...
...
Next Story

జూలై 6న శుక్రుడి, శని లాభదృష్టి యోగం, ఈ ఐదు రాశులకు బోలెడు లాభాలు.. డబ్బు, ప్రమోషన్లు ఇలా ఎన్నో!

జూలై 6న శుక్రుడు, శని లాభదృష్టి యోగాన్ని ఏర్పరుస్తున్నారు. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. ఈ యోగం ఐదు రాశుల వారికి లాభాలను అందిస్తుంది. లాభ దృష్టి యోగం ఏ రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది? ఎవరు ఎలాంటి లాభాలను పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం.

Published on: Jul 4, 2025, 10:30:14 IST
By , , Hyderabad
Prefer HTon Google
Advertisement

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం తన కదలికలను ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటుంది. గ్రహాల గమనం మారడం వలన విశేషమైన ప్రయోజనాలను పొందవచ్చు. జ్యోతిషశాస్త్ర లెక్కల ప్రకారం, జూలై 6న శుక్రుడు, శని లాభదృష్టి యోగాన్ని ఏర్పరుస్తున్నారు. ఈ యోగం ఐదు రాశుల వారికి లాభాలను అందిస్తుంది. లాభ దృష్టి యోగం ఏ రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది? ఎవరు ఎలాంటి లాభాలను పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం.

లాభదృష్టి యోగంతో ఈ ఐదు రాశుల వారికి బోలెడు లాభాలు:

లాభదృష్టి యోగంతో ఈ ఐదు రాశుల వారికి బోలెడు లాభాలు (pinterest)
లాభదృష్టి యోగంతో ఈ ఐదు రాశుల వారికి బోలెడు లాభాలు (pinterest)

శని, శుక్రుడు లాభ దృష్టి యోగాన్ని ఏర్పరుస్తున్నారు. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. మరి ఈ రాశుల్లో మీ రాశి కూడా ఉందేమో చూసుకోండి.

1.వృషభ రాశి:

వృషభ రాశివారికి శని, శుక్ర లాభదృష్టి యోగం అనేక మార్పులను తీసుకువస్తుంది. ఈ సమయంలో వృషభ రాశి వారు ఆర్థిక బలాన్ని, ఆస్తి ప్రయోజనాలను పొందుతారు. ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది. వివాహం చేసుకోవడానికి కూడా ఇది మంచి సమయం.

2.కర్కాటక రాశి:

కర్కాటకరాశి వారికి ఈ యోగం అనేక లాభాలను తీసుకు వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. మనశ్శాంతి, సంతోషం పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఇన్వెస్ట్మెంట్ చేస్తే కూడా మంచి లాభాలు వస్తాయి.

3.తులా రాశి:

తులా రాశి వారికి ఈ సమయంలో విలాసవంతమైన జీవితం వస్తుంది. కొత్త కారు, ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది. పేరు, ప్రతిష్టలు పెరుగుతాయి. కోర్టు కేసుల నుంచి ఉపశమనం వస్తుంది.

4.మకర రాశి:

మకరరాశి వారికి ఈ సమయం కలిసి వస్తుంది. సక్సెస్ ను అందుకుంటారు. కళలు, ఫ్యాషన్ వంటి రంగాల్లో రాణిస్తారు. ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది.

5.మీన రాశి:

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks