ఈ వారం రాశి ఫలాలు.. 12 రాశుల వార ఫలాలు.. ఆ రాశి వారికి నూతనోత్సాహం, అవకాశాలు, లక్ష్మీ స్తోత్రాలు పఠించండి!

ఈ వారం రాశి ఫలాలు కింది విధంగా ఉన్నాయి. 20.07.2025 నుంచి 26.07. 2025 వరకు ఏ రాశి వారికి ఎలా ఉండబోతోందో ఇక్కడ తెలుసుకోండి. జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వీటిని అందించారు.

Published on: Jul 20, 2025, 03:00:11 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link
పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

హిందుస్తాన్ టైమ్స్

రాశిఫలాలు (వారఫలాలు) 20.07.2025 నుంచి 26.07. 2025 వరకు

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ సంవత్సరం

మాసం: ఆషాడ మాసం/శ్రావణ మాసం, తిథి : కృ. దశమి నుంచి శ్రా. విదియ వరకు

మేష రాశి

మేష రాశి వారు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగాలు దక్కవచ్చు. ఖర్చులు అదుపు చేసుకుంటే మంచిది. భార్యాభర్తలు, సోదరులతో వివాదాలు కొలిక్కి రానుంది. సంతానవరంగా కొంతకాలంగా ఎదురవుతున్న సమస్యలు తీరతాయి. ఆస్తులు కొనుగోలుపై మరింత దృష్టి సారిస్తారు. కొత్త పెట్టుబడులతో మరింతగా విస్తరించేందుకు అవకాశాలు ఉన్నాయి. భాగస్వాముల సలహాల మేరకు ఒక నిర్ణయానికి వస్తారు. ఉద్యోగులు తాము కోరుకున్న మార్పులు దక్కించుకుంటారు.

విధి నిర్వహణలో ఒత్తిడులు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు మరింత సానుకూలత ఉంటుంది. మహిళలకు విశేష గౌరవం లభిస్తుంది. టెక్నికల్ రంగం వారు అవకాశాలు సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి. బెల్లం పానకం స్వామికి నివేదించండి, అష్టకష్టాలు తీరతాయి.

వృషభ రాశి

వృషభరాశి వారు ఈ వారం శత్రువులను కూడా మెప్పించేందుకు యత్నిస్తారు. ఆకస్మిక ధన లాభాలు ఉంటాయి. దీర్ఘకాలిక రుణబాధల నుండి కొంతమేర బయటపడతారు. కుటుంబ సమస్యల నుండి గట్టెక్కుతారు. భార్యాభర్తల మధ్య అపార్థాలు తొలగుతాయి. ఇల్లు, వాహనాలు కొనేందుకు తగిన ఏర్పాట్లు చేస్తారు. ఉద్యోగులకు విధి నిర్వహణ మొదట ప్రశాంతంగానే సాగిపోతుంది. రాజకీయవేత్తలు, కళాకారులకు నూతనోత్సాహం, కొన్ని సందర్భాల్లో విశ్రాంతిలేమి, కొత్త సమస్యలు, మహిళలకు కుటుంబ సమస్యలు తీరతాయి. టెక్నికల్ రంగం వారు వేగంగా విధులు పూర్తి చేస్తారు. గణేశాష్టకం పఠించండి.

మిధున రాశి

అవసరాలకు తగినంత సొమ్ము అందుకుంటారు. మీకు రావలసిన బకాయిలు కొంత అందుతాయి. షేర్లలో పెట్టుబడులు పెట్టే వీలుంది. కుటుంబంలోని అందరి ఆప్యాయత మధ్య సంతోషంగా గడుపుతారు. భార్యాభర్తల మధ్య కొద్దికాలంగా నెలకొన్న విభేదాలు పరిష్కారమవుతాయి. సంతాన విషయంలో ఫలితాలు మీకు అనుకూలిస్తాయి.

వాహనాలు, ఆభరణాలు కోసం చేసే యత్నాలు సఫలమవుతాయి. పెట్టుబడులపై మాత్రం తొందరపడకండి. నిదానమే ప్రధానం అన్న విధంగా మసలుకోండి. ఉద్యోగులు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి ఉత్సాహంగా గడుపుతారు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు నూతనోత్సాహం, మహిళలకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. నృసింహ స్తోత్రాలు పఠించండి.

కర్కాటక రాశి

కర్కాటకరాశి వారు ఎంతటి పని చేపట్టినా అలసట ఎదురైనా పూర్తి చేస్తారు. ఇతరుల ద్వారా రావలసిన సొమ్ము మొత్తాన్ని రాబట్టుకుంటారు. కుటుంబ సభ్యులతో అభిప్రాయాలను పంచుకుంటారు. నిర్మొహమాటంగా మనసులో ఉన్న విషయాలను వెల్లడిస్తారు. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఒక భూవిషయంలో సందిగ్ధత నెలకొనే సూచనలు ఉన్నాయి.

వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. మరింత విస్తరించాలన్న ఆలోచనలు భాగస్వాములతో పంచుకుంటారు. ఉద్యోగుల శ్రమ ఫలిస్తుంది. సేవలకు తగిన గుర్తింపు లభిస్తుంది. వైద్యులు, పారిశ్రామికవేత్తలకు ఉత్సాహంగా ఉంటుంది. మహిళలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. పైస్థాయి వారి నుండి సమస్యలు రావచ్చు. విష్ణు ధ్యానం మంచిది. బియ్యంతో చేసిన తీపి పదార్థం నివేదించండి.

సింహ రాశి

వీరికి శుభకాలమనే చెప్పాలి. మధ్యమధ్యలో కొన్ని ఇబ్బందులు, సమస్యలు వచ్చినా ఆత్మస్థైర్యం కోల్పోరు. ఆలోచనలు అమలు చేసి ముందడుగు వేస్తారు. ఇతరుల ద్వారా సొమ్ము వచ్చే సూచనలు, ఆదాయం కొంత పెరుగుతుంది. రుణబాధల నుండి ఉపశమనం లభిస్తుంది. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తొలగుతాయి. వేడుకల నిర్వహణపై చర్చలు జరుగుతాయి. మీరు తీసుకునే నిర్ణయాలు అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటాయి.

స్థిరాస్తులపై ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు సమకూరి లాభాలు అందుతాయి. ఉద్యోగులు సత్తా చూపించి ముందుకు సాగుతారు. టెక్నికల్ రంగం వారి యత్నాలు ఫలవంతం అవుతాయి. మహిళలకు కుటుంబంలో విశేష గౌరవం లభిస్తుంది. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి. అమ్మవారికి కుంకుమార్చన చేయడం మంచిది.

కన్య రాశి

కన్యరాశి వారికి ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు ఎదురవుతాయి. అనుకున్న సొమ్ము అందడంలో సమస్యలు ఉంటాయి. ఖర్చులు పెరుగుతాయి. కొంతమంది నుండి రావలసిన డబ్బు సమయానికి అందదు. కుటుంబ సభ్యులతో విభేదాలు, బంధువుల తాకిడి ఎక్కువవుతుంది. ఆస్తుల కొనుగోలుపై ఒక అంచనాకు వస్తారు. వ్యాపారాలలో సాధారణ లాభాలు వస్తాయి.

ఉద్యోగులకు పనిభారం పెరిగి సవాలుగా మారుతుంది. క్రీడాకారులు, రాజకీయవేత్తలు, కళాకారులకు గందరగోళంగా ఉంటుంది. టెక్నికల్ రంగం వారి యత్నాలు నెమ్మదిగా సాగుతాయి. సోమవారం శుభవార్త రావచ్చు. మహిళలకు సోదరులతో విభేదాలు రావచ్చు. గణేశాష్టకం పఠించండి. ఆవుపాలు నివేదించండి.

తుల రాశి

కొత్త వ్యక్తుల పరిచయం కొంత ఉత్సాహాన్ని ఇస్తుంది. ఆర్థిక విషయాలు కొంత ఊరటనిస్తాయి. బంధువుల ద్వారా సాయం అందుతుంది. కుటుంబంలో అభిప్రాయాలను గౌరవిస్తారు. బంధువులు, సోదరులతో సఖ్యత ఉంటుంది. భార్యాభర్తల మధ్య అపోహలు తొలగుతాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తులపై దృష్టి పెరుగుతుంది.

ఉద్యోగాలకు ఒక సమాచారం ఊరట ఇస్తుంది. మీ అంచనాలు నిజం కావచ్చు. వైద్యులు, పారిశ్రామికవేత్తలు, కళాకారుల యత్నాలు సఫలమవుతాయి. టెక్నికల్ రంగం వారికి ఒత్తిడులు వచ్చినా తట్టుకునే శక్తి పెరుగుతుంది. మహిళలకు ఆస్తిలాభ సూచనలు ఉన్నాయి. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి. శనివారం రావిచెట్టు చుట్టూ 9 ప్రదక్షణలు చేయండి.

వృశ్చిక రాశి

వృశ్చికరాశి వారికి ఈ వారం ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. అవసరాలకు తగినంత డబ్బు లభిస్తుంది. కుటుంబంలో అందరి ప్రేమకు పాత్రులు అవుతారు. శుభకార్యాలపై చర్చలు జరుగుతాయి. బంధువులు బాధ్యతలు పెడతారు. వివాదాలను సర్దుబాటు చేసుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేయడానికి మార్గం సులభమవుతుంది. వ్యాపారాలలో అనుకున్న లాభాలతో ఉత్సాహంగా గడుపుతారు.

కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులు లక్ష్య సాధనలో విజయం సాధిస్తారు. పదోన్నతులకు అవకాశం ఉంటుంది. విధుల్లో జాగ్రత్తలు పాటించాలి. క్రీడాకారులు, రాజకీయవేత్తలకు అనుకూలం. టెక్నికల్ రంగం వారి ఆశలు ఫలిస్తాయి. పూజించాల్సిన దైవం... దేవీస్తుతి పఠించండి. తేనె అమ్మవారికి నివేదించి దానంగా ఇవ్వండి.

ధనుస్సు రాశి

ధనుస్సురాశి వారు ముఖ్యమైన కార్యక్రమాలను ఎట్టకేలకు పూర్తి చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు క్రమంగా తొలగుతాయి. షేర్లలో పెట్టుబడులకు అవకాశం లభిస్తుంది. రుణదాతల ఒత్తిడుల నుంచి బయటపడతారు. సంతాన సమస్యలు అధిగమిస్తారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. భూములు, వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

వ్యాపారాలలో అనుకున్న లాభాలు లభిస్తాయి. కొత్త పెట్టుబడుల వ్యవహారంలో విజయం సాధిస్తారు. ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. టెక్నికల్ రంగం వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. పైస్థాయికి చేరే అవకాశం ఉంది. మహిళలకు ధన లేదా ఆస్తిలాభం ఉంటుంది. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి. శివాలయంలో 11 ప్రదక్షణలు మూడు రోజులు చేయండి.

మకర రాశి

మకరరాశి వారు అనుకున్న కార్యాలలో అవాంతరాలు వచ్చినా అధిగమిస్తారు. సహనం, పట్టుదల రక్షకంగా నిలుస్తాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. రుణదాతల ఒత్తిడులు తొలగుతాయి. సకాలంలో సొమ్ము లభిస్తుంది. భార్యాభర్తల మధ్య విభేదాలు తొలగుతాయి. బంధువుల సహకారం లభిస్తుంది. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో లాభాలు సాధారణంగానే ఉంటాయి. కొత్త భాగస్వాములతో చర్చలు ఫలిస్తాయి. కోరుకున్న మార్పులు సాధ్యమవుతాయి.

వైద్యులు, క్రీడాకారులు, కళాకారులకు నూతనోత్సాహం, అవకాశాలు పెరుగుతాయి. టెక్నికల్ రంగం వారి ప్రయత్నాలకు సహకారం లభిస్తుంది. మహిళలకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. లక్ష్మీ స్తోత్రాలు పఠించండి. పాయసం అమ్మవారికి నివేదించండి.

కుంభ రాశి

కుంభరాశి వారు వ్యవహారాలలో విజయం సాధించేందుకు దగ్గరలో ఉంటారు. రావలసిన సొమ్ము అందుకుని ఖర్చులను అధిగమిస్తారు. రుణబాధల నుండి విముక్తి పొందుతారు. సోదరుల నుండి ధన లాభం లభిస్తుంది. కుటుంబంలో అభిప్రాయాలను గౌరవిస్తారు. భార్యాభర్తల మధ్య అపోహలు తొలగుతాయి. సంతాన సమస్యలు తొలగుతాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు.

కొత్త ఆస్తుల కొనుగోలుకు అగ్రిమెంట్లు చేస్తారు. వ్యాపారాలలో నూతనోత్సాహంతో ముందడుగు వేస్తారు. కొత్త భాగస్వాములను చేర్చుకుంటారు. విధి నిర్వహణలో అవాంతరాలు తొలగుతాయి. క్రీడాకారులు, రాజకీయవేత్తలకు ఉత్సాహం లభిస్తుంది. టెక్నికల్ రంగం వారికి ఒత్తిడులు తొలగి ఉపశమనం లభిస్తుంది. మహిళలకు సంతోషకరమైన సమాచారం లభిస్తుంది. రాఘవేంద్రస్వామి స్తోత్రాలు పఠించండి. పటిక బెల్లం నివేదించండి.

మీన రాశి

మీన రాశివారికి కొంత నిరాశ కలిగించినా క్రమంగా పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆర్థికంగా అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఇబ్బందులు తొలగుతాయి. పొదుపు బాటలో నడుస్తారు. సోమ, మంగళవారాలు డబ్బు సమస్యలు ఉండవచ్చు, రుణయత్నాలు చేయాల్సి ఉంటుంది. భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. కొత్త పెట్టుబడులు సమకూరతాయి, లాభాలు లభిస్తాయి. బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారు.

పైస్థాయి వారితో జాగ్రత్తగా మసలుకోవాలి. వైద్యులు, క్రీడాకారులు, పారిశ్రామికవేత్తలకు ఆహ్వానాలు అందుతాయి. టెక్నికల్ రంగం వారికి ప్రాజెక్టులు సజావుగా కొనసాగుతాయి. మహిళలకు ఆస్తిలాభ సూచనలు ఉన్నాయి. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. ఆవుపాలు, చక్కెర కలిపి నివేదించండి.

పంచాంగ కర్త: బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ - 9494981000

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More