...
...
Next Story

శుక్రుడి వృషభ రాశి సంచారంతో ఐదు రాశుల ప్రేమ జీవితం మధురం.. ప్రొపోజ్ చేయడానికి కూడా ఇదే మంచి సమయం!

జూన్ 29న, ప్రేమ అందాలకు కారకుడైన శుక్రుడు సొంత రాశి అయిన వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. వృషభ రాశిలో శుక్రుని సంచారం ప్రేమ జీవితంపై ప్రత్యేకంగా సానుకూలంగా ఉంటుంది. శుక్రుని వృషభరాశి సంచారంతో వృషభ రాశి, కర్కాటక రాశి, కన్యా రాశి, మకర రాశి, మీన రాశి వారికి శుభ ఫలితాలను అందిస్తుంది.

Published on: Jun 26, 2025, 13:30:10 IST
By , , Hyderabad
Prefer HTon Google
Advertisement

మరో మూడు రోజుల్లో, అంటే జూన్ 29న, ప్రేమ అందాలకు కారకుడైన శుక్రుడు, సొంత రాశి అయిన వృషభరాశిలో సంచరిస్తున్నాడు. వృషభ రాశిలో శుక్రుని సంచారం ప్రేమ జీవితంపై ప్రత్యేకంగా సానుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో సంబంధాలలో మాధుర్యం ఉంటుంది. కొత్త ప్రారంభాలు, భావోద్వేగ సమతుల్యత కోసం ఇది మంచి సమయం.

శుక్రుడి రాశి మార్పుతో ఈ రాశుల వారి ప్రేమ జీవితం మధురం
శుక్రుడి రాశి మార్పుతో ఈ రాశుల వారి ప్రేమ జీవితం మధురం

జూన్ 29 మధ్యాహ్నం 2:08కి, శుక్రుడువృషభ రాశిలోకి సంచరిస్తాడు. జ్యోతిష శాస్త్రం ప్రకారం, ఏదైనా గ్రహం తన సొంత రాశిలోకి అడుగు పెట్టినప్పుడు, అది చాలా శక్తివంతమైనదిగా భావిస్తారు. శుక్రుని వృషభరాశి సంచారంతో వృషభ రాశి, కర్కాటక రాశి, కన్యా రాశి, మకర రాశి, మీన రాశి వారికి శుభ ఫలితాలను అందిస్తుంది. ప్రేమ జీవితం మధురంగా మారుతుంది.

శుక్రుడి రాశి మార్పుతో ఈ రాశుల వారి ప్రేమ జీవితం మధురం

1.వృషభ రాశి – లవ్, ప్రపోజల్, అందమైన ప్రేమ జీవితం

శుక్రుడి రాశి మార్పు కారణంగా ఈ ప్రభావం మీపై ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో ఈ రాశివారు ఆకర్షణీయమైన వ్యక్తిత్వంతో ఇతరులను ఆకట్టుకుంటారు. సింగిల్‌గా ఉన్నవారు తమ ప్రేమను పొందే అవకాశం ఉంటుంది. వైవాహిక జీవితంలో ప్రేమ ఎక్కువగా ఉంటుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు.

2.కర్కాటకరాశి – వైవాహిక జీవితంలో మాధుర్యం

శుక్రుడు రాశి మార్పుతో కర్కాటకరాశి వారికి బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ప్రేమ జీవితం మధురంగా మారుతుంది. చిన్న బహుమతులు, సర్ప్రైజులు రిలేషన్షిప్‌ను బలంగా, దృఢంగా ఉంచుతాయి. ఎప్పటినుంచో ప్రపోజ్ చేయాలనుకునే వారు ఈ సమయంలో ప్రపోజ్ చేస్తే కలిసి వస్తుంది.

3.కన్య రాశి – బంధంలో అర్థం చేసుకోవడం, నమ్మకం

ప్రేమలో గాయాలను ఎదుర్కొన్న వారు ఉపశమనాన్ని పొందుతారు. కొత్త సంబంధాలు ఏర్పడతాయి. కొత్త జీవితాన్ని మొదలుపెట్టడానికి ఇది మంచి సమయం. కొంతమందికి వివాహ ప్రతిపాదనలు వచ్చే అవకాశం ఉంది. భాగస్వామితో ట్రిప్ లేదా డేట్‌ను ప్లాన్ చేసుకోవడానికి ఇది మంచి సమయం.

5.మీన రాశి – స్నేహం ప్రేమగా మారే సమయం

శుక్రుడువృషభరాశిలో సంచరించడం వలన మీన రాశి వారు స్నేహాన్ని ప్రేమగా మార్చుకునే అవకాశం పొందుతారు. ఎప్పటి నుంచో దూరంగా ఉన్న జంటలు ఈ సమయంలో కలుసుకునే అవకాశం ఉంటుంది. మానసిక ప్రశాంతతను పొందుతారు. ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటారు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe