త్వరలోనే త్రిగ్రాహి యోగం, ఈ మూడు రాశులకు గోల్డెన్ డేస్.. ఉద్యోగాలు, వ్యాపారంలో లాభాలు ఇలా ఎన్నో!
సూర్యుడు, బుధుడు, గురువు కలయిక చోటు చేసుకోవడంతో, త్రిగ్రాహి యోగాన్ని సృష్టిస్తుంది. ఈ యోగం కొన్ని రాశిచక్ర గుర్తులకు ప్రయోజనకరంగా ఉంటుంది, ఎందుకంటే ఈ యోగం ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులను తీసుకు వస్తుంది. మరి ఈ అదృష్ట రాశుల వారు ఎవరో తెలుసుకుందాం.
గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశికి మారుతూ ఉంటాయి. జూన్ నెల చాలా ప్రత్యేకమైనది, ఎందుకంటే ఈ నెలలో మిధునరాశిలో అరుదైన గ్రహాల కలయిక ఏర్పడనుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం, బుధుడుజూన్‌లో మిథున రాశిలో సంచరిస్తాడు. ఆ తర్వాత, సూర్యుడు జూన్ 15, 2025 ఉదయం 6:52 గంటలకు మిథునంలోకి ప్రవేశిస్తాడు. ఈ సమయంలోనే, గురువు కూడా మిథునంలోనే ఉంటాడు.

అటువంటి పరిస్థితిలో, సూర్యుడు, బుధుడు, గురువు కలయిక చోటు చేసుకోవడంతో, త్రిగ్రాహి యోగాన్ని సృష్టిస్తుంది. ఈ యోగం కొన్ని రాశిచక్ర గుర్తులకు ప్రయోజనకరంగా ఉంటుంది, ఎందుకంటే ఈ యోగం ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులను తీసుకు వస్తుంది. మరి ఈ అదృష్ట రాశుల వారు ఎవరో తెలుసుకుందాం.
త్రిగ్రాహి యోగంతో ఈ మూడు రాశుల కష్టాలు తీరుతాయి
1.మేష రాశి
మేషరాశి వారికి త్రిగ్రాహి యోగం వలన అనేక లాభాలు ఉంటాయి. ఈ యోగం మేష రాశి వారి జీవితంలో సంతోషాన్ని ఇస్తుంది, సానుకూల శక్తిని పెంచుతుంది. మేష రాశి వారికి ఈ సమయంలో వ్యాపారంలో కూడా ఎక్కువ లాభాలు వస్తాయి. ఎప్పటి నుంచో మీరు ఏ విషయంలోనైనా ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లయితే, ఈ సమయంలో అవన్నీ తొలగిపోతాయి.
ప్రతి పనిని కూడా పూర్తి చేసే సక్సెస్‌ని అందుకుంటారు. కొత్తగావ్యాపారాన్ని మొదలుపెడితే, ఎక్కువ లాభాలు పొందవచ్చు. పెళ్లి కాని వారికి పెళ్లి కుదిరే అవకాశం ఉంది.
2.వృషభ రాశి
వృషభరాశి వారికి త్రిగ్రాహి యోగం అనేక లాభాలను అందిస్తుంది. ఈ రాశి వారు ఈ సమయంలో మతపరమైన పనుల్లో చురుకుగా ఉంటారు. పని ప్రదేశంలో సక్సెస్‌ని అందుకుంటారు. వ్యాపారంలో కూడా ఈ రాశి వారికి కలిసి వస్తుంది.
అదృష్టం కూడా కలిసి వస్తుంది. సక్సెస్‌ని కూడా అందుకుంటారు. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఈ సమయంలో పాత మిత్రుడిని కూడా కలుసుకుంటారు. ఇది వరకు కంటే మీ ఆరోగ్యం బాగుంటుంది.
3.కన్యా రాశి
కన్యా రాశి వారికి త్రిగ్రాహియోగం అనేక ఫలితాలను ఇస్తుంది. మూడు గ్రహాల కలయిక వలన ఈ రాశి వారికి సంతోషం ఉంటుంది, మానసిక ప్రశాంతత కలుగుతుంది. కోర్టు కేసుల నుంచి ఉపశమనం ఉంటుంది. సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. ఉద్యోగంలో కూడా అన్ని శుభ ఫలితాలను పొందుతారు. వ్యాపారులకు ఈ సమయంలో అధిక లాభాలు వస్తాయి. జీవిత భాగస్వామితో బంధం దృఢంగా మారుతుంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper



