జూలై నెలలో రెండు ప్రధాన గ్రహాలు తిరోగమనం, ఈ 3 రాశులకు పనుల్లో ఇబ్బందులు.. అలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది!
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల తిరోగమనం సాధారణ సంఘటనగా పరిగణించబడదు. జీవితంలో అనేక విధాలుగా గ్రహాల తిరోగమన ప్రభావం చూపిస్తుంది. జూలై నెలలో రెండు గ్రహాలు తిరోగమనం చెందుతాయి. దీంతో కొన్ని రాశులకు సవాళ్లు, సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది.
జూలై నెలలో రెండు గ్రహాలు తిరోగమనం చెందుతాయి. దీంతో కొన్ని రాశులకు సవాళ్లు, సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రాశుల వారు కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. జూలైనెల చాలా ముఖ్యమైన నెల కాబోతుంది.

గ్రహాల తిరోగమనం
ఈ సమయంలో మూడు గ్రహాలుశని, బుధుడు, వరుణుడు తిరోగమన కదలికలోకి ప్రవేశిస్తాయి. జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల తిరోగమనం సాధారణ సంఘటనగా పరిగణించబడదు. జీవితంలో అనేక విధాలుగా గ్రహాల తిరోగమన ప్రభావం చూపిస్తుంది. వ్యక్తి వేసుకునే సామర్థ్యం, సంబంధాలు, చర్యలపై ఇవి తీవ్రమైన ప్రభావం చూపిస్తాయి. ముఖ్యంగా మూడు గ్రహాలు తిరోగమనం చెందడం వల్ల ఈ ప్రభావం మరింత శక్తివంతంగా ఉంటుంది.
శని, బుధుడు, వరుణుడు
శనిన్యాయ దేవుడు. మనం చేసే మంచి పనులకు మంచి ఫలితాలను, చెడు పనులకు చెడు ఫలితాలను ఇస్తాడు. కమ్యూనికేషన్‌తో సంబంధం ఉన్న బుధుడు కూడా ఈ సమయంలో ఇబ్బందులను కలిగిస్తాడు. ఊహ, ఆధ్యాత్మికతకు కారకుడైన వరుణుడు కూడా తిరోగమనం చెందుతాడు.
ఈ మూడింటి తిరోగమనంకొన్ని రాశుల వారికి సమస్యలను తీసుకువచ్చే అవకాశం ఉంది. అయితే, ఏ రాశుల వారికి గ్రహాల తిరోగమనం సమస్యలను తీసుకువస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
జూలై నెలలో రెండు ప్రధాన గ్రహాల తిరోగమనంతో మూడు రాశుల వారికి సమస్యలు:
1.సింహ రాశి:
బుధుడి తిరోగమనం కారణంగా సింహ రాశివారికి చిన్నపాటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. కెరీర్‌లో ఈ రాశి వారు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. పని ప్రదేశంలో చిన్న తప్పు చేసినా పెద్ద సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలో టెన్షన్ ఎక్కువ అవుతుంది. భాగస్వామితో చిన్నపాటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. మీ భాగస్వామితో నిజాయితీగా ఉండండి. అసత్యం చెప్పడం వలన పెద్దపెద్ద గొడవలు జరిగే అవకాశం ఉంది.
2.తులా రాశి:
తులా రాశివారికి శని, బుధుడు తిరోగమనం వలన చిన్నపాటి ఇబ్బందులు ఎదురవుతాయి. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయకండి. చిన్నపాటి సమస్యల్ని కూడా లైట్ తీసుకోవద్దు. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు రెండు సార్లు ఆలోచించండి.
3.కుంభ రాశి:
కుంభ రాశివారికి జూలైలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఈ గ్రహాలు తిరోగమనం చెందడం వలన కుంభరరాశి వారికి ఇబ్బందులు రావచ్చు. ఎవరితోనైనా ఇబ్బందిగా ఉంటే, వారికి దూరంగా ఉండడం మంచిది. ఆర్థిక నష్టం, సమయం వృధా అయ్యే అవకాశం ఉంది. ఇలా జూలై నెలలో ఈ రాశి వారు కూడా చిన్నపాటి ఇబ్బందులు ఎదుర్కొంటారు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper













