గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. అలాంటప్పుడు శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడడం సహజమే. గ్రహాలు రాశి మార్పు చేసినా, నక్షత్ర మార్పు చేసినా, అది మొత్తం 12 రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. ఒక్కోసారి కొన్ని రాశుల వారు ఎక్కువ లాభాలను పొందుతూ ఉంటారు. అలాగే ఒక్కోసారి సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
శుక్రుడు సంచారం

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం చూసినట్లయితే, సంపద, సౌందర్యం, ప్రేమకు కారకుడు అయినటువంటి శుక్రుడు తన సొంత రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీంతో ద్వాదశ రాశుల వారి జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. కొన్ని రాశుల వారు ఎక్కువ లాభాలను కూడా పొందుతారు. నవగ్రహాల్లో సంపదకు ప్రతీక అయినటువంటి శుక్రుడు వృషభ, తులా రాశులకు అధిపతి. ప్రేమ, అభిలాష, అందం, శ్రేయస్సు మొదలైన వాటికి కారకుడు.
తులా రాశిలోకి శుక్రుడు
నవంబర్ 2వ తేదీన శుక్రుడు తన సొంత రాశి అయినటువంటి తులా రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీని ప్రభావం ద్వాదశ రాశులపై పడుతుంది. కొన్ని రాశుల వారు మాత్రం విపరీతమైన అదృష్టాన్ని పొందుతారు. ఆర్థికపరంగా బాగుంటుంది. ఉద్యోగాల్లో విజయాలను సాధిస్తారు. వృత్తిలో అభివృద్ధిని చూస్తారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక లాభాలు కలుగుతాయి. మరి ఆ అదృష్ట రాశులు ఎవరు? ఆ రాశుల్లో మీరు కూడా ఉన్నారేమో చూసుకోండి.
సొంత రాశిలోకి శుక్రుడు ప్రవేశం.. ఈ రాశుల వారికి విపరీతమైన అదృష్టం:
1.మకర రాశి:
మకర రాశి పదవ ఇంట్లో శుక్రుడు ప్రవేశం జరుగుతుంది. దీంతో ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. వృత్తి, వ్యాపారాల్లో విజయాలను సాధిస్తారు. ఉద్యోగులకు కూడా బాగా కలిసి వస్తుంది. పదోన్నతులు పొందవచ్చు. కొత్త బాధ్యతలను చేపడతారు. మీ ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. నాయకత్వ లక్షణాలు ఎక్కువవుతాయి. ఈ సమయంలో ఈ రాశి వారి ఆదాయం కూడా పెరుగుతుంది. రాష్ట్రానికి సంబంధించిన వివాదాలు పరిష్కారం అవుతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు.
2.తులా రాశి:
తులా రాశి వారికి శుక్రుడు సంచారంలో మార్పు బాగా కలిసి వస్తుంది. సంబంధాలు మెరుగుపడతాయి. సంతోషంగా ఉంటారు. ఈ సమయంలో వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. కొత్త అవకాశాలను పొందుతారు. జీవితంలో అడ్డంకులు తొలగిపోయి సక్సెస్ను అందుకుంటారు.
{{/usCountry}}తులా రాశి వారికి శుక్రుడు సంచారంలో మార్పు బాగా కలిసి వస్తుంది. సంబంధాలు మెరుగుపడతాయి. సంతోషంగా ఉంటారు. ఈ సమయంలో వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. కొత్త అవకాశాలను పొందుతారు. జీవితంలో అడ్డంకులు తొలగిపోయి సక్సెస్ను అందుకుంటారు.
{{/usCountry}}కుటుంబ సమస్యలు కూడా తీరిపోతాయి. వ్యాపారులకు ఇది మంచి సమయం. నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. పనుల అడ్డంకులు తొలగిపోతాయి. కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆర్థికపరంగా బాగుంటుంది. ఉద్యోగులకు కూడా గుర్తింపు వస్తుంది.
3.కుంభ రాశి:
కుంభ రాశి వారికి శుక్రుడు సంచారం కారణంగా శుభ ఫలితాలు ఎదురవుతాయి. ఈ రాశి తొమ్మిదవ ఇంట్లో శుక్రుడు సంచారం చేస్తున్నాడు. దీంతో ప్రతి పనిలో విజయాన్ని అందుకుంటారు. కొన్ని ప్రయాణాల ద్వారా ఆర్థిక లాభాలను పొందుతారు.
మాటతీరు, తెలివితేటలతో ఇతరులను సులువుగా ఆకట్టుకుంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. వివాదాలు తొలగిపోతాయి. కొత్త పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగకరంగా ఉండొచ్చు