ఈరోజు మంగళవారం + సుబ్రహ్మణ్య షష్టి చాలా శక్తివంతమైన రోజు.. ఈ మంత్రాలను జపించి, పరిహారాలను పాటిస్తే సమస్యలన్నీ తీరినట్టే!
మంగళవారం + సుబ్రహ్మణ్య షష్టి రావడం చాలా మంచిది. దీనిని సరిగ్గా సద్వినియోగం చేసుకుంటే ఇబ్బందుల నుంచి బయటపడొచ్చు. సంతానం లేని వారు, సంతానం అభివృద్ధి లేని వారు ఈ మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం మంచిది. సంతానం లేని వారు, సంతానంలో సమస్యలు ఉన్నవారు ఇలా చేస్తే మంచిది.
చాలామంది రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఏ సమస్య లేకుండా సంతోషంగా ఉండాలంటే కొన్ని పరిహారాలను పాటించడం మంచిది. కొన్ని పరిహారాలను పాటించడం వలన సంతోషంగా ఉండవచ్చు. ఎటువంటి బాధలు ఉన్నా సరే తొలగిపోతాయి. అయితే సమస్యల నుంచి బయటపడడానికి పరిహారాలను పాటించడానికి జూలై 1 చాలా మంచి రోజు.

జూలై 1న మంగళవారం, పైగా సుబ్రహ్మణ్య స్వామి షష్టి వచ్చింది. ఈరోజున కొన్ని పరిహారాలను పాటించడం వలన సమస్యల నుంచి బయటపడొచ్చు, సంతోషంగా జీవించొచ్చు.
మంగళవారం + సుబ్రహ్మణ్య షష్టి
మంగళవారం+ సుబ్రహ్మణ్య షష్టి రావడం చాలా మంచిది. దీనిని సరిగ్గా సద్వినియోగం చేసుకుంటే ఇబ్బందుల నుంచి బయటపడొచ్చు. సంతానం లేని వారు, సంతానం అభివృద్ధి లేని వారు ఈ మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం మంచిది.
సంతానం లేని వారు, సంతానంలో సమస్యలు ఉన్నవారు ఇలా చేస్తే మంచిది:
- సంతానం లేని వారు, సంతానంలో సమస్యలు ఉన్నవారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి అభిషేకం చేయించుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
- ఈరోజుస్వామివారికి ఎర్రటి వస్త్రాలను సమర్పిస్తే కూడా విశేష ఫలితాన్ని పొందవచ్చు. సమస్యలన్నీ కూడా తీరిపోతాయి.
- ఎర్రటి పూలను కూడా స్వామి వారికి సమర్పించండి. మీ సమస్యలకు కచ్చితంగా పరిష్కారం లభిస్తుంది.
ఈ మంత్రాన్ని జపించండి: “ఓం శరవణ భవాయ విద్మహే కార్తికేయాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్.”
సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి పూజ చేసి వీలైనంత సార్లు ఈ మంత్రాన్ని జపిస్తే మంచి ఫలితం కనబడుతుంది. సమస్యలన్నీ తగ్గిపోతాయి, సంతోషంగా ఉండొచ్చు.
ఈ విశేషమైన రోజున ఇలా కూడా చేయొచ్చు
సుబ్రహ్మణ్య స్వామికి మహా ప్రీతికరమైన రోజు కావడంతో, ఈ రోజున కుజ దోషం ఉన్నవారు, కాల సర్ప దోషం, పితృ శాపం, వివాహం కానివారు, వైవాహిక జీవితంలో ఇబ్బందులుఉన్నవారు, సంతానం కలగకపోవడం, భార్యాభర్తల మధ్య అపార్థాలు వంటివి తొలగిపోవాలన్నా ఈ షష్టి నాడు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం మంచిది.
ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి హోమం జరిపితే కూడా మంచి జరుగుతుంది, సమస్యలు గట్టిక్కుతాయి. అలాగే ఈ సమస్యలన్నీ తీరాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి అభిషేకం చేయించుకుంటే మంచిది.
ఈ మంత్రాన్ని పఠిస్తే కూడా మీ సమస్యలన్నీ తీరిపోతాయి:
“ఓం శరవణ భవాయ సుబ్రహ్మణ్యాయ శ్రీ రుద్రాయ నమః.”
- ఈ మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మంచి ఫలితం ఉంటుంది. సమస్యల నుంచి ఉపశమనాన్ని పొందవచ్చు, సంతోషంగా ఉండొచ్చు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper



