...
...
Next Story

జనవరి 31న శని త్రయోదశి.. శని బాధల నుంచి బయట పడాలంటే ఏం చెయ్యాలి? శని త్రయోదశి పూజా విధానం తెలుసుకోండి!

త్రయోదశితో వచ్చే శనివారం చాలా విశేషమైనది. ఆ రోజు శని భగవానుడికి ఎంతో ఇష్టమైన రోజు. జనవరి 31న శనివారం త్రయోదశి రావడం చాలా విశేషం. ఆ రోజు కొన్ని నియమాలను పాటిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. శని బాధల నుంచి బయటపడాలంటే ఏం చెయ్యాలి? శని త్రయోదశి పూజా విధానం తెలుసుకోండి.

Published on: Jan 28, 2026, 16:30:48 IST
Advertisement

శని మనం చేసే పనులను బట్టి ఫలితాన్ని ఇస్తాడు. శని గ్రహం కష్టాలను, నష్టాలను తీసుకొస్తాడు. త్రయోదశితో వచ్చే శనివారం చాలా విశేషమైనది. ఆ రోజు శని భగవానుడికి ఎంతో ఇష్టమైన రోజు. శని జాతకంలో వక్రదృష్టితో ఉన్నప్పుడు, శనివారం త్రయోదశి నాడు శనిని పూజించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే శనిని శాంతింప చేయవచ్చు.

జనవరి 31న శని త్రయోదశి

జనవరి 31న శని త్రయోదశి.. శని బాధల నుంచి బయటపడాలంటే ఏం చెయ్యాలి?
జనవరి 31న శని త్రయోదశి.. శని బాధల నుంచి బయటపడాలంటే ఏం చెయ్యాలి?

జనవరి 31న శనివారం త్రయోదశి రావడం చాలా విశేషం. ఆ రోజు కొన్ని నియమాలను పాటిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. శని త్రయోదశి నాడు ఏం చేయాలి? ఏం చేయకూడదు? పూర్తిగా వివరాలు తెలుసుకుందాం.

శని త్రయోదశి తేదీ, సమయం

త్రయోదశి తిధి జనవరి 30 ఉదయం 11:09 గంటలకు ప్రారంభమవుతుంది. జనవరి 31 ఉదయం 8:06తో ముగుస్తుంది. ఉదయ తిధి ప్రకారం చూసుకోవాలి కనుక జనవరి 31న శని త్రయోదశి పూజలు, పరిహారాలు పాటించడం వంటివి చేయాలి.

శని దేవుడు

శని పాప పుణ్యాలను పరిగణలోకి తీసుకుంటాడు. నవగ్రహాల్లో శని ఏడవ గ్రహం. సూర్య భగవానునికి, ఛాయాదేవికి కలిగిన కుమారుడని శాస్త్రాలు తెలుపుతున్నాయి. మనం చేసే పాప పుణ్యాల ఆధారంగా నడవడికను శని నిర్ణయిస్తాడు. బతికి ఉండగా చేసే పాప పుణ్యాలను పరిగణలోకి తీసుకుంటాడు. యమధర్మరాజు మరణానంతరం వాటిని ఆధారంగా చేసుకుని శిక్షలను అమలు చేస్తాడు. అయితే శనిని ఆరాధిస్తే ఐశ్వర్యాన్ని కూడా ఇస్తాడు.

శనివారం + త్రయోదశి

  1. ఆ రోజు శనికి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే శని త్రయోదశి నాడు నువ్వులు, నల్లటి వస్త్రాన్ని దానం చేస్తే కూడా శని అనుగ్రహం కలుగుతుంది.
  2. ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శనితో బాధపడుతున్న వారు ఉపశమనాన్ని పొందడానికి ఈ పరిహారాలను పాటిస్తే మంచిది.
  3. శని త్రయోదశి నాడు శనిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే ఆర్థిక, ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు.
  4. శని త్రయోదశి వ్రతాన్ని ఆచరిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. జీవితంలో ఆనందం ఉంటుంది.

శని త్రయోదశి పూజా విధానం

దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్లి నవగ్రహాలకు పూజలు చేయాలి.

శనీశ్వరుడిని ప్రత్యేకించి ఆరాధించాలి. ముఖ్యంగా తైలాభిషేకం చేయాలి.

తమలపాకులో బెల్లం పెట్టి శనికి నైవేద్యంగా సమర్పిస్తే మంచిది. ఇలా చేయడం వలన శని దోషాలన్నీ తొలగిపోతాయి.

నల్ల నువ్వులు, నల్లని వస్త్రంలో పెట్టి తాంబూలం, దక్షిణతో బ్రాహ్మణులకు దానం చేస్తే కూడా సంతోషంగా ఉండొచ్చు. జాతకంలో ఉన్న దోషాలు కూడా తొలగిపోతాయి.

ఒకవేళ ఇవేమీ చేయలేకపోతే, నవగ్రహాల దగ్గర మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి దీపారాధన చేయండి. బెల్లం నైవేద్యంగా పెట్టండి.

9 సార్లు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయండి.

రావి చెట్టు దగ్గర మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి దీపారాధన చేసి 11 ప్రదక్షిణలు చేస్తే కూడా శని దోషాల నుంచి బయటపడవచ్చు.

“ఓం శ్రీ శనీశ్వరాయ నమః” మంత్రాన్ని జపిస్తే కూడా శని అనుగ్రహాన్ని పొందడానికి వీలవుతుంది.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe