...
...
Next Story

Ugadi Rasi Phalalu 2025: తులా రాశి జాతకుల ఉగాది రాశి ఫలాలు.. ఈ ఏడాది ఆకస్మిక ధన లాభం

Ugadi Rasi Phalalu 2025: తులా రాశి జాతకులకు విశ్వావసు నామ సంవత్సరం రాశి ఫలాలు ఎలా వున్నాయి? తులా రాశి వారి జీవితంలో ఈ కొత్త తెలుగు సంవత్సరంలో చోటు చేసుకోబోతున్న మార్పులను ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు, పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

Published on: Mar 13, 2025, 10:57:36 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

తులా రాశి (చిత్త 3,4 పాదాలు: స్వాతి: విశాఖ 1,2,3 పాదాలు)

తులా రాశి జాతకుల ఉగాది రాశి ఫలాలు (pinterest)
తులా రాశి జాతకుల ఉగాది రాశి ఫలాలు (pinterest)

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం నందు చిలకమర్తి పంచాంగ గణనం ఆధారంగా

గురుడు వృషభ రాశి సంచారంతో ఆటంకాలు

గురుడు ఈ సంవత్సరం ఉగాదినుండి 14.5.25 వరకు వృషభంలో ఉంటాడు. మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించుట అవసరం. నూతన కార్యాలకు ఆటంకాలు ఏర్పడకుండా చూసుకోండి. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. కఠిన సంభాషణ వల్ల ఇబ్బందులు ఎదుర్కుంటారు. ఇతరులకు హాని తలపెట్టు కార్యాలకు నుంచి దూరంగా ఉండాలి.

15.5.25 నుంచి 19.10.25 వరకు, మళ్ళీ 6.12.25 నుండి సంవత్సరం చివరి గురుడు మిథునంలో ఉంటాడు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన గృహకార్యాలపై శ్రద్ధ వహిస్తారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందిస్తారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. దైవదర్శనం చేసుకుంటారు. భక్తి శ్రద్ధలు అధికం అవుతాయి.

20.10.25 నుండి 5.12.25 వరకు కర్కాటకంలో ఉంటాడు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మికధన నష్టం కలిగే అవకాశం ఉంటుంది. వృధా ప్రయాణాలు చేస్తారు. బంధుమిత్రులతో కలహించుకోకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తి, ఉద్యోగ రంగాల్లో సహనం వహించక తప్పదు.

శని మీన రాశి సంచారంతో ఆకస్మిక ధనలాభం

శనిఈ సంవత్సరం ఉగాది నుండి సంవత్సరం చివరి వరకు మీనంలో ఉంటాడు. బంధు, మిత్రులతో కలుస్తారు. నూతన గృహనిర్మాణ ప్రయత్నం చేస్తారు. ఆకస్మిక ధన లాభంతో, ఋణబాధలు తొలగిపోతాయి. కుటుంబ సౌఖ్యముంటుంది. శతృబాధలు దూరమవుతాయి. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది.

రాహువు మీన రాశి సంచారంతో శతృబాధలు తొలగిపోతాయి

రాహువు ఈ సంవత్సరం ఉగాదినుండి 18.5.25 వరకు మీనంలో ఉంటాడు. మిక్కిలి ధైర్య, సాహసాలు కలిగి ఉంటారు. సూక్ష్మబుద్ధితో విజయాన్ని సాధిస్తారు. మీ పరాక్రమాన్ని ఇతరులు గుర్తిస్తారు. శతృబాధలు తొలగిపోతాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు. ఆకస్మిక లాభాలుంటాయి.

కేతువుఈ సంవత్సరం ఉగాది నుండి 18.5.25 వరకు కన్యలో ఉంటాడు. ప్రయాణాల్లో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. ఆకస్మిక ధన నష్టం కలగకుండా జాగ్రత్త వహించుట మంచిది. అనారోగ్య బాధలు తొలగుటకు డబ్బుఎక్కువ ఖర్చు చేస్తారు. తీర్థయాత్రకు ప్రయత్నిస్తారు. దైవదర్శనం ఉంటుంది. స్త్రీలు మనోల్లాసాన్ని పొందుతారు.

