ఈరోజు శని, చంద్రుడు, కేతువుల ప్రభావంతో మూడు అశుభ యోగాలు.. మేషరాశితో సహా 5 రాశుల వారికి నష్టాలు!

ఈరోజు అశుభ యోగాలు ఏర్పడనున్నాయి. ఈరోజు చంద్రుడు సింహరాశిలోకి అడుగుపెడతాడు. ఇప్పటికే, కేతువు ఇదే రాశిలో ఉన్నాడు. ఈ రెండింటి కలయిక వలన, గ్రహణ యోగం ఏర్పడింది. షడాష్టక యోగం, శని పుష్య యోగం కూడా ఈరోజు ఏర్పడడంతో ఐదు రాశులకు సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

Published on: Jun 28, 2025 10:30 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

జూన్ 28, శనివారం అంటే ఈరోజు అశుభ యోగాలు ఏర్పడనున్నాయి. ఈరోజు చంద్రుడు సింహరాశిలోకి అడుగుపెడతాడు. ఇప్పటికే, కేతువు ఇదే రాశిలో ఉన్నాడు. ఈ రెండింటి కలయిక వలన, గ్రహణ యోగం ఏర్పడింది. పైగా, కుజుడు కూడా సింహరాశిలోనే ఉన్నాడు.

ఈరోజు శని, చంద్రుడు, కేతువుల ప్రభావంతో మూడు అశుభ యోగాలు (pinterest)
ఈరోజు శని, చంద్రుడు, కేతువుల ప్రభావంతో మూడు అశుభ యోగాలు (pinterest)

దీంతో, అశుభ యోగం ప్రభావం ఇంకా పెరిగింది. ఇది ఇలా ఉంటే, శని షడాష్టక యోగాన్ని చంద్రుడుకుజులతో సంయోగం చెంది సృష్టించాడు. శని పుష్య యోగం కూడా ఈరోజు ఏర్పడింది. దీంతో, ఐదు రాశుల వారికి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది.

శని, చంద్రుడు, కేతువు ప్రభావంతో ఐదు రాశుల వారికి ఇబ్బందులు

ఈరోజు మూడు అశుభ యోగాలుఏర్పడడం వలన, కొన్ని రాశుల వారికి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఈ రాశుల్లో మీరు కూడా ఉన్నారేమో చూసుకుని, జాగ్రత్తగా ఉండడం మంచిది.

1.మేష రాశి:

మేష రాశి వారికి, ఈ అశుభ యోగాల వలన చిన్నపాటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. పిల్లలకు సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు రావచ్చు. ఒత్తిడి పెరుగుతుంది. ప్రేమ జీవితం, ఆరోగ్యం పై కూడా ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

2.కర్కాటక రాశి:

కర్కాటక రాశివారికి, ఈ సమయంలో చిన్నపాటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. పెద్ద నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం మంచిది. అనవసరంగా డబ్బులను వృథా చేయకండి. తల్లి ఆరోగ్యం పై కూడా శ్రద్ధ వహించడం మంచిది.

3.సింహ రాశి:

సింహ రాశివారికి, చంద్రుడు, కుజుడు కారణంగా ఏర్పడిన గ్రహణ యోగం వలన అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో, ఈ రాశి వారు జాగ్రత్తగా పనులు చేసుకోవాలి. జీవిత భాగస్వామితో గొడవలు వచ్చే అవకాశం ఉంది. ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఉండటం మంచిది.

4.మకర రాశి:

మకర రాశివారికి, శని పుష్య యోగం వలన ఇబ్బందులు రావచ్చు. ఆర్థిక నష్టం కలిగే అవకాశం ఉంది. అనుకోని ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. దీనితో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. టెన్షన్లు పెరుగుతాయి. పని ప్రదేశంలో గొడవలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండటం మంచిది. రిస్క్ తీసుకోవద్దు.

5.మీన రాశి:

మీన రాశి వారికి కూడా, చిన్నపాటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ అశుభ యోగాల వలన జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక నష్టం కలిగే అవకాశం ఉంది. పని ప్రదేశంలో కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆచితూచి, జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

News/Rasi Phalalu/ఈరోజు శని, చంద్రుడు, కేతువుల ప్రభావంతో మూడు అశుభ యోగాలు.. మేషరాశితో సహా 5 రాశుల వారికి నష్టాలు!
News/Rasi Phalalu/ఈరోజు శని, చంద్రుడు, కేతువుల ప్రభావంతో మూడు అశుభ యోగాలు.. మేషరాశితో సహా 5 రాశుల వారికి నష్టాలు!