...
...
Next Story

Vastu Tips: మానసిక ఒత్తిడితో బాధ పడుతున్నారా? ప్రశాంతంగా ఉండాలంటే ఇంట్లో ఈ మూడు మార్పులను వెంటనే చేసి చూడండి!

చాలామంది రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంటి పనులు, ఆఫీస్ పనులు ఇలా చాలా వాటితో ఇబ్బంది పడుతూ ఉంటారు. వాస్తు లోపాలు ఉన్నట్లయితే మానసిక ప్రశాంతత కూడా ఉండదు. వాస్తు ప్రకారం ఈ నియమాలను పాటిస్తే మానసిక ఒత్తిడి లేకుండా సంతోషంగా ఉండొచ్చు.

Published on: Oct 21, 2025, 15:00:18 IST
Advertisement

వాస్తు ప్రకారం అనుసరించడం వలన సానుకూల శక్తి ప్రవహించి, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. వాస్తు ప్రకారం పాటించడం వలన ఇబ్బందులు కూడా ఉండవు, ఆనందంగా ఉండొచ్చు. ఎలాంటి సమస్యలు ఉన్నా సరే తొలగిపోతాయి. వాస్తు ప్రకారం ఈరోజు కొన్ని నియమాలను తెలుసుకుందాం. వీటిని పాటించినట్లయితే సంతోషంగా ఉండొచ్చు, మానసిక ఒత్తిడి కూడా దూరం అవుతుంది. మరి ఇక మానసిక ఒత్తిడి నుంచి బయటపడి సంతోషంగా ఎలా ఉండొచ్చు అనే విషయాన్ని తెలుసుకుందాం.

ఇలా ప్రశాంతంగా

ఈ వాస్తు నియమాలను పాటిస్తే మానసిక ఒత్తిడి దూరం అవుతుంది
ఈ వాస్తు నియమాలను పాటిస్తే మానసిక ఒత్తిడి దూరం అవుతుంది

చాలామంది రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంటి పనులు, ఆఫీస్ పనులు ఇలా చాలా వాటితో ఇబ్బంది పడుతూ ఉంటారు. వేగవంతమైన జీవితంలో ప్రతి ఒక్కరు కూడా తమ కోసం కొంత సమయాన్ని కేటాయించాలి. మానసిక ఒత్తిడి కలగకుండా కొన్ని వాస్తు నియమాలను పాటించడం వలన ఇంటికి వచ్చిన తర్వాత మానసిక ప్రశాంతతను సులభంగా పొందవచ్చు, విశ్రాంతిని తీసుకోవచ్చు.

కానీ వాస్తు లోపాలు ఉన్నట్లయితే మానసిక ప్రశాంతత కూడా ఉండదు. వాస్తు ప్రకారం ఈ నియమాలను పాటిస్తే మానసిక ఒత్తిడి లేకుండా సంతోషంగా ఉండొచ్చు. ఇంట్లో ఉన్న చెడు శక్తిని వాస్తు నియమాల ద్వారా సరిచేయడానికి వీలవుతుంది.

ఈ వాస్తు నియమాలను పాటిస్తే మానసిక ఒత్తిడి దూరం అవుతుంది

1.ఇంట్లో మొక్కలు

ఇంట్లో మొక్కలు ఉండడం వలన సానుకూల శక్తి ప్రవహించి, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. కొన్ని మొక్కలు మానసిక ప్రశాంతతను పెంచుతాయి. అలాంటి మొక్కలను ఇంట్లో ఉంచడం వలన ప్రతికూల శక్తి దూరమవుతుంది, సానుకూల శక్తి వ్యాపిస్తుంది.

తులసి మొక్క: సానుకూల శక్తిని పెంపొందిస్తుంది. తులసి మొక్క ఇంట్లో ఉంటే లక్ష్మీ అనుగ్రహం కూడా లభిస్తుందని నమ్ముతారు.

వెదురు మొక్కలు: ఇంట్లో పెడితే సానుకూల శక్తి వ్యాపిస్తుంది, ప్రతికూల శక్తి తొలగిపోతుంది.

2.గోడల రంగులు

ఇంట్లో ఉండే గోడల రంగులు లైట్ కలర్స్ అయ్యేటట్టు చూసుకోండి. ఇలాంటి రంగులు సానుకూల శక్తిని కలిగించి, ప్రతికూల శక్తిని తొలగిస్తాయి. లైట్ కలర్ గోడలు విశ్రాంతిని ఇస్తాయి. తెలుపు, లేత పసుపు, నీలం, ఆకుపచ్చ రంగులు శుభప్రదమైనవి.

3.ఇంటిని శుభ్రంగా ఉంచండి

ఇల్లు శుభ్రంగా ఉంటే ప్రశాంతంగా అనిపిస్తుంది. మానసిక ప్రశాంతతను పొందడానికి కూడా వీలవుతుంది. కాబట్టి ఇల్లు ఎప్పుడూ శుభ్రంగా ఉంచేటట్టు చూసుకోవాలి.

4.విరిగిపోయిన వస్తువులు

ఇంట్లో విరిగిపోయిన వస్తువులు, అనవసరమైనవి ఉంటే తొలగించాలి. అవి ప్రతికూల శక్తిని కలిగిస్తాయి, సానుకూల శక్తిని దూరం చేస్తాయి. కాబట్టి అనవసరమైన వాటిని కూడా ఇంటి నుంచి తొలగించడం మంచిది.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe