2026 Rahu Transit: 18 సంవత్సరాల తరువాత ఈ ఏడాది మకర రాశిలోకి రాహువు.. మూడు రాశులకు గుడ్ టైం.. డబ్బు, అదృష్టంతో పాటు ఎన్నో
రాహువు, కేతువులను నీడ గ్రహాలుగా పరిగణిస్తారు. రాహువు స్థానం జాతకంలో శుభప్రదంగా ఉంటే, వ్యక్తి జీవితంలో సౌకర్యాలు ఎక్కువగా ఉంటాయి, ఆనందంగా ఉంటారు. రాహువు సంచారం చాలా నెమ్మదిగా ఉంటుంది. నీడ గ్రహమైన రాహువు కుంభ రాశిలో ఉన్నాడు. 2026 చివరి నెల దాకా ఈ రాశిలోనే సంచారం చేస్తాడు.
18 సంవత్సరాల తర్వాత మకర రాశిలోకి రాహువు: గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే, అది అన్ని రాశుల వారిపై కూడా ప్రభావాన్ని చూపిస్తుంది. కొన్ని సార్లు శుభ ఫలితాలు ఎదురైతే, కొన్నిసార్లు అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. రాహువు, కేతువులను నీడ గ్రహాలుగా పరిగణిస్తారు. రాహువు స్థానం జాతకంలో శుభప్రదంగా ఉంటే, వ్యక్తి జీవితంలో సౌకర్యాలు ఎక్కువగా ఉంటాయి, ఆనందంగా ఉంటారు. అలాగే ఒకవేళ రాహువు చెడు స్థానంలో ఉంటే, సమస్యలు వస్తాయి.

రాహువు సంచారం చాలా నెమ్మదిగా ఉంటుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం చూసినట్లయితే, నీడ గ్రహమైన రాహువు కుంభ రాశిలో ఉన్నాడు. 2026 చివరి నెల దాకా ఈ రాశిలోనే సంచారం చేస్తాడు. డిసెంబర్ 2026లో మాత్రం రాహువు కుంభ రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. రాహువు సంచారంలో మార్పు వచ్చినప్పుడు, అది అన్ని రాశుల వారి జీవితాల్లో కూడా అనేక మార్పులను తీసుకువస్తుంది. మరి 2026 చివరి నెలలో రాహు సంచారం ఏ విధంగా ప్రయోజనాలను కలిగిస్తుంది? ఏ రాశి వారికి బాగుంటుంది? ఎలాంటి లాభాలు కలుగుతాయి? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మకర రాశిలోకి రాహువు ప్రవేశించడంతో ఈ రాశుల వారికి శుభ ఫలితాలు లభిస్తాయి
18 ఏళ్ల తర్వాత రాహువు కుంభ రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. దీంతో కొన్ని రాశుల వారికి అదృష్టం కలగబోతోంది. మరి అదృష్ట రాశుల్లో మీరు ఒకరేమో చూసుకోండి.
ధనస్సు రాశి
ధనస్సు రాశి వారికి రాహువు సంచారం శుభ ఫలితాలను తీసుకురాబోతోంది. ఈ సమయంలో ఈ రాశి వారు వివిధ లాభాలను పొందుతారు, ఆనందంగా ఉంటారు. ధనస్సు రాశి ప్రజలు ఎక్కువ ప్రయోజనాలను పొందుతారు. కెరీర్‌లో కూడా అనేక మార్పులు వస్తాయి. కొత్త పనులు పూర్తి చేసుకుంటారు. కష్టపడి పని చేస్తే ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి. కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. జీవిత భాగస్వామితో కాస్త విభేదాలు ఉండొచ్చు, కానీ ఓపికతో సమస్యలను పరిష్కరించుకుంటారు.
తులా రాశి
తులా రాశి వారికి రాహువు సంచారం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు కూడా ఎక్కువ లాభాలను పొందుతారు. ముఖ్యంగా ఆర్థిక లాభాలను చూస్తారు. ఉద్యోగులకు, వ్యాపారులకు కూడా ఇది అద్భుతమైన సమయం. అదృష్టం కూడా కలిసి వస్తుంది. ప్రేమ జీవితంలో ఆనందం ఉంటుంది. కెరీర్‌లో కూడా అనేక మార్పులు ఉంటాయి. ఎదుగుదలకు ఇది హెల్ప్ అవుతుంది. ఇలా ఈ రాశి వారు కూడా అనేక లాభాలను పొందుతారు.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈ రాహువు సంచారం శుభ ఫలితాలను కలిగిస్తుంది. ఇది శుభప్రదమైన సమయం. సానుకూల దృక్పథం మీ జీవితంలో ఉంటుంది. పెట్టుబడి పెట్టడానికి కూడా ఇది సరైన సమయం. ఆరోగ్యంలో కాస్త ఒడిదుడుకులు ఉండొచ్చు, కానీ ఆరోగ్యంపై దృష్టి పెడితే సమస్యలు తగ్గుతాయి. విద్యార్థులు శుభ ఫలితాలను పొందుతారు. ఇలా ఈ రాశి వారు కూడా రాహువు సంచారంతో అనేక విధాలుగా లాభాలను పొందుతారు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


