...
...
Next Story

వీకెండ్ టూరిజం కోసం తెలంగాణలో 150 ప్రదేశాలు.. ఆదాయం సృష్టించేలా ప్రణాళిక!

తెలంగాణలో వీకెండ్ టూరిజం అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ప్రణాళికతో ముందుకు వెళ్తుందని పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ అన్నారు.

Published on: Nov 16, 2025, 15:00:33 IST
Advertisement

బిల్డింగ్ దీ వీకెండ్ టూరిజం ఎకానమీ అనే అంశంపై గచ్చిబౌలిలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌లో సదస్సు ఏర్పాటు చేశారు. వీకెండ్ పర్యాటక ఆర్థిక వ్యవస్థను నిర్మించడంపై దేశంలోనే మొట్టమొదటి సదస్సుకు హైదరాబాద్ ఆతిథ్యం ఇచ్చింది. రిసార్ట్ యజమానులు, పర్యాటక నిర్వాహకులు, విద్యార్థులు సహా అనేక మంది సమావేశమై, హైదరాబాద్ వంటి నగరాల్లో చిన్న బ్రేక్స్‌కు స్థిరమైన ఆర్థిక కార్యకలాపాలుగా ఎలా మార్చుకోవచ్చో చర్చించారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

వారాంతపు ప్రయాణం తెలంగాణలో అత్యంత ఆశాజనకమైన విభాగాలలో ఒకటిగా మారిందని పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ అన్నారు. 'ఐటీ, లైఫ్ సైన్సెస్ రంగాలలో దాదాపు 2.5 మిలియన్ల మంది ఉద్యోగులు రిఫ్రెష్ కోసం తరచుగా చిన్న విరామాలను కోరుకుంటారు. గతంలోలా కాకుండా, పర్యాటకం ఇకపై ఒక అభిరుచి కాదు. నేడు అది ఒక జీవనశైలి.' అని ఆయన అన్నారు. కొత్త పర్యాటక విధానం కింద ప్రోత్సాహకాలను ఉపయోగించాలని ఆయన కోరారు. చిన్న ప్రయాణాలను మనుషులను ఎలా మారుస్తాయో చెప్పారు.

'హైదరాబాద్‌లో దాదాపు పది లక్షల మంది ఐటీ నిపుణులు వారాంతపు విరామాలను కోరుకుంటున్నారు. తెలంగాణ కనీసం 150 వారాంతపు విహారయాత్రలను గుర్తించి వాటిని సమర్థవంతంగా ప్రచారం చేయాలి.' అని తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. ప్రభుత్వం కొత్త టూరిజం పాలసీ ప్రకటించిన కొన్ని నెలల్లో 31 ప్రాజెక్టులలో ఇప్పటికే రూ. 15,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించిందని అన్నారు.

ఈ కార్యక్రమం సందర్భంగా NITHM క్యాంపస్‌లోని ఒక సరస్సును తిరిగి తెరిచారు. FTCCI అధ్యక్షుడు రవి కుమార్, టూరిజం కమిటీ చైర్మన్ ప్రకాష్ అమ్మనబోలు, సహ-చైర్మన్ డి.రామచంద్రం మాట్లాడుతూ.. హైదరాబాద్ దేశ వీకెండ్ రాజధానిగా తనను తాను నిలబెట్టుకోగలదని అన్నారు. వీకెండ్ టూరిజం విశ్రాంతి మాత్రమే కాదు.. ఇది ఒక కొత్త ఆర్థిక నమూనా అన్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe