శుక్రుడి రాశి మార్పుతో ఈ మూడు రాశులకు గోల్డెన్ టైం మొదలు.. ధనం, ఉద్యోగాలు, ఫ్లాట్లు ఇలా ఎన్నో!
జూన్ 29న, ఆదివారం, శుక్రుడు తన సొంత రాశి అయినటువంటి వృషభ రాశిలోకి ప్రవేశించాడు. శుక్రుడు ప్రేమ, ఆనందం, విలాసాలకు కారకుడు. శుక్రుడు రాశి మార్పు 12 రాశులపై ప్రభావం చూపించినప్పటికీ, మూడు రాశుల వారికి మాత్రం శుభంగా మారింది. మరి వారిలో మీరూ ఒకరేమో చూసుకోండి.
గ్రహాలు ఎప్పటికప్పుడు రాశిని మారుస్తూ ఉంటాయి. ఆ గ్రహాలు రాశి మార్పు చెందినప్పుడు కొన్నిసార్లు శుభయోగాలు, కొన్నిసార్లు అశుభయోగాలు ఏర్పడతాయి. 9 గ్రహాలు కూడా కాలానికి అనుగుణంగా ఒక రాశి నుండి మరో రాశిలోకి వెళ్తూ ఉంటాయి.

జూన్ 29న, ఆదివారం, శుక్రుడుతన సొంత రాశి అయినటువంటి వృషభ రాశిలోకి ప్రవేశించాడు. శుక్రుడు ప్రేమ, ఆనందం, విలాసాలకు కారకుడు. శుక్రుడు రాశి మార్పు 12 రాశులపై ప్రభావం చూపించినప్పటికీ, మూడు రాశుల వారికి మాత్రం శుభంగా మారింది. మరి ఆ రాశులు వారు ఎవరు? వారు ఎలాంటి లాభాలను పొందారు? వంటి విషయాలను తెలుసుకుందాం.
శుక్రుడు రాశి మార్పుతో ఈ మూడు రాశుల వారికి అనేక లాభాలు:
1.వృశ్చిక రాశి:
వృశ్చికరాశి వారికి శుక్రుడి రాశి మార్పుతో గోల్డెన్ టైమ్ మొదలైంది. ఈ సమయంలో ఈ రాశి వారి సమస్యలన్నీ తొలగిపోతాయి. సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. వారికి జీవిత భాగస్వామితో గొడవలు తగ్గుతాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు, కొత్త మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. ప్రమోషన్లు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంది.
2.కర్కాటక రాశి:
కర్కాటకరాశి వారికి శుక్రుడి రాశి మార్పు శుభప్రదం. ఈ సమయంలో ఈ రాశి వారికి పెళ్లి కుదిరే అవకాశం ఉంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఎంతో మునుపటి కంటే నీ లైఫ్ బాగుంటుంది. ఇంట్లో ముఖ్యమైన పనులను చేపడతారు.
3.మేష రాశి:
మేష రాశి వారు శుక్రుడి రాశి మార్పుతో సక్సెస్‌ను అందుకుంటారు, సంతోషంగా ఉంటారు. ఈ సమయంలో ఈ రాశి వారికి ప్రమోషన్లు వచ్చే అవకాశం కూడా ఉంది. కొత్త ప్లాట్ లేదా ఫ్లాట్ కొనే అవకాశం ఉంది. జాబ్ ఆఫర్లు కూడా వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలో సంతోషం, ప్రశాంతత ఉంటాయి.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper













