తలపై రెండు సుడులు ఉంటే రెండు పెళ్ళిళ్ళు అవుతాయా? వీరి వ్యక్తిత్వం గురించి జ్యోతిష్కులు చెప్పిన రహస్యాలు తెలుసుకోండి!
కొందరికి రెండు సుడులు ఉంటాయి. ఇలాంటి వారిని చూడగానే చాలా మంది మొదట 'రెండు సుడులు వున్నాయి. రెండు పెళ్లిళ్లు అవుతాయి' అంటారు. చిన్నప్పుడు ఇలా చాలా మంది ఆట పట్టిస్తూ ఉంటారు. రెండు సుడులు ఉంటే వారు ఎలా ఉంటారు? రెండు సుడులకు సంబంధించి జ్యోతిష్యులు చెప్పిన ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక్కో మనిషి వ్యక్తిత్వం, తీరు ఒక్కో విధంగా ఉంటుంది. కొంతమంది చాలా ప్రశాంతంగా ఉంటారు, కొంతమంది ఎక్కువ కోపంతో ఉంటారు, కొంతమంది యాక్టివ్‌గా ఉంటే, కొంత మంది చాలా మౌనంగా ఉంటారు, తక్కువ సమాధానం చెప్తారు. అయితే చాలా మందికి తలపై ఒక సుడి మాత్రమే ఉంటుంది, కొందరికి మాత్రం రెండు సుడులు ఉంటాయి.

ఇలాంటి వారిని చూడగానే చాలా మంది మొదట 'రెండు సుడులు వున్నాయి. రెండు పెళ్లిళ్లు అవుతాయి' అంటారు. చిన్నప్పుడు ఇలా చాలా మంది ఆట పట్టిస్తూ ఉంటారు. అయితే, రెండుసుడులు ఉంటే వారు ఎలా ఉంటారు? రెండు సుడులకు సంబంధించి జ్యోతిష్యులు చెప్పిన ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రెండు సుడులు
సాధారణంగా జన్యు శాస్త్రం ప్రకారం చూస్తే తలపై సుడులసంఖ్య ఆధారంగా ఉంటుంది. ఒకవేళ తల్లిదండ్రులకే కానీ, తాత ముత్తాతలకే కానీ రెండు సుడులు ఉన్నట్లయితే అలా రావచ్చు. అయితే రెండు సుడులు చాలా అరుదుగా ఉంటాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రెండు సుడులు ఉన్నవారికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. మీకు రెండు సుడులు ఉన్నాయా? అయితే మీ గురించి కూడా మీరు ఇప్పుడు తెలుసుకోవచ్చు.
రెండు సుడులు ఉన్న వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది?
రెండు సుడులు ఉన్నవారు కొన్ని ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటారు. రెండు సుడులు ఉన్నవారు ముక్కుసూటిగా మాట్లాడతారు. స్నేహపూర్వక స్వభావం కలిగి ఉంటారు. ఎక్కువఓర్పుతో ఉంటారు. కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేయడానికి ఎప్పుడూ ముందే ఉంటారు. రెండు సుడులు ఉన్నవారు చుట్టూ ఉన్నవారిని ఎప్పుడూ సంతోషంగా ఉంచుతారు. అదే వారే ప్రధాన లక్ష్యం.
రెండు పెళ్లిళ్లు జరిగే అవకాశం వుంది
ఇదిలా ఉంటే, కొంతమంది జ్యోతిష్యుల ప్రకారం రెండు సుడులు ఉన్న వారి వైవాహికజీవితంలో ఒడిదుడుకులు రావచ్చట. ఒకవేళ మొదటి పెళ్లి సజావుగా సాగకపోతే మరో పెళ్లి చేసుకునే ఛాన్స్ ఉందట. అయితే దీని వెనక ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.
మంచి నాయకులు
అదే విధంగా రెండు సుడులు ఉన్నట్లయితే సృజనాత్మకంగా ఆలోచిస్తారు, కొత్త ఆలోచనలను ఎప్పుడూ స్వీకరిస్తూ ఉంటారు. రెండు సుడులు ఉన్నవారికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అదే విధంగా రెండు సుడులు ఉన్న వారికి ఎక్కువ అదృష్టంకూడా కలిగి ఉంటుందట. అయితే, చాలా గ్రామాల్లో రెండు సుడులు ఉంటే రెండు పెళ్లిళ్లు అవుతాయని అంటుంటారు. కానీ దీని వెనక ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. మామూలుగా రెండు సుడులకు సంబంధించి వివాహానికి సంబంధించి సూచనలు ఉన్నప్పటికీ అవి తప్పనిసరి అని ఎవరు చెప్పలేరు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper



