ఈ ఐదు రాశుల మహిళలు నిజాన్ని నిర్భయంగా మాట్లాడతారు.. వీరికి ధైర్యం కూడా ఎక్కువే!

ఎలాంటి పరిస్థితుల్లో అయినా నిజాన్ని బయటకు చెప్పడం అనేది కొంచెం కష్టమే. కొన్ని రాశులకి చెందిన మహిళలు నిజాన్ని నిర్భయంగా వెల్లడిస్తారు. అంతేకాదు, ఈ మహిళలు సామర్థ్యం కలిగిన వ్యక్తులు అని నమ్ముతారు. భయం లేకుండా మాట్లాడుతారు. వీరికి ధైర్యం కూడా ఎక్కువే.

Published on: Jun 3, 2025, 16:30:07 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మనం రాశుల ఆధారంగా ఒక మనిషి భవిష్యత్తు ఎలా ఉంటుందనే విషయంతో పాటు, వారి ప్రవర్తన తీరు ఎలా ఉంటుందనేది కూడా చెప్పవచ్చు. ఈ రాశుల మహిళలు పరిస్థితులు ఎలా ఉన్నా సరే, నిజాన్ని ఏమాత్రం భయం లేకుండా బయటకు చెప్తారు. నిజాన్ని దాచి పెట్టడం వీరికి అసలు తెలియదు./ ఏ రాశి మహిళలు నిజాన్ని నిర్భయంగా మాట్లాడతారనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ ఐదు రాశుల మహిళలు నిజాన్ని నిర్భయంగా మాట్లాడతారు (pinterest)
ఈ ఐదు రాశుల మహిళలు నిజాన్ని నిర్భయంగా మాట్లాడతారు (pinterest)

ఎలాంటి పరిస్థితుల్లో అయినా నిజాన్ని బయటకు చెప్పడం అనేది కొంచెం కష్టమే. కొన్ని రాశులకి చెందిన మహిళలునిజాన్ని నిర్భయంగా వెల్లడిస్తారు. అంతేకాదు, ఈ మహిళలు సామర్థ్యం కలిగిన వ్యక్తులు అని నమ్ముతారు. భయం లేకుండా మాట్లాడుతారు. ఈ రాశుల్లో మీ రాశి ఎక్కువగా ఉందేమో చూసుకోండి.

1.ధనుస్సు రాశి

ధనుస్సురాశి మహిళలు నిజాన్ని నిర్భయంగా చెప్తారు. తెలివితేటలు, జ్ఞానాన్ని ప్రదర్శిస్తారు. మాట్లాడడానికి అసలు భయమే ఉండదు. వీరికి ఓపెన్ మైండ్ ఉంటుంది.

2.కుంభ రాశి

కుంభరాశి మహిళలు వారి వినూత్న ఆలోచనలను, నమ్మకాలని భయం లేకుండా ఇతరులతో షేర్ చేసుకుంటారు. ఈ స్త్రీలకు ముందు చూపు కూడా ఎక్కువగా ఉంటుంది. స్వతంత్రంగా ఉండడానికి ఇష్టపడతారు. వీళ్ళు నమ్మే విషయాలని ఏ మాత్రం సంకోచం లేకుండా బయటకు చెప్తారు.

3.వృశ్చిక రాశి

వృశ్చికరాశి స్త్రీలు నిజాయితీగా ఉంటారు. ఏమాత్రం భయం లేకుండా మాట్లాడతారు. వారి భావోద్వేగాలను భయం లేకుండా పంచుకుంటారు. కష్టమైన అంశాలని కూడా సులువుగా పరిష్కరిస్తారు. అర్థవంతంగా మాట్లాడతారు. మీరు చెప్పేది ఇతరులకు సులువుగా అర్థమవుతుంది.

4.మేష రాశి

మేషరాశి స్త్రీలు భయం, మొహమాటం లేకుండా వారి మనసులో మాటలను బయటకు చెప్తారు. అలాగే, ఈ స్త్రీలు ఏ మాత్రం బాధ్యత వహించడానికి కూడా భయపడరు. అభిప్రాయాలని ఇతరులతో పంచుకుంటారు. కాస్త మొండిగా ఉంటారు.

5.సింహ రాశి

సింహరాశి స్త్రీలు తేజస్సును కలిగి ఉంటారు. వీరు ఇతరులను సులువుగా ఆకర్షిస్తారు. నిజాన్ని మాట్లాడడానికి ఏ మాత్రం భయపడరు. వీరి మాటలతో ఇతరులను సులువుగా ఆకట్టుకుంటారు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది./

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More