వాస్తు ప్రకారం ఇంట్లో వెదురు మొక్కను పెడితే ఏమవుంది? ఎలాంటి ఫలితాలను పొందవచ్చో తెలుసుకోండి!

చాలా మంది సంతోషంగా ఉండాలని, ఇంట్లో సానుకూల శక్తి వ్యాప్తి చెందాలని చూస్తూ ఉంటారు. కొన్ని మొక్కలు ఇంట్లో పెడితే అదృష్టం కలిసి వస్తుంది, శ్రేయస్సు కలుగుతుంది. వాస్తు ప్రకారం ఇంట్లో వెదురు మొక్కను పెడితే ఏమవుంది? ఎలాంటి ఫలితాలను పొందవచ్చో తెలుసుకోండి. 

Published on: Jul 16, 2025, 09:00:00 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

చాలామంది వాస్తు ప్రకారం పాటిస్తారు. వాస్తు ప్రకారం అనుసరించడం వలన ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి. వాస్తుప్రకారం పాటిస్తే సానుకూల శక్తి కూడా వ్యాపిస్తుంది, సంతోషంగా ఉండొచ్చు. జ్యోతిష్య శాస్త్రంలో వాస్తు శాస్త్రానికి ఎక్కువ ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఉన్నాయి. వాస్తు నియమాలను కనక సరిగ్గా పాటించకపోతే ఇబ్బందులు వస్తాయి.

వాస్తు ప్రకారం ఇంట్లో వెదురు మొక్కను పెడితే ఏమవుంది? (pinterest)
వాస్తు ప్రకారం ఇంట్లో వెదురు మొక్కను పెడితే ఏమవుంది? (pinterest)

చాలా మంది సంతోషంగాఉండాలని, ఇంట్లో సానుకూల శక్తి వ్యాప్తి చెందాలని చూస్తూ ఉంటారు. కొన్ని మొక్కలు ఇంట్లో పెడితే అదృష్టం కలిసి వస్తుంది, శ్రేయస్సు కలుగుతుంది. అటువంటి మొక్కల్లో వెదురు మొక్క కూడా ఒకటి.

వెదురు మొక్కతో లాభాలు

వెదురు మొక్కను చాలా మంది ఇళ్లలో పెంచుతూ ఉంటారు. వెదురు మొక్క చూడడానికి అందంగా ఉండడమే కాదు, డబ్బును కూడా తీసుకువస్తుంది. వెదురు మొక్క ఇంట్లో ఉండేటప్పుడు పాటించాల్సిన వాస్తు నియమాల గురించి చూద్దాం.

ఇంట్లో వెదురు మొక్క

ఇంట్లో వెదురు మొక్కను పెడితే మంచి జరుగుతుంది, అదృష్టంకూడా కలిసి వస్తుంది. లక్ష్మీదేవి వెదురు మొక్కలో కొలువై ఉంటుంది. వెదురు మొక్క ఉన్న ఇంట్లో సిరి సంపదలకు లోటే ఉండదు. ఆర్థిక పరంగా కూడా కలిసి వస్తుంది. మంచి ఫలితాలు రావాలంటే వెదురు మొక్కను ఇంట్లో కానీ, ఆఫీసులో కానీ ఆగ్నేయం వైపు పెడితే మంచిది. ఈ కారణంగా సంపద పెరుగుతుంది, ఆర్థిక ఇబ్బందులు కూడా రావు.

వెదురు మొక్కను ఏ దిశలో పెట్టాలి?

వెదురు మొక్కను పెట్టేటప్పుడు తూర్పు దిశలోపెట్టడం మంచిది. ఇది కుటుంబాన్ని సూచిస్తుంది. సూర్యకాంతి వచ్చే చోట పెడితే చాలా మంచి జరుగుతుంది.

వెదురు మొక్క పెట్టేటప్పుడు కొన్ని పొరపాట్లు చేయకూడదు

  • వెదురు మొక్కను పెట్టేటప్పుడు బెడ్‌రూమ్‌లో ఉంచకూడదు. వీలైనంత వరకు లివింగ్‌రూమ్‌లో కానీ, చదువుకునే చోట కానీ పెట్టడం మంచిది.
  • పని ప్రదేశంలో పెడితే సానుకూల శక్తి వ్యాపిస్తుంది. అంతేకాదు, వెదురు మొక్క గాలిని శుద్ధి చేస్తుంది.
  • ఇంట్లో ఈ మొక్కను ఉంచడం వలన విషాన్ని తొలగించి ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది. సానుకూల శక్తిని కలిగించేటట్లు చేస్తుంది, సంతోషంగా ఉండటానికి కూడా ఉపయుక్తంగా ఉంటుంది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More