సంక్రాంతి నుంచి ఈ రాశుల వారికి బ్రహ్మాండంగా ఉంటుంది.. గ్రహాలు అనుకూలంగా ఉండడంతో ధనవంతులయ్యే ఛాన్స్!

త్వరలోనే సంక్రాంతి పండుగ రాబోతోంది. సంక్రాంతి పండుగను సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు జరుపుకుంటాము. మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించే సమయంలో శుక్రుడు కూడా మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ధనస్సు రాశిలో కుజుడు, బుధుడు సంయోగం చెందుతారు. వృద్ధి యోగం, రవి యోగం కూడా ఏర్పడబోతున్నాయి.

Published on: Jan 12, 2026, 24:00:52 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే అది అన్ని రాశుల వారి జీవితాల్లో చాలా మార్పులను కలిగిస్తుంది. త్వరలోనే సంక్రాంతి పండుగ రాబోతోంది. సంక్రాంతి పండుగను సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు జరుపుకుంటాము. మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించే సమయంలో శుక్రుడు కూడా మకర రాశిలోకి ప్రవేశిస్తాడు.

సంక్రాంతికి ఈ రాశుల వారి జీవితం మారిపోతుంది (pinterest)
సంక్రాంతికి ఈ రాశుల వారి జీవితం మారిపోతుంది (pinterest)

ధనస్సు రాశిలో కుజుడు, బుధుడు సంయోగం చెందుతారు. అలాగే ఆ రోజు వృద్ధి యోగం, రవి యోగం కూడా ఏర్పడబోతున్నాయి. గురు, చంద్రుల గజకేసరి రాజయోగం కూడా ఏర్పడుతుంది. దీంతో కొన్ని రాశుల వారు ధనవంతులు కాబోతున్నారు. మరి ఆ అదృష్ట రాశులు ఎవరో చూద్దాం.

సంక్రాంతికి ఈ రాశుల వారి జీవితం మారిపోతుంది.. ధనవంతులు కూడా అవ్వచ్చు

1.మకర రాశి

సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మకర రాశి వారికి ఈ రాజయోగం మొదలవుతుంది. ఆర్థికపరంగా బాగుంటుంది. ఈ సమయంలో ఈ రాశి వారి కోరికలు నెరవేరుతాయి. వ్యాపారం చేయాలనుకునే వారికి కూడా బాగుంటుంది. కొత్త కాంట్రాక్టులు కూడా లభిస్తాయి. వృత్తిలో విజయాన్ని సాధిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి మంచి అవకాశాలు వస్తాయి. పిల్లలు ఏకాగ్రతతో చదివి పోటీ పరీక్షల్లో చక్కటి ఫలితాలను పొందుతారు. ఆర్థికపరంగా కూడా బాగుంటుంది.

2.మేష రాశి

మేష రాశి వారికి సంక్రాంతి బాగా కలిసి వస్తుంది. అనుకున్న వాటికి శుభ ఫలితాలను పొందుతారు. అదృష్టం తలుపు తడుతుంది. పాత అప్పుల నుంచి బయటపడతారు. వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. పదోన్నతులు లభించవచ్చు. వ్యాపారస్తులకు కూడా ఇది అద్భుతమైన సమయం. గురువు అనుగ్రహంతో అన్నీ కలిసి వస్తాయి. జీవితం కూడా మెరుగుపడుతుంది. ఆకస్మిక ధన లాభాన్ని కూడా చూస్తారు.

3.వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఇది శుభ సమయం. ఈ సమయంలో ఈ రాశి వారు వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. విజయాలను అందుకుంటారు. కష్టానికి తగ్గ ఫలితాన్ని చూస్తారు. ఏ పని చేసినా కూడా రెట్టింపు ఫలితాన్ని పొందుతారు.

4.వృషభ రాశి

వృషభ రాశి వారికి కూడా ఇది అద్భుతమైన సమయం. ధన లాభం కలుగుతుంది. పూర్వీకుల ఆస్తి నుంచి ఎక్కువ లాభాలను పొందుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పనిలో విజయాన్ని సాధిస్తారు. శని, గురువుల కారణంగా ఈ సంక్రాంతికి ఈ రాశి వారికి బాగుంటుంది. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. శుభకార్యాలు జరగవచ్చు.

5.మీన రాశి

మీన రాశి వారికి ఈ సంక్రాంతి బాగా కలిసి వస్తుంది. పెట్టుబడులు పెడితే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. ప్రశాంతమైన జీవితం ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఆర్థిక అభివృద్ధిని చూడవచ్చు. శని కారణంగా స్పష్టత, క్రమశిక్షణ ఏర్పడతాయి. పూర్తిగా అన్ని పనులన్నీ ఈ సమయంలో పూర్తవుతాయి. ఏ పనినైనా ధైర్యంతో కొనసాగిస్తారు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More