అదృష్టం ఎప్పుడు ఎటు నుంచి వస్తుందో చెప్పలేం. మనం అనుకోం.. కానీ మనకు రావాలి అని రాసిపెట్టి ఉంటే.. లక్షలు విలువ చేసేదైనా కాళ్ల దగ్గరకు వస్తుంది. అలాంటి వాటికి తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన ఘటనే ఉదాహరణ. ఇటీవల చౌటుప్పల్‌కు చెందిన వ్యక్తి తన ఇంటిని విక్రయించేందుకు లక్కీ డ్రా పద్ధతి ఎంచుకున్న విషయం తెలిసిందే. ఈ లక్కీ డ్రాలో 10 నెలల పాప రూ.500కే రూ.16 లక్షల విలువైన ఇంటిని సొంతం చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో కంచర్ల రామబ్రహ్మం అనే వ్యక్తికి రేకుల గదితో 66 గజాల ఇంటి స్థలం ఉంది. అయితే దీనిని అమ్మడానికి ఆయన వినూత్న పద్ధతిని ఎంచుకున్నారు. లక్కీ డ్రా పద్ధతిలో ఇంటిని అమ్మాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం రూ.500 విలువైన కూపన్‌ను కొనుగోలు చేసి.. లక్కీ డ్రాలో పాల్గొనాలని ఫ్లెక్సీలు పెట్టారు. ఈ విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.
లోకల్ మార్కెట్ ప్రకారం స్థలం, గది విలువ రూ.16 లక్షలు. దీనికి తగ్గట్టుగా 3 వేల కూపన్లు ముద్రించారు యజమాని రామబ్రహ్మం. కొనుగోలు చేసిన కూపన్ మీద వివరాలు రాసి డబ్బాలో వేయాలి. నవంబర్ 2న లక్కీ డ్రా తీస్తానని ప్రకటించారు. ఈ విషయం తెలుసుకుని చాలా మంది ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి లక్కీ డ్రాలో కూపన్ వేసి వెళ్లారు.
అలాగే సంగారెడ్డి జిల్లా శంకర్‌పల్కి చెందిన శంకర్ తన కుటుంబ సభ్యుల నలుగురి పేర్ల మీద కూపన్ తీసుకున్నారు. తన పేరు, భార్య, ఇద్దరు పిల్లల మీద కూపన్ కొని వివరాలు రాశారు. నవంబర్ 2న ఆదివారం నాడు యజమాని రామబ్రహ్మం ఓ ఫంక్షన్ హాలులో లక్కీ డ్రా తీశారు. అయితే శంకర్ 10 నెలల కుమార్తె హన్సిక లక్కు తగిలింది. రూ.16 లక్షల విలువైన ఇంటిని ఆమె డ్రాలో గెలుచుకుంది. 2307 సీరియల్ నెంబరు కూపన్‌లో ఆమె వివరాలు ఉన్నాయి. లక్కీ డ్రాలో ఈ కూపన్ వచ్చింది.
దీంతో వారికి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. వారు కోరిన సమయంలో రిజిస్ట్రేషన్ చేస్తానని యజమాని చెప్పారు. చాలా రోజుల నుంచి ఇంటితోపాటుగా 66 గజాల స్థలాన్ని విక్రయించేందుకు ప్రయత్నించినా ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఇలా ప్లాన్ చేశారు యజమాని. రూ.500 చొప్పున సుమారు 3600 కూపన్లు అమ్ముడుపోయినట్టుగా రామబ్రహ్మం తెలిపారు. అనుకున్నదానికంటే ఎక్కువే డబ్బులు వచ్చాయని సంతోషం వ్యక్తం చేశారు.
{{/usCountry}}దీంతో వారికి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. వారు కోరిన సమయంలో రిజిస్ట్రేషన్ చేస్తానని యజమాని చెప్పారు. చాలా రోజుల నుంచి ఇంటితోపాటుగా 66 గజాల స్థలాన్ని విక్రయించేందుకు ప్రయత్నించినా ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఇలా ప్లాన్ చేశారు యజమాని. రూ.500 చొప్పున సుమారు 3600 కూపన్లు అమ్ముడుపోయినట్టుగా రామబ్రహ్మం తెలిపారు. అనుకున్నదానికంటే ఎక్కువే డబ్బులు వచ్చాయని సంతోషం వ్యక్తం చేశారు.
{{/usCountry}}