...
...
Next Story

2025 శ్రావణ మాసం ఎప్పుడు మొదలవుతుంది, ఎన్ని శుక్రవారాలు వచ్చాయి? వరలక్ష్మీ వ్రతం తేదీ, శుభ సమయం తెలుసుకోండి!

శ్రావణమాసంలో వచ్చే వ్రతాలు, నోములు, పూజలు చేయడం వలన సంతోషంగా ఉండొచ్చు, సకల సౌభాగ్యాలు కలుగుతాయి. శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం చేయడం కూడా ఆనవాయితీ, ఇది స్త్రీలు ఆచరించే ముఖ్యమైన వ్రతం. శ్రావణమాసం ఎప్పటి నుంచి మొదలవుతోంది, శ్రావణ మాసంలో ఎన్ని శుక్రవారాలు వచ్చాయి వంటి వివరాలు తెలుసుకుందాం.

Published on: Jul 7, 2025, 16:30:17 IST
By , , Hyderabad
Prefer HTon Google
Advertisement

శ్రావణ మాసానికి ఉన్న విశిష్టత ఇంతా అంతా కాదు. శ్రావణమాసంలో వరలక్ష్మీ వ్రతం, మంగళ గౌరీ వ్రతం వంటి ముఖ్యమైన పూజలు జరుపుకుంటాము. ప్రతి సంవత్సరం జూలై లేదా ఆగస్టులో లక్ష్మీ దేవికి పూజలు చేయడం వలన విశేష ఫలితాలను పొందవచ్చు. శ్రావణమాసంలో వచ్చే వ్రతాలు, నోములు, పూజలు చేయడం వలన సంతోషంగా ఉండొచ్చు, సకల సౌభాగ్యాలు కలుగుతాయి.

వరలక్ష్మీ వ్రతం 2025 (pinterest)
వరలక్ష్మీ వ్రతం 2025 (pinterest)

శ్రావణశుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం చేయడం కూడా ఆనవాయితీ, ఇది స్త్రీలు ఆచరించే ముఖ్యమైన వ్రతం. అలాగే, శ్రావణ మంగళవారం నాడు మంగళ గౌరీ వ్రతాన్ని కూడా పాటిస్తారు. శ్రావణమాసంలో వచ్చే శుక్రవారం నాడు లక్ష్మీదేవిని, శ్రావణమాసంలో వచ్చే మంగళవారాల్లో గౌరీదేవిని ఆరాధించడం వలన సకల సంతోషాలు కలుగుతాయి.

శ్రావణ మాసం

ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్లయిన వారు వేరుగా ఉంటారు, శ్రావణమాసంతో వారు కలుస్తారు. పండుగలకు అందాన్ని తెస్తుంది శ్రావణ మాసం. అయితే, ఈసారి శ్రావణమాసం ఎప్పటి నుంచి మొదలవుతోంది, శ్రావణ మాసంలో ఎన్ని శుక్రవారాలు వచ్చాయి, వరలక్ష్మీవ్రతం ఎప్పుడు వచ్చింది, వరలక్ష్మీ వ్రతం ఏ సమయానికి చేయాలి వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

శ్రావణ మాసం ఎప్పుడు మొదలవుతుంది?

ఈసారి శ్రావణ మాసం జూలై 25 శుక్రవారం నుంచి మొదలవుతుంది, ఆగస్టు 22 శుక్రవారంతో ముగుస్తుంది.

శ్రావణ శుక్రవారాల పూర్తి వివరాలు

మొదటి శ్రావణ శుక్రవారం జూలై 25న వచ్చింది, తిధి పాడ్యమి, నక్షత్రం పుష్యమి.

రెండవ శ్రావణ శుక్రవారం ఆగస్టు 1, తిధి అష్టమి, నక్షత్రం స్వాతి.

మూడవ శ్రావణ శుక్రవారం ఆగస్టు 8, తిధి చతుర్దశి, నక్షత్రం ఉత్తరాషాఢ.

ఐదవ శ్రావణ శుక్రవారం ఆగస్టు 22, తిధి చతుర్దశి, నక్షత్రం ఆశ్లేష.

వరలక్ష్మీ వ్రతం 2025

ఆగస్టు 8 శ్రావణ మాసంలో వచ్చే మూడవ శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతాన్ని జరుపుకుంటాము.

రాహుకాలం: ఉదయం 10:46 నుంచి 12:21 వరకు

దుర్ముహూర్తం ఉదయం 8:55 నుంచి 9:24 వరకు

మధ్యాహ్నం 12:45 నుంచి 1:37 వరకు ఉంటుంది

వరలక్ష్మీ వ్రతం శుభ సమయం

ఉదయం 6:30 నుంచి 8:32 వరకు

ఉదయం 9:24 నుంచి 10:46 వరకు

ఉదయం 11:46 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు

సాయంత్రం5:25 నుంచి సాయంత్రం 7:25 వరకు

ఐదు శుక్రవారాలు

ఈసారి శ్రావణమాసంలో మొత్తం ఐదు శుక్రవారం వచ్చాయి. సర్వసాధారణంగా శ్రావణమాసంలో వచ్చే రెండవ శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం ఆచరించాలి, కానీ ఈసారి మూడవ శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతాన్ని చేసుకోవాలి. శ్రావణమాసంలో చంద్రుడిని పూజిస్తే మనశ్శాంతి లభిస్తుంది. ఈసారి శ్రావణమాసంలో మంగళవారాలు కూడా ఐదు వచ్చాయి.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe