వాస్తు చిట్కాలు: ఈ 5 ఫోటోలను ఇంట్లో ఎప్పుడూ పెట్టకూడదు.. పనులు నిలిచిపోతాయి, ఉద్యోగంలోనూ సమస్యలు!
వాస్తు ప్రకారం ఇంట్లో కొన్ని వస్తువులను పొరపాటున కూడా పెట్టకూడదు. వీటిని ఇంట్లో ఉంచినట్లయితే సమస్యలు వస్తాయి, దురదృష్టం కూడా కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందులను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి వాస్తు ప్రకారం ఇంట్లో వేటిని పెట్టకూడదు అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
వాస్తు ప్రకారం పాటించడం వలన సానుకూల శక్తి ప్రవహిస్తుంది, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. వాస్తు ప్రకారం పాటించడం వలన ఏ ఇబ్బంది కూడా ఉండదు. వాస్తు ప్రకారం ఇంట్లో కొన్ని వస్తువులను పొరపాటున కూడా పెట్టకూడదు. వీటిని ఇంట్లో ఉంచినట్లయితే సమస్యలు వస్తాయి, దురదృష్టం కూడా కలుగుతుంది. మరి వాస్తుప్రకారం ఇంట్లో వేటిని పెట్టకూడదు అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

వాస్తు ప్రకారం పొరపాటున కూడా 5 ఇంట్లో పెట్టకండి:
1.మునిగిపోతున్న ఓడ:
మునిగిపోతున్న ఓడ ఫోటోలువంటి వాటిని ఇంట్లో పెట్టడం వలన ప్రతికూల శక్తి కలుగుతుంది. సానుకూల శక్తి దూరమైపోతుంది. ఆర్థిక ఇబ్బందులను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు రావచ్చు.
2.యుద్ధానికి సంబంధించినవి:
యుద్ధానికి సంబంధించిన ఫోటోలను ఇంట్లో పెట్టడం మంచిది కాదు. మహాభారతానికి సంబంధించిన యుద్ధ ఫోటోలను కూడా ఇంట్లో పెట్టకూడదు. వీటి వలన ప్రతికూలశక్తిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మానసిక ఒత్తిడి కూడా పెరిగిపోతుంది.
3.పిల్లలు ఏడుస్తున్న ఫోటోలు:
పిల్లలు ఏడుస్తున్న ఫోటోలను ఇంట్లో పెట్టడం మంచిది కాదు. అవి దురదృష్టాన్ని తీసుకొస్తాయి. నవ్వుతున్న పిల్లల ఫోటోలను ఇంట్లో పెడితే మాత్రం అదృష్టం కలిసి వస్తుంది. ఏడుస్తున్న పిల్లల ఫోటోలను పెడితే ఒత్తిడి పెరిగిపోతుంది, సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
4.గులాబీ మొక్క ఫోటోలు:
గులాబీ మొక్క ఫోటోలను ఇంట్లో పెట్టడం మంచిది కాదు. వీటి ముళ్లు ప్రతికూలతను సూచిస్తాయి. గులాబీ మొక్కల ఫోటోలను పెట్టడం వలన ఆర్థికనష్టం కలిగే అవకాశం ఉందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఈ ఫోటోలను ఇంట్లో పెట్టకండి.
5.నటరాజ విగ్రహం:
ఇంట్లో నటరాజ విగ్రహాన్ని పెట్టడం వలన సానుకూల శక్తి తొలగిపోతుంది, ప్రతికూల శక్తిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. శివుడుతాండవం చేస్తున్న ఫోటో కోపాన్ని సూచిస్తుంది. అటువంటి ఫోటోలను పెట్టడం వలన ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. సమస్యలను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper



