శని, బుధుల శుభ యోగం: శని, బుధ గ్రహాల కలయిక శక్తివంతమైన యోగాన్ని సృష్టిస్తుంది, ఈ రాశులకు వరం!
గ్రహాలు కాలనుగుణంగా వాటి రాశులను మారుస్తున్నప్పుడు, కొన్ని గ్రహాలతో సంయోగం చెందుతూ ఉంటాయి. జనవరి 28, అనగా రేపు బుధుడు, శని 45 డిగ్రీల దూరంలో ఉంటారు. దీంతో ఈ రెండు గ్రహాల సంయోగం జరిగి అర్థకేంద్ర యోగం ఏర్పడుతుంది. ఇది 12 రాశుల వారి జీవితంలో అనేక మార్పులను తీసుకువస్తుంది.
గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. అలాంటప్పుడు శుభయోగాలు, అశుభ యోగాలను చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు కొన్ని రాశుల వారికి మంచి ఫలితాలు ఎదురవుతాయి, మరి కొన్ని రాశుల వారు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. గ్రహాలు కాలనుగుణంగా వాటి రాశులను మారుస్తున్నప్పుడు, కొన్ని గ్రహాలతో సంయోగం చెందుతూ ఉంటాయి.

అర్థకేంద్ర యోగం
అలాంటప్పుడు విశేషమైన యోగాలు ఏర్పడటం చూస్తూ ఉంటాం. జనవరి 28, అనగా రేపు బుధుడు, శని 45 డిగ్రీల దూరంలో ఉంటారు. దీంతో ఈ రెండు గ్రహాల సంయోగం జరిగి అర్థకేంద్ర యోగం ఏర్పడుతుంది. ఇది 12 రాశుల వారి జీవితంలో అనేక మార్పులను తీసుకువస్తుంది.
శని న్యాయదేవుడు. మనం చేసే కర్మలను బట్టి ఫలితాలను ఇస్తాడు. మంచి చేస్తే మంచి ఫలితం, చెడు చేస్తే చెడు ఫలితం ఎదుర్కోక తప్పదు. అలాగే గ్రహాలకు యువరాజైన బుధుడు కూడా కాలానుగుణంగా రాశులను మారుస్తూ ఉంటాడు. బుధుడు శనితో సంయోగం చెంది ఈ అర్థకేంద్ర యోగాన్ని ఏర్పరుస్తాడు. ఈ శక్తివంతమైన యోగం 12 రాశుల వారి జీవితాల్లో అనేక మార్పులను తీసుకు వస్తుంది. అయితే, ఈ యోగం కొన్ని రాశుల వారి అదృష్టాన్ని ప్రత్యేకంగా పెంచుతుంది. మరి ఆ అదృష్ట రాశులు ఎవరో తెలుసుకుందాం. ఈ అదృష్ట రాశుల్లో మీరు కూడా ఉన్నారేమో చూసుకోండి.
శని, బుధుల అర్థకేంద్ర యోగం.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారం
1.వృషభ రాశి
వృషభ రాశి వారికి అర్థకేంద్ర యోగం అనేక విధాలుగా కలిసి వచ్చేలా చేస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు ఆనందంగా ఉంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. అనుకున్నవి అన్నీ నెరవేరుతాయి. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. వ్యాపారస్తులకు కూడా ఇది మంచి సమయం.
2.సింహ రాశి
సింహ రాశి వారికి ఈ అర్థకేంద్ర యోగం బాగా కలిసి వచ్చేలా చేస్తుంది. ఈ రెండు గ్రహాల కలయికతో ఏర్పడే ఈ యోగం శుభ ఫలితాలను అందిస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారి అదృష్టం పెరుగుతుంది. సక్సెస్‌ను అందుకుంటారు. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది. అయితే కోపం, మాటలను అదుపులో ఉంచుకోవాలి.
3.మీన రాశి
మీన రాశి వారికి ఈ యోగం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు వివిధ లాభాలను పొందుతారు. కెరీర్‌లో ఊహించని మార్పులను చూస్తారు. వ్యాపారంలో కూడా బాగా కలిసి వస్తుంది. వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. ఆదాయం పెరుగుతుంది. సానుకూల మార్పులు కనిపిస్తాయి. మీరు కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి. అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. సంతోషం పెరుగుతుంది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


