...
...
Next Story

సాలిగ్రామాలను ఎందుకు పూజిస్తారు? వాటి ప్రాముఖ్యత, పూజా విధానం తెలుసుకోండి.. ఇలా చేస్తే కోటి యాగాలు చేసినంత పుణ్యం!

సాలిగ్రామం విష్ణువు చిహ్నంగా పరిగణిస్తారు. అందుకే వీటిని భక్తితో ఆరాధిస్తారు. పురాణాలలో ఈ రాళ్లు విశ్వరూపంలో ఉన్న శ్రీ నారాయణ స్వరూపంగా చెప్పబడింది. అసలు ఈ రాళ్లు ఎలా ఉంటాయి? ఎక్కడ దొరుకుతాయి? సాలిగ్రామాలను ఎందుకు పూజిస్తారు? వాటి ప్రాముఖ్యత, పూజా విధానం గురించి ఇప్పుడే తెలుసుకోండి.

Published on: Jun 25, 2025, 15:00:11 IST
By , , Hyderabad
Prefer HTon Google
Advertisement

ప్రతిరోజు మన ఇంట్లో దీపారాధన చేయడం వలన ఎంతో మంచి ఫలితాన్ని పొందవచ్చు. అందుకే ప్రతి రోజు ఇంటిని శుభ్రం చేసి, దేవుడి గదిని శుభ్రపరచి, దీపారాధన చేసి, పుష్పాలతో పూజ చేసి, ఆ తర్వాత ధూపం, నైవేద్యం — ఇలా ఎవరికి నచ్చినట్లు వారు రోజూ పూజ చేస్తారు. అయితే, చాలామంది సాలిగ్రామాలను కూడా పూజిస్తారు. ఇంట్లోసాలిగ్రామాలను పెట్టి పూజించడం వలన ఏమవుతుంది? సాలిగ్రామాలను ఆరాధించడం వలన ఎలాంటి ఫలితాన్ని పొందవచ్చు అనే ముఖ్యమైన విషయాలను ఈ రోజు తెలుసుకుందాం.

అసలు ఈ రాళ్లు ఎలా ఉంటాయి? ఎక్కడ దొరుకుతాయి?

సాలిగ్రామాలను ఎందుకు పూజిస్తారు? (pinterest)
సాలిగ్రామాలను ఎందుకు పూజిస్తారు? (pinterest)

నేపాల్‌లో పవిత్ర గండకీ నదిలో ఈ నలుపు, మృదువైన రాళ్లు కనిపిస్తాయి. శంఖం, చక్రం, గద, పద్మం లాంటి శుభచిహ్నాలు వీటి పై ఉంటాయి. కొన్ని రాళ్లకైతే తెల్లటి వృత్తాకార చారలు ఉంటాయి. దీంతో అవి మరింత ప్రత్యేకంగా కనిపిస్తాయి.

విష్ణువుగా

సాలిగ్రామం విష్ణువుచిహ్నంగా పరిగణిస్తారు. అందుకే వీటిని భక్తితో ఆరాధిస్తారు. పురాణాలలో ఈ రాళ్లు విశ్వరూపంలో ఉన్న శ్రీ నారాయణ స్వరూపంగా చెప్పబడింది.

గ్రంథాలలో సాలిగ్రామం ప్రత్యేకత:

  1. పద్మ పురాణంప్రకారం చూసినట్లయితే, సాలిగ్రామాలకు పూజ చేసిన వ్యక్తికి కోటి యాగాలు, కోటి గోవులను దానం చేసినంత సమానమైన పుణ్యం కలుగుతుంది.
  2. సాలిగ్రామాలను స్మరించడం, జపం చేయడం, ధ్యానం చేయడం, పూజించడం వలన పాపాలు తొలగిపోతాయి. సాలిగ్రామం, తులసి రెండు కూర్చిన ప్రదేశంలో భగవంతుడు విష్ణుమూర్తి కొలువై ఉంటాడు. లక్ష్మీదేవి కూడా అక్కడ కొలువై ఉంటుంది. దైవిక శక్తితో ఆ ప్రదేశం నిండి ఉంటుంది.

శివుడు వర్ణించిన సాలిగ్రామ మహిమ:

సాలిగ్రామ మహిమను స్వయంగా శివుడే ప్రస్తావించారు. లక్షలాది తామర పూలతో చేసే పూజ కంటే, సాలిగ్రామాలను పూజించడం వలన ఎన్నో రెట్లు ఎక్కువ పుణ్యఫలాన్ని పొందవచ్చని చెప్పారు. లక్షలాది శివ లింగాలను దర్శించి, పూజించి, స్తుతిస్తే ఎంత పుణ్యంవస్తుందో, సాలిగ్రామాలను పూజించడం వలన అంత పుణ్యాన్ని పొందవచ్చట.

తులసి, శంఖం, సాలిగ్రామాలను పూజించడం వలన ఆనందం, శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతాయి. ఎక్కడైతే సాలిగ్రామాలను పూజిస్తారో, అక్కడ పుణ్యక్షేత్రంగా మారుతుంది. భగవంతుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks