కలలో మాజీ ప్రియుడు లేదా మాజీ ప్రేయసి కనపడితే ఏం అవుతుంది? దానికి అర్ధం ఏంటంటే?
ప్రతి ఒక్కరూ నిద్రలో కలలు కనడం సహజం. ఒక్కోసారి మనకు ఎక్కువగా కలలు రావడం కూడా జరుగుతుంది. ఈ కలల వెనుక ఏదో ఒక సంకేతం ఉండే అవకాశం ఉంది. కొన్ని సార్లు, జీవితంతో అనుబంధం ఉన్న విషయాలు కూడా కలలో ప్రత్యక్షమవుతాయి. కలలో మాజీ ప్రియుడు లేదా మాజీ ప్రేయసి కనపడితే ఏం అవుతుంది?
మనం నిద్రపోయినప్పుడు ఎన్నో కలలు వస్తూ ఉంటాయి. కొన్ని మంచి కలలు వస్తే, కొన్ని పీడ కలలు కూడా వస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరూ నిద్రలో కలలు కనడం సహజం. ఒక్కోసారి మనకు ఎక్కువగా కలలు రావడం కూడా జరుగుతుంది. ఈ కలలవెనుక ఏదో ఒక సంకేతం ఉండే అవకాశం ఉంది. కొన్ని సార్లు, జీవితంతో అనుబంధం ఉన్న విషయాలు కూడా కలలో ప్రత్యక్షమవుతాయి. ఈ కలలు వచ్చే సందర్భాలను జాగ్రత్తగా విశ్లేషిస్తే, వాటి సంకేతాన్ని అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది.

స్వప్న శాస్త్రం పురాతనమైనది. అనేక మంది దీనిపై నమ్మకం కలిగి ఉంటారు. మనం నిద్రపోయినప్పుడు వచ్చే కలలు, జీవితంలో అనేక సంఘటనలతో సంబంధం కలిగి ఉంటాయని స్వప్న శాస్త్రం చెబుతోంది.
కలలో మాజీ ప్రియుడు లేదా ప్రేయసి కనిపిస్తే:
కలలోమీరు మాజీ ప్రియుడు లేదా ప్రేయసిని చూస్తే, మీరు ఇంకా వారిని మనసులోంచి పూర్తిగా వదలలేదని, వారి ఆలోచనలతో ఇంకా జీవిస్తూ ఉన్నారని అర్థం చేసుకోవాలి. వాళ్లు ప్రత్యక్షంగా కనబడకపోయినా, మెదడులో మాత్రం వారు ఇంకా ఉన్నారన్న సంకేతం ఇది.
పదేపదే మీ కలలో మీ మాజీ ప్రియుడు లేదా మాజీ ప్రేయసి కనపడినట్లయితే మీరు వారిని బాగా మిస్ అవుతున్నారని కూడా అర్థం. అందుకనే ఇలా జరుగుతూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు బాధపడి ఆలోచించడం వలన వారు కలలోకి వస్తూ వుంటారు.
ఏమైనా చెప్పాలన్న విషయాన్ని చెప్పకుండానే బ్రేకప్ అయిపోతే కూడా పదేపదే మీ మాజీ ప్రియుడు లేదా మాజీ ప్రేయసి కలలో కనపడతారని స్వప్న శాస్త్రం ప్రకారం చెప్తోంది. బ్రేకప్ బాధఎక్కువగా ఉంటే కూడా కలలో మాజీ ప్రియుడు లేదా మాజీ ప్రేయసి కనపడతారు.
కలలో తెలియని వ్యక్తి ప్రపోజ్ చేయడం:
ఒకవేళ కలలో ఎవరో తెలియని వ్యక్తి ప్రపోజ్ చేస్తే అది కొత్త అనుబంధాలు జీవితంలోకి రాబోతున్నాయని సూచిస్తుంది. జీవితంలోకి కొత్తమనుషులు, కొత్త పరిచయాలు రాకముందు ఇటువంటి కలలు వస్తాయని స్వప్న శాస్త్రం వివరిస్తోంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper



