చాలామంది వాస్తు ప్రకారం పాటిస్తారు. వాస్తు ప్రకారం అనుసరించడం వలన ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి. వాస్తుప్రకారం పాటిస్తే సానుకూల శక్తి కూడా వ్యాపిస్తుంది, సంతోషంగా ఉండొచ్చు. జ్యోతిష్య శాస్త్రంలో వాస్తు శాస్త్రానికి ఎక్కువ ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఉన్నాయి. వాస్తు నియమాలను కనక సరిగ్గా పాటించకపోతే ఇబ్బందులు వస్తాయి.

చాలా మంది సంతోషంగాఉండాలని, ఇంట్లో సానుకూల శక్తి వ్యాప్తి చెందాలని చూస్తూ ఉంటారు. కొన్ని మొక్కలు ఇంట్లో పెడితే అదృష్టం కలిసి వస్తుంది, శ్రేయస్సు కలుగుతుంది. అటువంటి మొక్కల్లో వెదురు మొక్క కూడా ఒకటి.
వెదురు మొక్కతో లాభాలు
వెదురు మొక్కను చాలా మంది ఇళ్లలో పెంచుతూ ఉంటారు. వెదురు మొక్క చూడడానికి అందంగా ఉండడమే కాదు, డబ్బును కూడా తీసుకువస్తుంది. వెదురు మొక్క ఇంట్లో ఉండేటప్పుడు పాటించాల్సిన వాస్తు నియమాల గురించి చూద్దాం.
ఇంట్లో వెదురు మొక్క
ఇంట్లో వెదురు మొక్కను పెడితే మంచి జరుగుతుంది, అదృష్టంకూడా కలిసి వస్తుంది. లక్ష్మీదేవి వెదురు మొక్కలో కొలువై ఉంటుంది. వెదురు మొక్క ఉన్న ఇంట్లో సిరి సంపదలకు లోటే ఉండదు. ఆర్థిక పరంగా కూడా కలిసి వస్తుంది. మంచి ఫలితాలు రావాలంటే వెదురు మొక్కను ఇంట్లో కానీ, ఆఫీసులో కానీ ఆగ్నేయం వైపు పెడితే మంచిది. ఈ కారణంగా సంపద పెరుగుతుంది, ఆర్థిక ఇబ్బందులు కూడా రావు.
వెదురు మొక్కను ఏ దిశలో పెట్టాలి?
వెదురు మొక్కను పెట్టేటప్పుడు తూర్పు దిశలోపెట్టడం మంచిది. ఇది కుటుంబాన్ని సూచిస్తుంది. సూర్యకాంతి వచ్చే చోట పెడితే చాలా మంచి జరుగుతుంది.
వెదురు మొక్క పెట్టేటప్పుడు కొన్ని పొరపాట్లు చేయకూడదు
- వెదురు మొక్కను పెట్టేటప్పుడు బెడ్‌రూమ్‌లో ఉంచకూడదు. వీలైనంత వరకు లివింగ్‌రూమ్‌లో కానీ, చదువుకునే చోట కానీ పెట్టడం మంచిది.
- పని ప్రదేశంలో పెడితే సానుకూల శక్తి వ్యాపిస్తుంది. అంతేకాదు, వెదురు మొక్క గాలిని శుద్ధి చేస్తుంది.
- ఇంట్లో ఈ మొక్కను ఉంచడం వలన విషాన్ని తొలగించి ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది. సానుకూల శక్తిని కలిగించేటట్లు చేస్తుంది, సంతోషంగా ఉండటానికి కూడా ఉపయుక్తంగా ఉంటుంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
{{/usCountry}}గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
{{/usCountry}}