రేపు శనివారం+యోగినీ ఏకాదశి+అశ్విని నక్షత్రం.. ఈ 5 పనులు చేసారంటే, ఎలాంటి సమస్యలైనా తొలగిపోతాయి!

ప్రతి ఏకాదశి రోజున శ్రీ విష్ణుమూర్తిని ఆరాధించడం వలన విశేష ఫలితాలను పొందవచ్చు. యోగినీ ఏకాదశి నాడు భక్తితో ఉపవాసం ఉంటే, 88 వేల మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టిన పుణ్యం లభిస్తుంది. రేపు శనివారం+యోగినీ ఏకాదశి+అశ్విని నక్షత్రం. ఈ 5 పనులు చేసారంటే, ఎలాంటి సమస్యలైనా తొలగిపోతాయి.

Published on: Jun 20, 2025, 12:00:09 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

జేష్ఠ మాసం కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని యోగినీ ఏకాదశి అంటారు. హిందూ మతంలో యోగినీఏకాదశికి ఎంతో ప్రత్యేకత ఉంది. ప్రతి ఏకాదశి రోజున శ్రీ విష్ణుమూర్తిని ఆరాధించడం వలన విశేష ఫలితాలను పొందవచ్చు. యోగినీ ఏకాదశి నాడు భక్తితో ఉపవాసం ఉంటే, 88 వేల మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టిన పుణ్యం లభిస్తుంది.

రేపు శనివారం+యోగినీ ఏకాదశి+అశ్విని నక్షత్రం (pinterest)
రేపు శనివారం+యోగినీ ఏకాదశి+అశ్విని నక్షత్రం (pinterest)

యోగినీ ఏకాదశి సమయం:

యోగినీ ఏకాదశి జూన్ 21 శనివారంనాడు వచ్చింది. జ్యేష్ఠ మాసం కృష్ణ పక్ష ఏకాదశి జూన్ 21 ఉదయం 7:18కి మొదలవుతుంది, జూన్ 22 ఉదయం 4:27తో ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం చూడాలి కనుక జూన్ 21న యోగినీ ఏకాదశిని జరుపుకోవాలి.

శనివారం + యోగినీ ఏకాదశి + అశ్విని నక్షత్రం

శనివారం నాడు యోగినీ ఏకాదశి రావడం శుభప్రదం. ఈరోజు శ్రీ విష్ణుమూర్తిని భక్తి, శ్రద్ధలతో ఆరాధించడం వలన విశేష ఫలితాలను పొందవచ్చు. యోగినీ ఏకాదశినాడు ఈ పనులు కచ్చితంగా చేయండి.

యోగినీ ఏకాదశి అదీ శనివారం వచ్చినందున, ఈరోజు సరిగ్గా వినియోగించుకుంటే సమస్యలన్నీ తీరిపోతాయి. ఈ ఏడాది మొదలైనప్పటి నుంచి ప్రతికూల శక్తితో ఇబ్బంది పడుతున్నవారు, ఆర్థికఇబ్బందులతో సతమతమవుతున్నవారు, ఏదో ఒక ఇబ్బంది వస్తున్నట్లు అనిపిస్తున్నవారు ఈ పరిహారాలను పాటించండి. ఇలా చేయడం వలన సానుకూల శక్తి ప్రవహించి, ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా బయటపడవచ్చు.

యోగినీ ఏకాదశి నాడు చేయవలసిన ముఖ్యమైన పనులు:

  1. తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణలు చేయండి.
  2. తులసి మొక్క ఎదుట దీపారాధన చేయండి.
  3. తులసిఆకులను శ్రీ విష్ణుమూర్తికి సమర్పించండి.
  4. విష్ణుమూర్తికి చేసిన ప్రసాదంలో తులసి ఆకులను వేసి నైవేద్యంగా సమర్పించండి.
  5. శ్రీ విష్ణుమూర్తికి తులసి అంటే ఎంతో ఇష్టం కనుక, యోగినీ ఏకాదశి నాడు తులసిని సమర్పించండి.
  6. తులసి మాలతో విష్ణుమూర్తిని అలంకరించండి. అలాగే విష్ణుమూర్తికి సంబంధించి ఏ ఆలయానికైనా వెళ్లండి.

ఈ మంత్రాన్ని జపించండి

"ఓం నమో భగవతే వాసుదేవాయ" అనే మంత్రాన్ని 108 సార్లు భక్తి శ్రద్ధలతో జపించండి. అలా చేయడం వలన శ్రీ విష్ణువు అనుగ్రహం లభించి, సమస్యలన్నీ తీరిపోతాయి. సంతోషంగా ఉండవచ్చు. కష్టాలన్నీ తొలగిపోతాయి.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More