సూర్యగ్రహణం వేళ సూర్య, శనిల సంసప్తక యోగం, 5 రాశుల వారికి అదృష్టాన్ని తెస్తుంది.. రాజ వైభవాన్ని, సంపదను పొందుతారు!
సూర్యగ్రహణం, సంసప్తక యోగం రెండూ కూడా ద్వాదశ రాశుల వారిపై ప్రభావం చూపిస్తాయి. కానీ కొన్ని రాశుల వారు మాత్రం శుభ ఫలితాలను ఎదుర్కొంటారు. కెరీర్‌లో సక్సెస్‌ని అందుకుంటారు. ఆర్థికపరంగా కలిసి వస్తుంది. మరి ఈ యోగం ఏ రాశుల వారికి శుభఫలితాలను అందిస్తుంది?
రేపే సూర్య గ్రహణం. సూర్య గ్రహణంవేళ సంసప్తక యోగం ఏర్పడనుంది. సెప్టెంబర్ 17న సూర్యుడు కన్యరాశిలోకి ప్రవేశించాడు. ఈ ఏడాది వచ్చే చివరి సూర్యగ్రహణం కూడా కన్యరాశిలో ఏర్పడనుంది. ఇది ఇలా ఉంటే శని మీన రాశిలో తిరోగమనంలో ఉన్నాడు. శని మీన రాశిలో ఉండడం, సూర్యుడు కన్య రాశిలో ఉండడం వలన సంసప్తక యోగం ఏర్పడనుంది.

అయితే, సూర్యగ్రహణం, సంసప్తకయోగం రెండూ కూడా ద్వాదశ రాశుల వారిపై ప్రభావం చూపిస్తాయి. కానీ కొన్ని రాశుల వారు మాత్రం శుభ ఫలితాలను ఎదుర్కొంటారు. కెరీర్‌లో సక్సెస్‌ని అందుకుంటారు. ఆర్థికపరంగా కలిసి వస్తుంది. మరి ఈ యోగం ఏ రాశుల వారికి శుభఫలితాలను అందిస్తుంది? ఏ రాశి వారు ఎలాంటి లాభాలను పొందుతారు? ఇప్పుడు తెలుసుకుందాం.
సూర్యగ్రహణం, సంసప్తక యోగంతో ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారం
1.వృషభ రాశి
వృషభ రాశి వారికి ఇది బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారి ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగస్తులు కెరీర్‌లో సానుకూల మార్పులు చూస్తారు. ప్రమోషన్లు వస్తాయి. కొత్త ఉద్యోగం కూడా లభించవచ్చు. ఈ సమయంలో మీ జీతం కూడా పెరుగుతుంది. కొన్ని ముఖ్యమైన పనులను కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు.
2.కర్కాటక రాశి
కర్కాటక రాశివారికి ఈ సంసప్తక యోగం మంచి ఫలితాలను అందిస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తిచేస్తారు. ఆర్థికపరంగా బాగా కలిసి వస్తుంది. వ్యాపారులకు కూడా ఇది మంచి సమయం. ఉద్యోగస్తులు కొత్త అవకాశాలను పొందుతారు.
3.తులా రాశి
తులా రాశి వారికి ఇది చాలా మంచి సమయం. ఈ రాశి వారు ముఖ్యమైన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ప్రాజెక్టులు వస్తాయి. సంతోషంగా ఉంటారు. ఆర్థికపరంగా బాగుంటుంది. పూర్వీకుల నుంచి ఆస్తి లాభం ఉంటుంది. పెళ్లి కూడా కుదిరే అవకాశం ఉంది.
4.మకర రాశి
మకర రాశివారికి ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. కెరీర్‌లో ఊహించని మార్పులను చూస్తారు. మీ పని ప్రదేశంలో మంచి పేరు ఉంటుంది. వ్యాపారులు ఎక్కువ లాభాలను పొందుతారు. కొత్త వాహనాలను కొనుగోలు చేస్తారు. ఆస్తి కూడా మీ చేతికి వస్తుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.
5.కుంభ రాశి
కుంభ రాశి వారికి ఈ యోగం శుభఫలితాలను అందిస్తుంది. ఈ సమయంలో మీ ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులకు కూడా బాగా కలిసి వస్తుంది. డబ్బును బాగా ఆదా చేస్తారు. పనికి సంబంధించి ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper



