జూన్ 29 వరకు శుక్రుని ధన శక్తి రాజయోగం, ఈ 3 రాశుల వారికి కాసుల వర్షం.. సమస్యలన్నీ మాయం!

వైదిక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు గత నెలలో కుజుడు రాశి అయినటువంటి మేష రాశిలోకి ప్రవేశించాడు. జూన్ 29 మధ్యాహ్నం శుక్రుడు వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ ధన శక్తి రాజయోగం వలన కొన్ని రాశుల వారికి కలిసి వస్తుంది. ఈ రాశుల వారు అనేక లాభాలను పొందుతారు. మరి వీరిలో మీరు ఒకరేమో చూసుకోండి.

Published on: Jun 24, 2025 12:00 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

వైదిక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు గత నెలలో కుజుడు రాశి అయినటువంటి మేష రాశిలోకి ప్రవేశించాడు. జూన్ 29 వరకు ఈ రాశిలోనే ఉంటాడు. ఈ రాశిలోకి శుక్రుడుప్రవేశించడంతో ధన శక్తి రాజయోగం జూన్ 29 వరకు ఉంటుంది. అప్పటివరకు కొన్ని రాశుల వారికి అదృష్టం కలగనుంది.

జూన్ 29 వరకు శుక్రుని ధన శక్తి రాజయోగం (pinterest)
జూన్ 29 వరకు శుక్రుని ధన శక్తి రాజయోగం (pinterest)

ధన శక్తి రాజయోగం

జూన్ 29 మధ్యాహ్నం శుక్రుడు వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ ధన శక్తి రాజయోగం వలన కొన్ని రాశుల వారికి కలిసి వస్తుంది. ఈ రాశుల వారు అనేక లాభాలను పొందుతారు. మరి వీరిలో మీరు ఒకరేమో చూసుకోండి.

ధన శక్తి రాజయోగంతో ఈ మూడు రాశుల వారికి అనేక లాభాలు:

1.వృశ్చిక రాశి:

వృశ్చికరాశి వారికి ధన శక్తి యోగం అనేక విధాలుగా సహాయపడుతుంది. ఈ సమయంలో ఈ రాశి వారు చాలా సమస్యల నుంచి బయటపడతారు. ధన శక్తి రాజయోగం సంపద ద్వారాలను తెరుస్తుంది. జూన్ 29 వరకు ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. వ్యాపారంలో లాభాలు ఉంటాయి.

ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. శుక్రుని ప్రభావంతో ఈ రాశి వారి అందం కూడా పెరుగుతుంది.

2.కర్కాటక రాశి:

కర్కాటక రాశివారికి ఈ సమయం బాగుంటుంది. ఈ సమయంలో ఈ రాశి వారు కష్టానికి తగ్గ ఫలితాన్ని పొందుతారు. ఆర్థిక లాభాలను కూడా పొందవచ్చు. ఈ సమయంలో ఈ రాశి వారి ఆదాయం పెరుగుతుంది. విద్యార్థులు చదువు పట్ల శ్రద్ధ పెడతారు. వ్యాపారంలో భారీగా లాభాలను పొందుతారు. ఈ రాశి వారికి గౌరవం కూడా పెరుగుతుంది.

3.మిధున రాశి:

మిధున రాశివారికి ధన శక్తి రాజయోగం అనేక లాభాలను తీసుకువస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు కష్టానికి తగ్గ ఫలితాన్ని పొందుతారు. ఉద్యోగంలో ఉన్నత స్థానాన్ని పొందుతారు. ఉద్యోగస్తులకు ఆదాయం పెరుగుతుంది. ఈ రాశి వారి పిల్లలు సంతోషంగా ఉంటారు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More