శుక్రుడి సంచారంతో మార్పు, ఈ 4 రాశుల వారికి సంపద పెరుగుతుంది.. ఒంటరి వారి జీవితంలోకి తోడు రావచ్చు!

శుక్రుడు అక్టోబర్ 28న చిత్త నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. చిత్త నక్షత్రానికి అధిపతి కుజుడు. ఈ నక్షత్రంలోకి శుక్రుడు ప్రవేశించడంతో కొన్ని రాశుల వారు ప్రత్యేక లాభాలను పొందుతారు. 12 రాశుల వారిపై ప్రభావం పడిన కొన్ని రాశుల వారికి ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి. ఏ రాశుల వారికి ఈ నక్షత్ర సంచారంతో ఎక్కువ లాభాలు?

Published on: Oct 22, 2025, 11:00:18 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు శుభ యోగాలు ఏర్పడటం సహజం. శుక్రుడు ధనం, సంతోషం, విలాసాలు వంటి వాటికి కారకుడు. శుక్రుడు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు. అలాగే నక్షత్రాలను కూడా మారుస్తూ ఉంటాడు.

శుక్రుడి సంచారంతో మార్పు, ఈ 4 రాశుల వారికి సంపద పెరుగుతుంది (pinterest)
శుక్రుడి సంచారంతో మార్పు, ఈ 4 రాశుల వారికి సంపద పెరుగుతుంది (pinterest)

చిత్త నక్షత్రంలో శుక్రుడు

శుక్రుడు అక్టోబర్ 28న చిత్త నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. చిత్త నక్షత్రానికి అధిపతి కుజుడు. ఈ నక్షత్రంలోకి శుక్రుడు ప్రవేశించడంతో కొన్ని రాశుల వారు ప్రత్యేక లాభాలను పొందుతారు. ద్వాదశ రాశుల వారిపై ప్రభావం పడిన కొన్ని రాశుల వారికి మాత్రం ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి.

ద్రిక్ పంచాంగం ప్రకారం, శుక్రుడు కుజుని నక్షత్రమైన చిత్తా నక్షత్రంలోకి అక్టోబర్ 28న ప్రవేశిస్తాడు. ప్రస్తుతం శుక్రుడు హస్త నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు. అక్టోబర్ 28 మంగళవారం ఉదయం 5:17కి చిత్తా నక్షత్రంలోకి ప్రవేశించడంతో కొన్ని రాశుల వారు లాభాలను పొందుతారు. మరి ఏ రాశుల వారికి ఈ నక్షత్ర సంచారంతో ఎక్కువ లాభాలు కలుగుతాయో, ఎవరికీ ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడే తెలుసుకుందాం.

చిత్త నక్షత్రంలోకి శుక్రుడు.. ఈ రాశుల వారికి అనేక విధాలుగా లాభాలు:

1.మేష రాశి:

మేష రాశి వారికి ఈ నక్షత్ర సంచారం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకి కూడా ఎక్కువ లాభాలు ఉంటాయి. ఆర్థికపరంగా బాగుంటుంది. జీవిత భాగస్వామిని అర్థం చేసుకుంటే ప్రేమానురాగాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండొచ్చు. జీవితంలో ప్రశాంతత ఉంటుంది, సంతోషం కూడా పెరుగుతుంది. ఆర్ట్, మ్యూజిక్ రంగాల వారికి కూడా బాగా కలిసి వస్తుంది.

2.వృషభ రాశి:

వృషభ రాశి వారికి శుక్రుని నక్షత్ర సంచారం బాగా కలిసి వస్తుంది. ఈ రాశి వారు ఆనందంగా ఉంటారు. ప్రేమ జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది. విలాసమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న సమస్యలు తగ్గిపోతాయి. వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది.

3.తులా రాశి:

తులా రాశి వారికి శుక్ర నక్షత్ర సంచారం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. పెళ్లి కాని వారికి పెళ్లి కుదిరే అవకాశం ఉంది. ఒంటరిగా ఉన్న వారు ప్రేమ జీవితంలో మార్పు పొందే అవకాశం ఉంది. భూములు, ఖరీదైన వస్తువులను కొనుగోలు చేస్తారు. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఆర్థికపరంగా బాగుంటుంది.

4.వృశ్చిక రాశి:

వృశ్చిక రాశి వారికి ఈ శుక్ర నక్షత్ర సంచారం అనేక విధాలుగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు ఆనందంగా ఉంటారు. అందం పెరుగుతుంది. పెండింగ్‌లో ఉన్న టాస్కులు పూర్తవుతాయి. సీనియర్ల సపోర్ట్ ఉంటుంది. మొత్తానికి ఈ రాశి వారికి అనేక విధాలుగా కలిసివస్తుంది, సంతోషంగా ఉంటారు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More