గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు శుభ యోగాలు ఏర్పడటం సహజం. శుక్రుడు ధనం, సంతోషం, విలాసాలు వంటి వాటికి కారకుడు. శుక్రుడు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు. అలాగే నక్షత్రాలను కూడా మారుస్తూ ఉంటాడు.
చిత్త నక్షత్రంలో శుక్రుడు

శుక్రుడు అక్టోబర్ 28న చిత్త నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. చిత్త నక్షత్రానికి అధిపతి కుజుడు. ఈ నక్షత్రంలోకి శుక్రుడు ప్రవేశించడంతో కొన్ని రాశుల వారు ప్రత్యేక లాభాలను పొందుతారు. ద్వాదశ రాశుల వారిపై ప్రభావం పడిన కొన్ని రాశుల వారికి మాత్రం ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి.
ద్రిక్ పంచాంగం ప్రకారం, శుక్రుడు కుజుని నక్షత్రమైన చిత్తా నక్షత్రంలోకి అక్టోబర్ 28న ప్రవేశిస్తాడు. ప్రస్తుతం శుక్రుడు హస్త నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు. అక్టోబర్ 28 మంగళవారం ఉదయం 5:17కి చిత్తా నక్షత్రంలోకి ప్రవేశించడంతో కొన్ని రాశుల వారు లాభాలను పొందుతారు. మరి ఏ రాశుల వారికి ఈ నక్షత్ర సంచారంతో ఎక్కువ లాభాలు కలుగుతాయో, ఎవరికీ ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడే తెలుసుకుందాం.
చిత్త నక్షత్రంలోకి శుక్రుడు.. ఈ రాశుల వారికి అనేక విధాలుగా లాభాలు:
1.మేష రాశి:
మేష రాశి వారికి ఈ నక్షత్ర సంచారం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకి కూడా ఎక్కువ లాభాలు ఉంటాయి. ఆర్థికపరంగా బాగుంటుంది. జీవిత భాగస్వామిని అర్థం చేసుకుంటే ప్రేమానురాగాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండొచ్చు. జీవితంలో ప్రశాంతత ఉంటుంది, సంతోషం కూడా పెరుగుతుంది. ఆర్ట్, మ్యూజిక్ రంగాల వారికి కూడా బాగా కలిసి వస్తుంది.
2.వృషభ రాశి:
వృషభ రాశి వారికి శుక్రుని నక్షత్ర సంచారం బాగా కలిసి వస్తుంది. ఈ రాశి వారు ఆనందంగా ఉంటారు. ప్రేమ జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది. విలాసమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న సమస్యలు తగ్గిపోతాయి. వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది.
3.తులా రాశి:
{{/usCountry}}వృషభ రాశి వారికి శుక్రుని నక్షత్ర సంచారం బాగా కలిసి వస్తుంది. ఈ రాశి వారు ఆనందంగా ఉంటారు. ప్రేమ జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది. విలాసమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న సమస్యలు తగ్గిపోతాయి. వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది.
3.తులా రాశి:
{{/usCountry}}తులా రాశి వారికి శుక్ర నక్షత్ర సంచారం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. పెళ్లి కాని వారికి పెళ్లి కుదిరే అవకాశం ఉంది. ఒంటరిగా ఉన్న వారు ప్రేమ జీవితంలో మార్పు పొందే అవకాశం ఉంది. భూములు, ఖరీదైన వస్తువులను కొనుగోలు చేస్తారు. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఆర్థికపరంగా బాగుంటుంది.
4.వృశ్చిక రాశి:
వృశ్చిక రాశి వారికి ఈ శుక్ర నక్షత్ర సంచారం అనేక విధాలుగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు ఆనందంగా ఉంటారు. అందం పెరుగుతుంది. పెండింగ్‌లో ఉన్న టాస్కులు పూర్తవుతాయి. సీనియర్ల సపోర్ట్ ఉంటుంది. మొత్తానికి ఈ రాశి వారికి అనేక విధాలుగా కలిసివస్తుంది, సంతోషంగా ఉంటారు.