నేటి రాశి ఫలాలు జూన్ 5, 2025: ఈరోజు ఈ రాశి వారు ఈ చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే, సమస్యలు లేకుండా సంతోషంగా ఉండచ్చు!

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 05.06.2025 గురువారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Published on: Jun 05, 2025 4:00 AM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000

హిందుస్తాన్ టైమ్స్

రాశిఫలాలు (దిన ఫలాలు) : 05.06.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ

మాసం: జ్యేష్ట, వారం : గురువారం, తిథి : శు. దశమి, నక్షత్రం : ఉత్తర

మేష రాశి

గ్రహబలం మిశ్రమ ఫలితాల సమ్మేళనం. భేషజాలకు పోవద్దు. కలిసివచ్చిన అవకాశాన్ని తక్షణం అందిపుచ్చుకోండి. పిల్లల భవిష్యత్తుపై దృష్టిపెట్టండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. పెద్దల హితవు కార్యోన్ముఖులను చేస్తుంది. ధైర్యంగా అడుగు ముందుకేస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. మొండిగా పనులు పూర్తి చేస్తారు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు.

వృషభ రాశి

వృషభరాశి వారికి ఈ రోజు లక్ష్యం నెరవేరుతుంది. వ్యవహార పరిజ్ఞానంతో నెట్టుకొస్తారు. లావాదేవీలు మీ ఆధ్వర్యంలో సాగుతాయి. ఉభయులకూ మీ నిర్ణయం ఆమోదయోగ్యమవుతుంది. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. ఖర్చులు అధికం, పన్ను చెల్లింపుల్లో జాప్యం తగదు. కొత్త వ్యక్తులను దరి చేరనీయవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. ఆశించిన పదవి దక్కదు. బాధ్యతల నుంచి తప్పుకుంటారు. ఆరోగ్యం సంతృప్తికరం.

మిథున రాశి

మిథునరాశి వారు ఈ రోజు కార్యసిద్ధికి మరింత శ్రమించాలి. నిరుత్సాహానికి గురికావద్దు. పట్టుదలతో ముందుకు సాగండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ధనసహాయం ఆర్జించేందుకు మనస్కరించరు. ఆటంకాలెదురైనా సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. ఒక సంఘటన మీపై ప్రభావం చూపుతుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది.

కర్కాటక రాశి

తలపెట్టిన కార్యం సఫలమవుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి. ఆప్తులకు సాయం అందిస్తారు. పరిచయాలు బలపడతాయి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. సాయం ఆశించవద్దు. లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి. మీ ప్రతిపాదనలకు అభ్యంతరాలెదురవుతాయి. ప్రలోభాలకు లొంగవద్దు. మీ నిర్ణయంపైనే కుటుంబ భవిష్యత్తు ఆధారపడి ఉంది. శుభకార్యంలో పాల్గొంటారు.

సింహ రాశి

సింహరాశి వారు కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. మీ కార్యదీక్ష ప్రశంసనీయమవుతుంది. ఊహించని ఖర్చులు ఎదురవుతాయి. ఆప్తులు సాయం అందిస్తారు. పనుల్లో ఆటంకాలెదురైనా పూర్తి చేయగలుగుతారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. ఆత్మీయులతో తరచూ సంభాషిస్తారు. కుటుంబసౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. అజ్ఞాత వ్యక్తులు మోసగించే ఆస్కారం ఉంది.

కన్యా రాశి

కార్యసాధనలో సఫలీకృతులవుతారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి. ఉల్లాసంగా గడుపుతారు. పనులు చురుకుగా సాగుతాయి. కార్యక్రమాలు వాయిదా పడతాయి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది. ఇంటి విషయాలపై దృష్టిపెడతారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది.

తులా రాశి

తులారాశి వారికి ఈ రోజు లావాదేవీలతో తీరిక ఉండదు. ఒప్పందాల్లో సమయస్పూర్తిగా మెలగండి. తొందరపాటు నిర్ణయం తగదు. అనుభవజ్ఞులను సంప్రదించండి. భేషజాలకు పోవద్దు. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి ఖర్చుచేస్తారు. పిల్లల విద్యాయత్నం ఫలిస్తుంది. పనులు వేగవంతమవుతాయి. అనవసర జోక్యం తగదు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది.

వృశ్చిక రాశి

మనోధైర్యంతో యత్నాలు సాగించండి. విమర్శలు పట్టించుకోవద్దు. దృఢసంకల్పంతోనే లక్ష్యం సాధిస్తారు. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు ముందుకు సాగవు. చీటికిమాటికి చికాకుపడతారు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. నగదు డ్రా చేసేటప్పుడు జాగ్రత్త. ప్రతి విషయం క్షుణ్ణంగా పరిశీలించుకోండి. వేడుకకు హాజరవుతారు. ఇంటిని అలక్ష్యంగా వదిలి వెళ్లకండి.

ధనుస్సు రాశి

ధనుస్సురాశి వారికి ఈ రోజు గ్రహబలం అనుకూలంగా ఉంది. ఆటంకాలెదురైనా మీ కృషి ఫలిస్తుంది. కొన్ని అవకాశాలు అనుకోకుండా కలిసి వస్తాయి. లక్ష్యాన్ని సాధిస్తారు. స్నేహసంబంధాలు బలపడతాయి. రావలసిన ధనం అందుతుంది. ప్రణాళికలు వేసుకుంటారు. పనులు అర్ధాంతరంగా ముగిస్తారు. అప్రమత్తంగా ఉండాలి. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. ఆప్తులకు మీ ఇబ్బందులు తెలియజేయండి.

మకర రాశి

శుభకార్యం విజయవంతమవుతుంది. పరస్పరం కానుకలిచ్చిపుచ్చుకుంటారు. పరిచయాలు, దూరపు బంధుత్వాలు బలపడతాయి. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. చాకచక్యంగా అడుగులేస్తారు. ఆలయాలకు విరాళాలు అందిస్తారు. కొత్త పనులకు ప్రణాళికలు వేసుకుంటారు. అనవసర జోక్యం తగదు. స్థిరచరాస్తుల వ్యవహారంలో ఒక నిర్ణయానికి రాగలుగుతారు.

కుంభ రాశి

కుంభరాశి వారికి ఈ రోజు అన్నిరంగాల వారికీ యోగదాయకమే. స్వయంకృషితో లక్ష్యాన్ని సాధిస్తారు. మీ కార్యదీక్ష ప్రశంసనీయమవుతుంది. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. ధనసహాయం తగదు. మీ అశక్తతను సున్నితంగా వ్యక్తం చేయండి. సన్నిహితులతో తరచూ సంభాషిస్తారు. చిన్న విషయానికే చికాకుపడతారు. ఆహ్వానం అందుకుంటారు. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు.

మీన రాశి

మీ ఓర్పు, నేర్పులకు పరీక్షా సమయం. సంకల్పబలంతో యత్నాలు సాగించండి. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. ఆదాయం సామాన్యం. వీలైనంత వరకు ఖర్చులు తగ్గించుకోండి. వాయిదాల చెల్లింపుల్లో జాప్యం తగదు. అయినవారు మీ అశక్తతను అర్థం చేసుకుంటారు. పనులు, కార్యక్రమాలు ముందుకు సాగవు. ఒక సమాచారం ఉల్లాసం కలిగిస్తుంది. ఆలోచనల్లో మార్పు వస్తుంది.

పంచాంగ కర్త: బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ - 9494981000

News/Rasi Phalalu/నేటి రాశి ఫలాలు జూన్ 5, 2025: ఈరోజు ఈ రాశి వారు ఈ చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే, సమస్యలు లేకుండా సంతోషంగా ఉండచ్చు!
News/Rasi Phalalu/నేటి రాశి ఫలాలు జూన్ 5, 2025: ఈరోజు ఈ రాశి వారు ఈ చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే, సమస్యలు లేకుండా సంతోషంగా ఉండచ్చు!