వినాయక చవితి రోజు తప్పక చదవాల్సిన 108 నామాలు.. 21 పత్రాల పూజా విధానం పూర్తి వివరాలు ఇవిగో
భాద్రపద మాసంలో వచ్చే వినాయక చవితి పర్వదినాన గణపతిని షోడశోపచారాలతో పాటు అష్టోత్తర శతనామావళి, 21 పత్రాలతో అర్చిస్తే సకల సిద్దులు చేకూరుతాయి. ఆ పూర్తి నామాలు ఇక్కడ తెలుసుకోండి.
వినాయక చవితి పూజలో ఈ 108 నామాలను భక్తిశ్రద్ధలతో జపిస్తూ పుష్పాలు లేదా పత్రాలతో గణపతిని పూజించండి.

శ్రీ వినాయక అష్టోత్తర శతనామావళి
ఓం గణేశాయ నమః
ఓం గణాధ్యక్షాయ నమః
ఓం విఘ్నరాజాయ నమః
ఓం వినాయకాయ నమః
ఓం ద్వైమాతురాయ నమః
ఓం ద్విముఖాయ నమః
ఓం ప్రముఖాయ నమః
ఓం సుముఖాయ నమః
ఓం కృతినే నమః
ఓం సుప్రదీపాయ నమః
ఓం సుఖనిధయే నమః
ఓం సురాధ్యక్షాయ నమః
ఓం సురారిఘ్నాయ నమః
ఓం మహాగణపతయే నమః
ఓం మాన్యాయ నమః
ఓం మహాకాలాయ నమః
ఓం మహాబలాయ నమః
ఓం హేరంబాయ నమః
ఓం లంబజఠరాయ నమః
ఓం హ్రస్వగ్రీవాయ నమః
ఓం మహోదరాయ నమః
ఓం మదోత్కటాయ నమః
ఓం మహావీరాయ నమః
ఓం మంత్రిణే నమః
ఓం మంగళస్వరాయ నమః
ఓం ప్రమథాయ నమః
ఓం ప్రథమాయ నమః
ఓం ప్రాజ్ఞాయ నమః
ఓం విఘ్నకర్త్రే నమః
ఓం విఘ్నహంత్రే నమః
ఓం విశ్వనేత్రే నమః
ఓం విరాట్పతయే నమః
ఓం శ్రీపతయే నమః
ఓం వాక్పతయే నమః
ఓం శృంగారిణే నమః
ఓం ఆశ్రితవత్సలాయ నమః
ఓం శివప్రియాయ నమః
ఓం శీఘ్రకారిణే నమః
ఓం శాశ్వతాయ నమః
ఓం బలాయ నమః
ఓం బలోత్థితాయ నమః
ఓం భవాత్మజాయ నమః
ఓం పురాణపురుషాయ నమః
ఓం పూష్ణే నమః
ఓం పుష్కరోత్థితాయ నమః
ఓం అగ్రగణ్యాయ నమః
ఓం అగ్రపూజ్యాయ నమః
ఓం అగ్రగామినే నమః
ఓం మంత్రకృతే నమః
ఓం చామీకరప్రభాయ నమః
ఓం సర్వస్మై నమః
ఓం సర్వోపాస్యాయ నమః
ఓం సర్వకర్త్రే నమః
ఓం సర్వనేత్రే నమః
ఓం సర్వసిద్ధిప్రదాయ నమః
ఓం సర్వసిద్ధయే నమః
ఓం పంచహస్తాయ నమః
ఓం పార్వతీనందనాయ నమః
ఓం ప్రభవే నమః
ఓం కుమారగురవే నమః
ఓం అక్షోభ్యాయ నమః
ఓం కుంజరాసురభంజనాయ నమః
ఓం ప్రమోదాయ నమః
ఓం మోదకప్రియాయ నమః
ఓం కాంతిమతే నమః
ఓం ధృతిమతే నమః
ఓం కామినే నమః
ఓం కపిత్థపనసప్రియాయ నమః
ఓం బ్రహ్మచారిణే నమః
ఓం బ్రహ్మరూపిణే నమః
ఓం బ్రహ్మవిద్యావివర్ధనాయ నమః
ఓం జిష్ణవే నమః
ఓం విష్ణుప్రియాయ నమః
ఓం భక్తజీవితాయ నమః
ఓం జితమన్మథాయ నమః
ఓం ఐశ్వర్యకారణాయ నమః
ఓం జ్యాయసే నమః
ఓం యక్షకిన్నరసేవితాయ నమః
ఓం గంగాసుతాయ నమః
ఓం గణాధీశాయ నమః
ఓం గంభీరనినదాయ నమః
ఓం వటవే నమః
ఓం అభీష్టవరదాయ నమః
ఓం జ్యోతిషే నమః
ఓం భక్తనిధయే నమః
ఓం భావగమ్యాయ నమః
ఓం మంగళప్రదాయ నమః
ఓం అవ్యక్తాయ నమః
ఓం అప్రాకృతపరాక్రమాయ నమః
ఓం సత్యధర్మిణే నమః
ఓం సఖయే నమః
ఓం సరసాంబునిధయే నమః
ఓం మహేశాయ నమః
ఓం దివ్యాంగాయ నమః
ఓం మణికింకిణీమేఖలాయ నమః
ఓం సమస్తదేవతామూర్తయే నమః
ఓం సహిష్ణవే నమః
ఓం సతతోత్థితాయ నమః
ఓం విఘాతకారిణే నమః
ఓం విశ్వగ్దృశే నమః
ఓం విశ్వబంధవే నమః
ఓం విశ్వాధారాయ నమః
ఓం కృతిప్రియాయ నమః
ఓం కళ్యాణగురవే నమః
ఓం ఉన్మత్తవేషాయ నమః
ఓం అపరాజితాయ నమః
ఓం సమస్తజగదాధారాయ నమః
ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః
21 పత్రాలతో పూజ చేసేటప్పుడు చదవాల్సిన నామాలు
ఓం సుముఖాయ నమః – మాచీ పత్రం సమర్పయామి
ఓం గణాధీశాయ నమః – బృహతీ పత్రం సమర్పయామి
ఓం ఉమాపుత్రాయ నమః – బిల్వ పత్రం సమర్పయామి
ఓం గజముఖాయ నమః – దూర్వా పత్రం సమర్పయామి
ఓం హరసూనవే నమః – దత్తూర పత్రం సమర్పయామి
ఓం లంబోదరాయ నమః – బదరీ పత్రం సమర్పయామి
ఓం గుహాగ్రజాయ నమః – అపామార్గ పత్రం సమర్పయామి
ఓం శూర్పకర్ణాయ నమః – తులసీ పత్రం సమర్పయామి
ఓం వక్రతుండాయ నమః – చూత పత్రం సమర్పయామి
ఓం విఘ్నరాజాయ నమః – కరవీర పత్రం సమర్పయామి
ఓం హేరంబాయ నమః – విష్ణుక్రాంత పత్రం సమర్పయామి
ఓం ఏకదంతాయ నమః – దాడిమీ పత్రం సమర్పయామి
ఓం గణాధ్యక్షాయ నమః – దేవదారు పత్రం సమర్పయామి
ఓం భాలచంద్రాయ నమః – మరువక పత్రం సమర్పయామి
ఓం గజాననాయ నమః – సింధువార పత్రం సమర్పయామి
ఓం చతుర్భుజాయ నమః – జాజీ పత్రం సమర్పయామి
ఓం వినాయకాయ నమః – గణకీ పత్రం సమర్పయామి
ఓం కపిలాయ నమః – శమీ పత్రం సమర్పయామి
ఓం వటవే నమః – అశ్వత్థ పత్రం సమర్పయామి
ఓం సురాగ్రజాయ నమః – అర్జున పత్రం సమర్పయామి
ఓం సిద్ధి వినాయకాయ నమః – అర్క పత్రం సమర్పయామి
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


