ఈరోజు గోవర్ధన పూజ వేళ ఈ 3 రాశులకు శ్రీకృష్ణుని ప్రత్యేక అనుగ్రహంతో అన్నింట్లో విజయాలే.. పూజా ముహూర్తం కూడా తెలుసుకోండి!

చాలా చోట్ల ఈరోజు గోవర్ధన పూజ చేస్తారు. శ్రీకృష్ణుడి అనుగ్రహం కలగాలని ప్రత్యేక పూజలు చేస్తారు. గోవర్ధన పూజలో ఆవులకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసి ఆహారాన్ని పెడతారు. కృష్ణుడు కోసం 56 నైవేద్యాలను సమర్పిస్తారు.  ఈరోజు గోవర్ధన పూజ వేళ ఈ రాశుల వారికి బాగా కలిసి వస్తుంది.

Published on: Oct 22, 2025, 09:06:39 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఈరోజు గోవర్ధన పూజ వేళ ఈ రాశుల వరకే కృష్ణుడి అనుగ్రహం కలుగుతుంది. పూజ చేసుకోవడానికి శుభముహూర్తాన్ని తెలుసుకోండి. చాలా చోట్ల ఈరోజు గోవర్ధన పూజ చేస్తారు. శ్రీకృష్ణుడి అనుగ్రహం కలగాలని ప్రత్యేక పూజలు చేస్తారు. గోవర్ధన పూజలో ఆవులకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసి ఆహారాన్ని పెడతారు. కృష్ణుడు కోసం 56 నైవేద్యాలను సమర్పిస్తారు.

ఈరోజు గోవర్ధన పూజ వేళ ఈ 3 రాశులకు శ్రీకృష్ణుని ప్రత్యేక అనుగ్రహం (pinterest)
ఈరోజు గోవర్ధన పూజ వేళ ఈ 3 రాశులకు శ్రీకృష్ణుని ప్రత్యేక అనుగ్రహం (pinterest)

గోవర్ధన పూజ 2025

గోవర్ధన పూజ ఏ సమయానికి చేసుకోవాలనే విషయానికి వస్తే.. ఉదయం 6:30 నుంచి 8:47 వరకు చేసుకోవచ్చు. అలాగే సాయంత్రం 3:36 నుంచి 5:52 వరకు గోవర్ధన పూజ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అయితే, ఈరోజు గోవర్ధన పూజ వేళ ఈ రాశుల వారికి బాగా కలిసి వస్తుంది.

శ్రీకృష్ణుడి ప్రత్యేక ఆశీస్సులు ఈ రాశుల వారిపై ఉంటాయి. దీంతో ఈ రాశుల వారు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు, ఇబ్బందులు ఏమి ఉండవు, ఆనందంగా ఉంటారు. మరి ఈ రాశుల్లో మీ రాశి కూడా ఉందేమో చూసుకోండి. శ్రీకృష్ణుడి ఆశీస్సులతో ఈ రాశుల వారికి ఎప్పుడూ సంతోషమే.

ఈరోజు గోవర్ధన పూజ వేళ ఈ మూడు రాశులకు శ్రీకృష్ణుని ప్రత్యేక అనుగ్రహం

1.సింహ రాశి:

సింహ రాశి వారికి కృష్ణుడి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. కృష్ణుడి అనుగ్రహంతో ఈ రాశి వారు ఈరోజు గోవర్ధన పూజను సంతోషంగా చేస్తారు. వ్యాపారస్తులకి ఇది మంచి సమయం. కెరీర్ దూసుకుపోతుంది. ఊహించని విజయాలను అందుకుంటారు. ఈరోజు గోవర్ధన పూజ వేళ ఎరుపు రంగు స్వీట్లను, పండ్లను నైవేద్యంగా సమర్పిస్తే మీకు బాగా కలిసి వస్తుంది.

2.వృశ్చిక రాశి:

వృశ్చిక రాశి వారికి ఈరోజు గోవర్ధన పూజ వేళ శుభ ఫలితాలు ఎదురవుతాయి. ఈ రాశి వారు వాహనాలను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. డబ్బు బాగా సంపాదిస్తారు. ఎర్రటి స్వీట్లు, కూరగాయలు శ్రీకృష్ణుడికి సమర్పిస్తే బాగా కలిసి వస్తుంది. గోవర్ధన పూజ వేళ పూజ చేసి భగవంతున్ని ఆరాధిస్తే కష్టాలన్నీ తొలగిపోయి సంతోషంగా ఉంటారు. ఇబ్బందులు ఏమి ఉండవు.

3.కుంభ రాశి:

కుంభ రాశి వారికి గోవర్ధన పూజ అనుగ్రహం కలుగుతుంది. సంతోషంగా ఉంటారు. వ్యాపారులకి ఈ సమయం బాగుంటుంది. కృష్ణుని అనుగ్రహంతో ఈ రాశి వారి కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది.

కెరీర్ లో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆకుపచ్చని కూరగాయలు, స్వీట్లను శ్రీకృష్ణుడికి రోజు సమర్పిస్తే మీకు బాగుంటుంది. మొత్తానికి గోవర్ధన పూజ ఈ రాశి వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More