19.5.25 నుండి సంవత్సరం చివరి వరకు సింహంలో ఉంటాడు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలువింటారు. బంధుమిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధన లాభాన్ని పొందుతారు. నూతన వస్తు, ఆభరణాలను ఖరీదు చేస్తారు. ముఖ్యమైన కార్యాలు పూర్తి అవుతాయి.

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం నందు చిలకమర్తి పంచాంగ గణనం ఆధారంగా

బృహస్పతి మే నుండి తొమ్మిదో స్థానములో, శనిఆరవ స్థానములో, రాహువు మే నుండి ఐదో స్థానములో. కేతువు మే నుండి పదకొండవ స్థానములో సంచరించుట చేత తులా రాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నది.

ఈ సంవత్సరం నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నం సఫలీకృతమగును. ఉద్యోగస్తులకు ప్రమోషన్లువంటివి సత్ఫలితాలను ఇచ్చును. వ్యాపారస్తులకు ధన లాభము, వ్యాపారాభివృద్ధి జరుగును. ఈ సంవత్సరం తులా రాశి వారికి మంచి ఆదాయం, అభివృద్ధి సూచించుచున్నవి.

ఎవరికి ఎలా?

  1. తులారాశి వారు శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో విద్యార్థులు శుభ ఫలితములను పొందెదరు.
  2. వ్యాపారస్తులకు వ్యాపారం లాభదాయకంగా ఉండును. గత కొంత కాలంగా ఏవైతే సమస్యలున్నాయో ఆ సమస్యలు కొలిక్కి వచ్చును. కోర్టు తీర్పులు, కోర్టు వ్యవహారాలు అనుకూల ఫలితాలను అందించును.
  3. ఈ సంవత్సరంఆరోగ్యము, ఆనందము కలుగును. కుటుంబ సౌఖ్యం కలుగును.
  4. సంతానం వలన శుభవార్తలను వినెదరు. ప్రయాణములు లాభదాయకముగా ఉండును. శుభవార్తలు వింటారు. శుభకార్యాలయందు పాల్గొంటారు.
  5. ఇన్వెస్ట్మెంట్లు వంటివన్నీ కలసివచ్చును. సజ్జన సాంగత్యము పెరుగును.
  6. ఆరోగ్యం కోసం చేసే ప్రయత్నాలు ఫలించును. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాల్లో పని ఒత్తిడి వల్ల ఇబ్బందులు ఏర్పడును. నరఘోష పెరుగు సూచన.
  7. తులారాశి స్త్రీలకుఈ సంవత్సరం అనుకూల ఫలితాలున్నాయి. సౌఖ్యం, ఆనందం కలుగును.
  8. రాజకీయ నాయకులకు కలిసి వస్తుంది.
  9. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో తులా రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం కనకధారా స్తోత్రాన్ని పఠించండి. శుక్రవారం రోజు ఆవునేతి దీపాన్నిలక్ష్మీ దేవి వద్ద వెలిగించండి. ఆదిత్య హృదయ పారాయణ మంచిది.

మాసవారి ఫలితములు

ఏప్రిల్ నెల

ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు ఉంటాయి. గృహమార్పులు ఉంటాయి. వృధా ఖర్చులు కూడా. దేవాలయ దర్శనము చేయుదురు. క్రయవిక్రయాల్లో లాభములుంటాయి. మిత్రులు శత్రువులుగా మారెదరు. అధికార ఒత్తిడి ప్రతి విషయంలో ఆలోచనలు.

మే నెల

ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. సంఘంలో గౌరవ మర్యాదలుంటాయి. ధనలాభం, వ్యాపారంలో మంచి అభివృద్ధి, తలపెట్టిన పనులు నెరవేరును. గృహనిర్మాణ పనులు పూర్తగును. బంధు విరోధములుంటాయి. వివాహ ప్రయత్నములు, పనులు పూర్తి చేస్తారు. శత్రు జయము.

జూన్ నెల

ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. తీర్థయాత్రలు చేస్తారు. వస్తువులు, ఆభరణములు కొంటారు. సంతానపరంగా ధనవ్యయము. దేవాలయ దర్శనం చేస్తారు. స్థిరాస్తి విక్రయము. స్నేహితులు శత్రువులుగా మారును. ప్రమాద సూచనలున్నాయి. అనారోగ్య సమస్యలుంటాయి.

జూలై నెల

ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. కుటుంబ సభ్యులతో ఆనందముగా గడుపుతారు. వ్యవసాయములో చిక్కులు, గొడవలు వచ్చును. ఉద్యోగఅవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు అనుకూలం. ఆదాయమునకు మించిన ఖర్చులుంటాయి. వాహన భయము. కొత్త ప్రయత్నాలు ఫలించును.

ఆగస్టు నెల

ఈ మాసం మీకు అన్ని విధాలుగా కలసివచ్చును. నూతన వస్త్రములు కొంటారు. మానసిక ఆలోచనలు చేయుదురు. కొన్ని అవమానాలుంటాయి.

సెప్టెంబర్ నెల

ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. సంఘములో గౌరవం ఉంటుంది. విపరీతమైన కోపము. మాట పట్టింపులుంటాయి. ఆరోగ్యంలో స్వల్ప లోపములు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. బంధుమిత్రుల రాక.

అక్టోబర్ నెల

ఈ మాసం మీకు అంత అనుకూలంగా లేదు. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. మానసికాందోళన. గౌరవ హాని, కార్యహాని. ఇంటా బయటా విరోధములు ఉంటాయి. అధికార ఒత్తిడి. పనుల్లో ఆటంకాలు. స్నేహితులు కలసివచ్చును.

నవంబర్ నెల

ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. అన్ని పనులలో ఆటంకాలు. వ్యాపార, వ్యవసాయపరంగా అనుకూలించును. వాహనము కొంటారు. మానసికాందోళన. దూర ప్రయాణాలుంటాయి. ప్రేమఅనుకూలించును. ధనపరంగా స్వల్ప ఇబ్బందులు.

డిసెంబర్ నెల

ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. భూమి తగాదాలు. గర్వము పెరుగును. శారీరక అలసట. శుభకార్యములు చేస్తారు. ప్రముఖులతో సంభాషణ. సంఘములో రాజీనామాలు చేస్తారు. ఒప్పందాలకు అనుకూలం. తోబుట్టువులతో విరోధాలు.

జనవరి నెల

ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. శుభకార్యాలకు ధనంవిరివిగా ఖర్చు చేస్తారు. వాహన ప్రమాదాలుంటాయి. దైవదర్శనము. ఇతరుల వలన ఇబ్బందులు పడతారు. అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటారు. అవమానపడతారు.

ఫిబ్రవరి నెల

ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. ధన నష్టము, స్త్రీ అపవాదులుంటాయి. వినోదాలకై ధనం ఖర్చు చేస్తారు. శుభకార్యములలో పాల్గొంటారు. పోలీసులతో గొడవలు పెరుగును. ఖర్చులు అధికమగును. మీ తెలివితేటలతో జాగ్రత్తగా ముందుకు వెళ్తారు.

మార్చి నెల

ఈ మాసం మీకు మధ్యస్థంగా ఉన్నది. పుణ్య నదీ స్నానాలు చేస్తారు. సంతానపరంగా ఖర్చులు. రుణ ప్రయత్నాలు కలసివచ్చును. వస్తు సామాగ్రి కొంటారు. నరఘోషఅధికమగును. పదవులు, సభ్యత్వాలు వచ్చును. గౌరవముంటుంది. అనారోగ్య సమస్యలు.

చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe