వివాహాది శుభకార్య ప్రయత్నాల్లో పురోగతి కనిపిస్తుంది. స్నేహితులతో విభేదాలు తలెత్తవచ్చు. భూ లావాదేవీల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులు సంయమనంతో వ్యవహరించడం అవసరం. వ్యాపారులు ఆర్థిక లావాదేవీల్లో ఆచితూచి వ్యవహరించాలి. మంచి మార్పు వస్తుంది. గణపతి గుడికి వెళ్లండి.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశివారు ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. అన్నదమ్ములు, స్నేహితులతో సత్సంబంధాలు కొనసాగిస్తారు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. ఉద్యోగులకు అధికారుల అండదండలు లభిస్తాయి. ఉత్సాహంతో పనులు చేస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. రావలసిన డబ్బు కొంత ఆలస్యంగా చేతికి అందవచ్చు. అనవసరమైన ఆలోచనలు ఉంటాయి. ఆహారం విషయంలో సమయపాలన అవసరం. శివారాధన శుభప్రదం.

మకర రాశి

మకర రాశి వారు మంచి ఆలోచనలు అమలు చేస్తారు. అన్ని పనుల్లో తాత్కాలిక లాభం పొందుతారు. వ్యాపారులు న్యాయపరమైన చిక్కులను అధిగమిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. అనుభవజ్ఞుల సలహాలు పాటించడం అవసరం. సహోద్యోగులతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. భూ లావాదేవీల్లో ఆశించిన ఫలితం పొందలేకపోవచ్చు. అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. సూర్యారాధన మేలు చేస్తుంది.

కుంభ రాశి

కుంభ రాశి వారు కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆరోగ్యంగా ఉంటారు. సహోద్యోగులతో అభిప్రాయ భేదాలు ఉండవచ్చు. ఆత్మీయుల సలహాలు పాటించండి. కొత్త పనులు ప్రారంభించకుండా చేతిలో ఉన్న వాటిపై దృష్టి సారించడం అవసరం. భూ లావాదేవీల్లో ఏమరుపాటు తగదు. ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది. పెద్దల సలహాలు పాటించండి. ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించండి.

మీన రాశి

ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. శ్రమకు అదృష్టం తోడవుతుంది. ఆదాయం పెరుగుతుంది. పిల్లల చదువు, ఉన్నత విద్య, వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంటా బయటా సంతృప్తిగా ఉంటారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారికి మంచి అవకాశాలు వస్తాయి. ఉద్యోగులకు పదోన్నతి, అనుకూల స్థానచలన సూచన ఉంది. దత్తాత్రేయ స్వామి ఆరాధన శుభప్రదం.

పంచాంగ కర్త: బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ - 9494981000

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More