...
...
Next Story

గజకేసరి యోగం అంటే ఏంటి? ఈ ఉత్తమమైన, అత్యంత మంగళకరమైన యోగం వలన ఎవరు ఎలాంటి లాభాలు పొందవచ్చో తెలుసుకోండి!

యోగాలలో ఉత్తమమైనది, అత్యంత మంగళకరమైనది గజకేసరి యోగం. ఈ యోగం వలన ఆర్థిక పురోభివృద్ధిని పొందవచ్చు. అలాగే, ఈ యోగం వలన ఉద్యోగంలో ప్రమోషన్లు కూడా వస్తాయి. గజకేసరి యోగం అంటే ఏంటి? ఈ ఉత్తమమైన, అత్యంత మంగళకరమైన యోగం వలన ఎవరు ఎలాంటి లాభాలు పొందవచ్చో తెలుసుకోండి.

Published on: Jun 24, 2025, 15:00:11 IST
By , , Hyderabad
Prefer HTon Google
Advertisement

గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. ఇలా గ్రహాలు రాశి మార్పు చెందినప్పుడు, కొన్ని కొన్ని సార్లు మరో గ్రహంతో సంయోగం చెందుతూ ఉంటాయి. అలాంటప్పుడు శుభయోగాలు, అశుభ యోగాలు ఏర్పడతాయి. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం జాతకంలో అనేక యోగాలు ఏర్పడతాయి.

గజకేసరి యోగం

గజకేసరి యోగం (pinterest)
గజకేసరి యోగం (pinterest)

యోగాలలో ఉత్తమమైనది, అత్యంత మంగళకరమైనది గజకేసరియోగం. ఈ యోగం వలన ఆర్థిక పురోభివృద్ధిని పొందవచ్చు. అలాగే, ఈ యోగం వలన ఉద్యోగంలో ప్రమోషన్లు కూడా వస్తాయి. ఆదాయం కూడా పెరుగుతుంది. ఇలా గజకేసరి రాజయోగం అనేక లాభాలను అందిస్తుంది.

గజకేసరి యోగం ఎలా ఏర్పడుతుంది?

గురువు, చంద్రుడు సంయోగం చెందినప్పుడు గజకేసరి యోగం ఏర్పడుతుంది. గురువు, చంద్రుడి కలయిక ద్వారా మనిషి జాతకంలో గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. చంద్రుడు, గురువు వారికి శుభయోగాలను ప్రసాదిస్తారు. గజకేసరి రాజయోగం ఎవరి జాతకంలో అయితే ఏర్పడుతుందో, వారికి దేనికి లోటు ఉండదు. ఎప్పుడు అదృష్టం పొందుతారు. ఆర్థికంగా బలహీనమైన ఇంట్లో పుట్టినప్పటికీ ధనవంతులుగా, సంపన్నులుగా మారతారు.

గజకేసరి యోగం వలన కలిగే లాభాలు

  1. ఎవరి జాతకంలో అయితే గజకేసరి రాజయోగం ఉంటుందో వారు కెరీర్‌లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. వారి కోరికలన్నీ నెరవేరుతాయి. ఎలాంటి ఇబ్బందులు రావు.
  2. కేవలం డబ్బుమాత్రమే రావడం కాదు, పిల్లల ద్వారా సంతోషం కూడా ఉంటుంది.
  3. ఇంటిని కొనుగోలు చేస్తారు. వాహనాలను కొనుగోలు చేస్తారు.
  4. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. ఇలా అనేక విధాలుగా లాభాలను పొందుతారు.

స్త్రీ జాతకంలో గజకేసరి యోగం ఉంటే ఏమవుతుంది?

జాతకంలో గజకేసరి యోగం ఉన్న పురుషుడు బలవంతుడు, తెలివైనవాడు, ఎనలేని ధైర్య సాహసాలతో ఉంటాడు. ఈ పురుషులు ధనవంతులుగా మారతారు. ఎక్కువ డబ్బులు వస్తాయి. ప్రతి దానిని కూడా నెరవేరుస్తాడు. గజకేసరి రాజయోగం నాలుగవ లేదా పదవ ఇంట్లో ఏర్పడినప్పుడు ఆ పురుషుడు తన వ్యాపార, వృత్తిలో ఉన్నత స్థానాన్ని పొందుతాడు.

వివాహం, గజకేసరి యోగం

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, జాతకంలో ఏడవ ఇల్లు వివాహానికి సంబంధించినది. గజకేసరి యోగం ఏడవ ఇంట్లో ఏర్పడితే, వైవాహికజీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఈ యోగం కారణంగా ఆ వ్యక్తికి త్వరగా వివాహం జరుగుతుంది. అదృష్టం కూడా మరింత పెరుగుతుంది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe