...
...
Next Story

ఈరోజు శుక్ర, కుజుల కలయికతో అరుదైన శుభ యోగం.. ఈ రాశులకు ఆకస్మిక ధన లాభం, ప్రమోషన్లు, శుభవార్తలతో పాటు ఎన్నో!

నవగ్రహాలలో శుక్రుడు, కుజుడుకి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఈ రెండు గ్రహాలు అక్టోబర్ 22, అంటే ఈరోజు సాయంత్రం 6:55కి శుభయోగంను ఏర్పరుస్తున్నాయి. ఈ రెండు గ్రహాలు ఒకదానికొకటి 40 డిగ్రీల కోణంలో ఉండడంతో ఈ యోగం ఏర్పడనుంది. దీనిని చాలీసా యోగం అని అంటారు. మరి ఏ రాశుల వారికి ఈ యోగం బాగా కలిసి వస్తుంది?

Published on: Oct 22, 2025, 15:00:03 IST
Advertisement

గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. ఆ సమయంలో శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ శుభ యోగాలు ద్వాదశ రాశుల వారిపై ప్రభావాన్ని చూపిస్తాయి. అవి కొన్ని రాశుల వారికి ఎక్కువ లాభాలను కూడా తీసుకువచ్చే అవకాశం ఉంటుంది.

ఈరోజు అరుదైన యోగం

చాలీసా యోగంతో ఈ రాశుల వారికి ఎక్కువ లాభాలు (pinterest)
చాలీసా యోగంతో ఈ రాశుల వారికి ఎక్కువ లాభాలు (pinterest)

నవగ్రహాలలో శుక్రుడు, కుజుడుకి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఈ రెండు గ్రహాలు అక్టోబర్ 22, అంటే ఈరోజు సాయంత్రం 6:55కి శుభయోగంను ఏర్పరుస్తున్నాయి. ఈ రెండు గ్రహాలు ఒకదానికొకటి 40 డిగ్రీల కోణంలో ఉండడంతో ఈ యోగం ఏర్పడనుంది. దీనిని చాలీసా యోగం అని అంటారు. నవల కోణం అని కూడా పిలుస్తారు.

ఇది ద్వాదశ రాశుల వారిపై ప్రభావాన్ని చూపిస్తుంది, కానీ కొన్ని రాశుల వారు ఎక్కువ లాభాలను పొందుతారు. మరి ఏ రాశుల వారికి ఈ యోగం బాగా కలిసి వస్తుంది, ఎవరు ఎలాంటి లాభాలను పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం.

చాలీసా యోగంతో ఈ రాశుల వారికి ఎక్కువ లాభాలు

ఇది చాలా ప్రభావితమైన యోగం. ఈ యోగం కారణంగా కెరీర్‌లో, వ్యాపారంలో, వ్యక్తిగత జీవితంలో కూడా అనేక మార్పులు వస్తాయి. ఆర్థికపరంగా కూడా బాగుంటుంది. చాలా సమస్యలు తగ్గుతాయి. మరి ఇక యోగం వలన ఏ రాశుల వారికి ఎక్కువ లాభాలు కలుగుతాయో చూద్దాం.

1.సింహ రాశి:

సింహ రాశి వారికి చాలీసా యోగం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆర్థికపరంగా బాగుంటుంది. ఎప్పటినుంచో రావాల్సిన ధనం మీ చేతికి వస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించవచ్చు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు కూడా ఇది మంచి సమయం.

2.మేష రాశి:

ధనుస్సు రాశి వారికి ఈ యోగం బాగా కలిసి వస్తుంది. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఆకస్మిక ప్రయాణం చేస్తారు. ఉద్యోగులు ట్రాన్స్ఫర్‌కి సంబంధించి శుభవార్తలను వింటారు. విద్యార్థులకు బాగా కలిసి వస్తుంది. పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం. సంతోషంగా ఉంటారు, కష్టాలు తొలగిపోతాయి.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks