...
...
Next Story

ఏ రత్నాలను ఎవరు ధరిస్తే అదృష్టం కలుగుతుంది? ఇలా చేస్తే తిరుగే ఉండదు!

ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఏ బాధ లేకుండా సంతోషంగా ఉండాలని, విజయాలను అందుకోవాలని అనుకుంటారు. జీవితాంతం కష్టపడుతూ ఉంటారు. జీవితంలో సక్సెస్ అవ్వాలంటే కచ్చితంగా అదృష్టం ఉండాలి. లేకపోతే చాలా సఫర్ అవ్వాల్సి ఉంటుంది. రత్నాలు అదృష్టాన్ని కలిగిస్తాయా?

Published on: Jul 4, 2025, 15:30:00 IST
By , , Hyderabad
Prefer HTon Google
Advertisement

గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. ఈ సమయంలో శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడతాయి. రాశులు, గ్రహాలు జీవితం పై ఖచ్చితంగా ప్రభావం చూపిస్తాయి. చాలా మంది ఈ విషయాన్ని బలంగా నమ్ముతారు కూడా. ఒకసారి గ్రహాలుసహకరించాలని రత్నాలను కూడా ధరిస్తూ ఉంటారు.

రత్నాలను ఎందుకు ధరించాలి? (pinterest)
రత్నాలను ఎందుకు ధరించాలి? (pinterest)

అయితే, చాలా మందిలో ఉండే సందేహం ఏంటంటే, ఎవరు ఏ రత్నాన్ని ధరించాలి? ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఏ బాధ లేకుండా సంతోషంగా ఉండాలని, విజయాలను అందుకోవాలని అనుకుంటారు. జీవితాంతం కష్టపడుతూ ఉంటారు. జీవితంలో సక్సెస్ అవ్వాలంటే కచ్చితంగా అదృష్టంఉండాలి. లేకపోతే చాలా సఫర్ అవ్వాల్సి ఉంటుంది.

రత్నాలను ఎందుకు ధరించాలి?

గ్రహాలు సహకరించడానికి రత్నాలను ధరిస్తూ ఉంటారు. పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా రత్నాలను ధరిస్తూ ఉంటారు. రత్నాలు అదృష్టాన్ని కలిగిస్తాయా? ఏ రత్నంధరించడం వలన ఎటువంటి లాభాలను పొందవచ్చు? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

1.నీలమణి:

శనిగ్రహాన్ని నీలమణి సూచిస్తుంది. దీనిని ధరించడం వలన జీవితంలో కష్టాలను అధిగమించవచ్చు. అయితే, ఈ రత్నాన్ని ఎవరు పడితే వారు ధరించకూడదు. జ్యోతిష నిపుణులు సలహా మేరకు ధరిస్తే మంచిది. ఈ రత్నాన్ని వేలకు ధరిస్తే మంచి ఫలితం కనబడుతుంది.

2.ఎమరాల్డ్:

ఇది బుధగ్రహాన్ని సూచిస్తుంది. మంచి ఆలోచనలను కల్పించడానికి ఇది సహాయపడుతుంది. మాట్లాడే వృత్తిలో ఉన్నవారు, బోధకులు, రచయితలు వంటి వారికి ఇది సరిగ్గా సరిపోతుంది. చిటికెన వేలుకు ధరిస్తే శుభ ఫలితాలను పొందవచ్చు.

3.రూబీ:

సూర్యుడుశక్తిని ప్రతిబింబిస్తుంది. దీనిని ధరిస్తే నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. కఠిన నిర్ణయాలు తీసుకునేవారు ఎక్కువగా రూబీని ధరిస్తారు. ఉంగరం వేలికి ధరిస్తే శుభ ఫలితాలను పొందవచ్చు.

4.ఎర్ర పగడాలు:

ముత్యాలు చంద్రుడిని సూచిస్తాయి. అంతర్గత శాంతికోసం ముత్యాలను ధరించడం మంచిది. ముత్యాలను ధరిస్తే ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవచ్చు. మనపై మనకి నమ్మకం కూడా కలుగుతుంది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe