నవంబర్ 2న తులా రాశిలోకి శుక్రుడు, ఈ మూడు రాశులకు డబ్బు, విజయాలు, విపరీతమైన అదృష్టంతో పాటు ఎన్నో!
సంపద, సౌందర్యం, ప్రేమకు కారకుడు అయినటువంటి శుక్రుడు తన సొంత రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీంతో ద్వాదశ రాశుల వారి జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. నవంబర్ 2వ తేదీన శుక్రుడు తన సొంత రాశి అయినటువంటి తులా రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీని ప్రభావం 12 రాశులపై పడుతుంది.
గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. అలాంటప్పుడు శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడడం సహజమే. గ్రహాలు రాశి మార్పు చేసినా, నక్షత్ర మార్పు చేసినా, అది మొత్తం 12 రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. ఒక్కోసారి కొన్ని రాశుల వారు ఎక్కువ లాభాలను పొందుతూ ఉంటారు. అలాగే ఒక్కోసారి సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

శుక్రుడు సంచారం
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం చూసినట్లయితే, సంపద, సౌందర్యం, ప్రేమకు కారకుడు అయినటువంటి శుక్రుడు తన సొంత రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీంతో ద్వాదశ రాశుల వారి జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. కొన్ని రాశుల వారు ఎక్కువ లాభాలను కూడా పొందుతారు. నవగ్రహాల్లో సంపదకు ప్రతీక అయినటువంటి శుక్రుడు వృషభ, తులా రాశులకు అధిపతి. ప్రేమ, అభిలాష, అందం, శ్రేయస్సు మొదలైన వాటికి కారకుడు.
తులా రాశిలోకి శుక్రుడు
నవంబర్ 2వ తేదీన శుక్రుడు తన సొంత రాశి అయినటువంటి తులా రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీని ప్రభావం ద్వాదశ రాశులపై పడుతుంది. కొన్ని రాశుల వారు మాత్రం విపరీతమైన అదృష్టాన్ని పొందుతారు. ఆర్థికపరంగా బాగుంటుంది. ఉద్యోగాల్లో విజయాలను సాధిస్తారు. వృత్తిలో అభివృద్ధిని చూస్తారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక లాభాలు కలుగుతాయి. మరి ఆ అదృష్ట రాశులు ఎవరు? ఆ రాశుల్లో మీరు కూడా ఉన్నారేమో చూసుకోండి.
సొంత రాశిలోకి శుక్రుడు ప్రవేశం.. ఈ రాశుల వారికి విపరీతమైన అదృష్టం:
1.మకర రాశి:
మకర రాశి పదవ ఇంట్లో శుక్రుడు ప్రవేశం జరుగుతుంది. దీంతో ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. వృత్తి, వ్యాపారాల్లో విజయాలను సాధిస్తారు. ఉద్యోగులకు కూడా బాగా కలిసి వస్తుంది. పదోన్నతులు పొందవచ్చు. కొత్త బాధ్యతలను చేపడతారు. మీ ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. నాయకత్వ లక్షణాలు ఎక్కువవుతాయి. ఈ సమయంలో ఈ రాశి వారి ఆదాయం కూడా పెరుగుతుంది. రాష్ట్రానికి సంబంధించిన వివాదాలు పరిష్కారం అవుతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు.
2.తులా రాశి:
తులా రాశి వారికి శుక్రుడు సంచారంలో మార్పు బాగా కలిసి వస్తుంది. సంబంధాలు మెరుగుపడతాయి. సంతోషంగా ఉంటారు. ఈ సమయంలో వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. కొత్త అవకాశాలను పొందుతారు. జీవితంలో అడ్డంకులు తొలగిపోయి సక్సెస్‌ను అందుకుంటారు.
కుటుంబ సమస్యలు కూడా తీరిపోతాయి. వ్యాపారులకు ఇది మంచి సమయం. నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. పనుల అడ్డంకులు తొలగిపోతాయి. కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆర్థికపరంగా బాగుంటుంది. ఉద్యోగులకు కూడా గుర్తింపు వస్తుంది.
3.కుంభ రాశి:
కుంభ రాశి వారికి శుక్రుడు సంచారం కారణంగా శుభ ఫలితాలు ఎదురవుతాయి. ఈ రాశి తొమ్మిదవ ఇంట్లో శుక్రుడు సంచారం చేస్తున్నాడు. దీంతో ప్రతి పనిలో విజయాన్ని అందుకుంటారు. కొన్ని ప్రయాణాల ద్వారా ఆర్థిక లాభాలను పొందుతారు.
మాటతీరు, తెలివితేటలతో ఇతరులను సులువుగా ఆకట్టుకుంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. వివాదాలు తొలగిపోతాయి. కొత్త పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగకరంగా ఉండొచ్చు
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


