గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. ఈ సమయంలో శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడతాయి. శుక్రుడు జూన్ 29న మధ్యాహ్నం 1:56 నిమిషాలకు వృషభ రాశిలో సంచరిస్తాడు.

ఈ సమయంలో కొన్ని రాశుల వారికి శుభ యోగాలు ఏర్పడతాయి. మరికొన్ని రాశుల వారు సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. శుక్రునివృషభ రాశి సంచారంతో ఎవరు ఎలాంటి ఫలితాలను ఎదుర్కొంటారు? ఎవరికి ఏ ఇబ్బంది కలుగుతుంది? ఇలాంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
శుక్రుని రాశి మార్పుతో ఈ మూడు రాశుల వారికి సమస్యలు తప్పవు:
1.సింహ రాశి
సింహ రాశి వారికి శుక్రుని వృషభ రాశి సంచారం చిన్నపాటి ఇబ్బందులను తీసుకువస్తుంది. ఈ సమయంలో సింహ రాశి వారు మానసిక ఒత్తిడి, చిన్న చిన్న సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఉద్యోగాల్లో కొన్ని సవాళ్లను ఎదుర్కోవాలి. ఆటంకాలు కూడా ఉండొచ్చు. అధికారులతో కొన్ని వివాదాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి సింహ రాశి వారు చేసే పనుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఆచితూచి వ్యవహరించాలి. ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవాలి.
2.మిథున రాశి
మిథున రాశి వారికి కూడా శుక్రుని రాశి మార్పు ఇబ్బందులను కలిగిస్తుంది. మిథున రాశి 12వ ఇంట్లో శుక్రుని సంచారం ఉండడంతో అప్పుడప్పుడు చిన్న చిన్న సమస్యలు రావచ్చు. వైవాహిక జీవితంలో కూడా ఇబ్బందులు కలగవచ్చు. ప్రేమించిన వారితో ఇబ్బందులు రావచ్చు. పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి చిన్న ఇబ్బందులు వస్తాయి. ఆర్థికపరంగా కూడా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు.
ఈ రాశుల వారు మాత్రం శుక్రుని రాశి మార్పుతో లాభాలను పొందుతారు:
- మేష రాశివారికి శుక్రుని వృషభ రాశి సంచారం మేష రాశి వారికి కలిసి వస్తుంది. మేష రాశి వారు సక్సెస్‌ను అందుకుంటారు. ఆర్థిక పరంగా కూడా లాభాలు ఉంటాయి.
- వృషభ రాశి వారికి కూడా శుక్రుని రాశి మార్పు శుభ ఫలితాలను తీసుకువస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. ఆదాయం కూడా పెరుగుతుంది. ఆర్థికపరంగా లాభాలు ఉంటాయి.
- కర్కాటకరాశి వారికి కూడా శుక్రుని రాశి మార్పు మంచి ఫలితాలను తీసుకువస్తుంది. వార్తలు వింటారు. అదృష్టం కలిసి వస్తుంది.
- కుంభ రాశి వారికి కూడా శుక్రుని రాశి మార్పు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో కుంభ రాశి వారు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఆర్థిక ఇబ్బందులు ఉండవు. సంతోషంగా ఉంటారు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
{{/usCountry}}గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
{{/usCountry}}