రేపే నిర్జల ఏకాదశి.. ఈ శక్తివంతమైన యోగంతో మూడు రాశులకు కనీవినీ ఎరుగని రీతిలో లాభాలు!

జ్యేష్ఠ మాసంలో వచ్చే నిర్జల ఏకాదశి జూన్ 6న వచ్చింది. నిర్జల ఏకాదశి నాడు కుబేర యోగం ఏర్పడుతుంది. ఇది కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది. మరి ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Published on: Jun 5, 2025, 10:30:01 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రతి నెల కూడా రెండు ఏకాదశులు వస్తాయి. ఒకటి కృష్ణపక్షంలో, ఇంకొకటి శుక్లపక్షంలో. హిందువులు ఏకాదశిని ఎంతో పవిత్ర దినంగా భావిస్తారు. ఏకాదశి నాడు విష్ణుమూర్తిని పూజించడం, ఉపవాసం ఉండడం వలన ప్రత్యేక ఫలితాన్ని పొందవచ్చు.

నిర్జల ఏకాదశి
నిర్జల ఏకాదశి

జ్యేష్ఠ మాసంలో వచ్చే నిర్జల ఏకాదశి జూన్ 6న వచ్చింది. నిర్జలఏకాదశి నాడు కుబేరయోగం ఏర్పడుతుంది. ఇది కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది.

12 రాశుల వారిపై ఈ యోగం ప్రభావం చూపించినప్పటికీ, కొన్ని రాశుల వారికి మాత్రం ప్రత్యేక ఫలితాలను అందిస్తుంది. దీంతో ఈ రాశులవారి జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. అదృష్టంతో పాటు అనేక లాభాలు ఉంటాయి. మరి ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

నిర్జల ఏకాదశి నాడు కుబేర యోగంతో ఈ రాశుల వారి పంట పండినట్లే:

1.మకర రాశి

మకరరాశి వారికి నిర్జల ఏకాదశి నాడు అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెడితే కలిసి వస్తుంది. మకర రాశి వారు విందులు, వినోదాల్లో పాల్గొంటారు. కోర్టు కేసుల నుంచి విజయాన్ని పొందుతారు. గౌరవం, మర్యాదలు కూడా పెరుగుతాయి.

2.సింహ రాశి

సింహరాశి వారికి కుబేర యోగం కారణంగా రాజకీయాల్లో కీలక పదవులు వస్తాయి. కోరుకున్న అమ్మాయితో పెళ్లి జరుగుతుంది. వదిలేసిన డబ్బులు కూడా తిరిగి వస్తాయి. వ్యాపారులకు కూడా మంచి లాభం ఉంటుంది.

3.కన్యా రాశి

కన్యారాశి వారికి నిర్జల ఏకాదశి నాడు కుబేర యోగంతో లాభం కలుగుతుంది. పెళ్లి కుదరని వాళ్లకు పెళ్లి జరిగే అవకాశం ఉంది. శత్రువులు కూడా మిత్రులుగా మారతారు. ఈ యోగం కారణంగా సోదరులతో సఖ్యత ఉంటుంది. లాటరీలు కూడా ఈ సమయంలో తగిలే అవకాశం ఉంది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More