యోగినీ ఏకాదశి 2025: ఈరోజే యోగినీ ఏకాదశి.. ఈరోజు ఈ 5 వస్తువులను దానం చేయండి, సంపద మీ ఇంటికి వస్తుంది!

యోగినీ ఏకాదశి నాడు మహా విష్ణువుని భక్తిశ్రద్ధలతో ఆరాధించడం వలన శుభ ఫలితాలను పొందవచ్చు. ఈరోజున ఉపవాసం ఉంటే పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. పద్మ పురాణం ప్రకారం, ఈరోజు ఎవరైతే భక్తిశ్రద్ధలతో ఉపవాసం చేసి మహా విష్ణువుని ప్రార్థిస్తారో వారికి ఆరోగ్యం బాగుంటుంది. ఈరోజు ఈ 5 వస్తువులను దానం చేస్తే మంచిది.

Published on: Jun 21, 2025 7:00 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రతి నెల రెండు ఏకాదశులు వస్తాయి. ఏకాదశి తిధి చాలా ప్రత్యేకమైనది. ఏకాదశి నాడు చాలామంది విష్ణుమూర్తిని ఆరాధిస్తారు. అలాగే ఏకాదశి నాడు ఉపవాసం కూడా చేస్తారు. ఈసారి యోగినీ ఏకాదశిఎప్పుడు వచ్చింది? యోగినీ ఏకాదశి నాడు ఏం చేస్తే మంచిది అనే విషయాలను తెలుసుకుందాం.

ఈరోజే యోగినీ ఏకాదశి.. ఈరోజు ఈ 5 వస్తువులను దానం చేయండి (pinterest)
ఈరోజే యోగినీ ఏకాదశి.. ఈరోజు ఈ 5 వస్తువులను దానం చేయండి (pinterest)

యోగినీ ఏకాదశి తేదీ, సమయం

జూన్ 21, శనివారంనాడు యోగినీ ఏకాదశి వచ్చింది. జ్యేష్ఠ మాసం కృష్ణపక్ష ఏకాదశి జూన్ 21 ఉదయం 7:18కి మొదలై, జూన్ 22 ఉదయం 4:27 వరకు ఉంటుంది. ఉదయ తిథి ప్రకారం చూసుకోవాలి కనుక యోగినీ ఏకాదశి జూన్ 21న జరుపుకోవాలి.

యోగినీ ఏకాదశి నాడు మహా విష్ణువుని భక్తిశ్రద్ధలతో ఆరాధించడం వలన శుభ ఫలితాలను పొందవచ్చు. ఈరోజున ఉపవాసంఉంటే పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. పద్మ పురాణం ప్రకారం, ఈరోజు ఎవరైతే భక్తిశ్రద్ధలతో ఉపవాసం చేసి మహా విష్ణువుని ప్రార్థిస్తారో వారికి ఆరోగ్యం బాగుంటుంది, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి, సంపద పెరుగుతుంది.

యోగినీ ఏకాదశి నాడు ఉపవాసం, పూజతో పాటుగా ఈ ఐదింటిని దానం చేయడం మంచిది

  1. ఈ సమయంలో ఎండలు ఇంకా తగ్గవు కనుక మంచినీటిని పంపిణీ చేయడం మంచిది. సమీప ఆలయాల్లో అందరికీ మంచి నీటిని ఇవ్వచ్చు. ఇలా చేయడం వలన విష్ణుమూర్తి, లక్ష్మీదేవిసంతోషించి వారి పై సంపదను కురిపిస్తారు.
  2. యోగినీ ఏకాదశి నాడు దుస్తులను దానంచేయడం కూడా మంచిది. మహా విష్ణువుకి పసుపు రంగు అంటే ఎంతో ఇష్టం. పసుపు రంగు దుస్తులను దానం చేయడం వలన సంతోషం, సంపద కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి.
  3. మహా విష్ణువుని ప్రత్యేకించి ఆరాధించే ఈ పవిత్ర దినాన ధాన్యాలు కూడా దానం చేయవచ్చు. పేదవారికి ఈ రోజున ధాన్యాలను ఇవ్వడం వలన విష్ణుమూర్తి ప్రత్యేక ఆశీస్సులు కలుగుతాయి. ఆర్థికఇబ్బందులు ఉండవు. తిండికి లోటు ఉండదు.
  4. యోగినీ ఏకాదశి నాడు అరటి పండ్లను దానం చేస్తే కూడా మంచిది. మహా విష్ణువుకి అరటి పండ్లు చాలా ఇష్టం. వీటిని ఇవ్వడం వలన మీరు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు. డబ్బుకి లోటు ఉండదు.
  5. ఈరోజు ఇంట్లో పూజమందిరంలో నూనె లేదా నెయ్యితో దీపారాధన చేస్తే మంచిది. దీప దానం చేస్తే కూడా సకల సంతోషాలు కలుగుతాయి. దేనికి లోటు ఉండదు. ఏ ఇబ్బందులు రావు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More