వాస్తు ప్రకారం సీసీటీవీ కెమెరా ఏ దిశలో ఉంటే మంచిది? ఎలాంటి పొరపాట్లు చేయకూడదో తెలుసుకోండి!

వాస్తు ప్రకారం అనుసరించడం వలన సానుకూల శక్తి ప్రవహిస్తుంది, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. అయితే, ఇంట్లో ఉండే కొన్ని వస్తువులకు సంబంధించి కూడా వాస్తు నియమాలని పాటించడం మంచిది. ఈరోజు వాస్తు ప్రకారం ఇంట్లో సీసీ కెమెరాలు ఏ దిశలో ఉంచితే మంచిదో అనే దాని గురించి తెలుసుకుందాం.

Published on: Jun 16, 2025, 12:00:17 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

చాలా మంది వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం అనుసరించడం వలన సానుకూల శక్తి ప్రవహిస్తుంది, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. వాస్తుప్రకారం పాటించడం వలన ఎలాంటి ఇబ్బందులకు కూడా లోటు ఉండదు, అన్ని ప్రశాంతంగా జరుగుతాయి, అదృష్టం కూడా కలిసి వస్తుంది.

వాస్తు ప్రకారం సీసీటీవీ కెమెరా ఏ దిశలో ఉంటే మంచిది? (pinterest)
వాస్తు ప్రకారం సీసీటీవీ కెమెరా ఏ దిశలో ఉంటే మంచిది? (pinterest)

చాలా మంది ఇళ్లల్లో వాస్తు ప్రకారం నియమాలని పాటిస్తూ ఉంటారు. దాని వలన సానుకూల శక్తి వ్యాపించి, హాయిగా జీవించొచ్చు. ఈ విజ్ఞాన యుగంలో వేద జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం, సాముద్రికశాస్త్రం లాంటి ప్రాచీన గ్రంథాల సూత్రాలపై ప్రజలకు విశ్వాసం ఏ మాత్రం తగ్గలేదు. ప్రజలు వారి ఇంటిని నిర్మించేటప్పుడు ఖచ్చితంగా వాస్తు నియమాలని పాటిస్తూ ఉంటారు.

వాస్తు ప్రకారం ఇంటిని నిర్మించడం వలన ఇంట్లో ఏ ఇబ్బంది రాదని, సానుకూల శక్తి ప్రవహిస్తుందని నమ్ముతారు. అయితే, ఇంట్లో ఉండే కొన్ని వస్తువులకు సంబంధించి కూడా వాస్తు నియమాలని పాటించడం మంచిది. ఈరోజు వాస్తు ప్రకారం ఇంట్లో సీసీ కెమెరాలు ఏ దిశలో ఉంచితే మంచిదో అనే దాని గురించి తెలుసుకుందాం.

వాస్తు ప్రకారం ఇంట్లో సీసీ కెమెరాలు ఏ దిశలో ఉంచాలి?

ఈరోజుల్లో చాలామంది భద్రత కోసం ఇళ్లల్లో సీసీ కెమెరాలు ఉంచుతున్నారు. సీసీ కెమెరాలను ఏ దిశలోఉంచితే మంచిదనే దాని గురించి వాస్తు పండితులు చెప్పడం జరిగింది. వీటిని సరైన దిశలో ఉంచినట్లయితే సానుకూల శక్తి వ్యాపిస్తుంది, సమస్యల నుంచి బయటపడవచ్చు.

ఈ దిశలో సీసీ కెమెరాలను ఉంచడం మంచిది కాదు

సీసీ కెమెరాలను ఇంట్లో పెట్టేటప్పుడు చాలా మంది తూర్పు, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం, దక్షిణం వైపు ఉంచుతారు. దాని వలన చిన్నపాటి సమస్యలువచ్చే అవకాశం ఉంటుంది. ఈ దిశల్లో సీసీ కెమెరా ఉండడం వలన ఆర్థిక నష్టాలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ దిశలో సీసీ కెమెరాలతో పాటు మీ పిల్లల ఫోటోలు వంటివి కూడా పెట్టడం మంచిది కాదు.

ఏ దిశలో ఉంచాలి?

వాస్తు ప్రకారం, సీసీ కెమెరాలను ఇంట్లో పెట్టేటప్పుడు ఈశాన్యం వైపు పెడితే మంచిది. దక్షిణం లేదా నైరుతి వైపు మాత్రం సీసీ కెమెరాలు ఉంచకండి. ఇది ప్రతికూల శక్తికి కారణం అవుతుంది.

గడియారం పెట్టేటప్పుడు ఈ తప్పులు చేయకండి:

ఇంట్లో గడియారాలను పెట్టేటప్పుడు సరైన దిశలో పెట్టడం మంచిది. వాస్తు ప్రకారం, గడియారాలను దక్షిణం లేదా తూర్పు వైపు పెట్టడం మంచిది కాదు. ఇది ప్రతికూలశక్తికి కారణం అవుతుంది. గుండ్రటి గడియారాన్ని ఉత్తరం లేదా పడమర వైపు పెడితే శుభ ఫలితాలను పొందవచ్చు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More