మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.
26/11 ముంబై ఉగ్ర దాడికి 18 ఏళ్లు : ప్రభుత్వ సాయం కోసం నిజామాబాద్ వాసి ఎదురుచూపులు..!
ముంబై 26/11 ఉగ్రదాడిలో కూతురిని కోల్పోయి, భర్తను అంగవైకల్యంతో పోగొట్టుకున్న నిజామాబాద్ వాసి నూర్జహాన్ బేగం ప్రభుత్వ ఉద్యోగం, ఆర్థిక సాయం కోసం మరోసారి వేడుకున్నారు. 18 ఏళ్ల తర్వాత కూడా ఆ చీకటి జ్ఞాపకాలు వెంటాడుతున్నాయని కన్నీటి పర్యంతమయ్యారు.
ముంబై 26/11 ఉగ్రదాడిలో తన 20 ఏళ్ల కూతురు అమీనా బేగంను కోల్పోయి, భర్త అంగవైకల్యంతో నరకయాతన అనుభవించిన నిజామాబాద్ వాసి నూర్జహాన్ బేగం గురువారం మరోసారి ప్రభుత్వాన్ని వేడుకున్నారు. తమ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు ఆర్థిక సాయం అందించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

ఛత్రపతి శివాజీ టెర్మినస్ (సీఎస్టీ) రైల్వే స్టేషన్లో జరిగిన ఘటనపై ఏఎన్ఐ(ANI)తో మాట్లాడుతూ… నూర్జహాన్ బేగం గుర్తు చేసుకున్నారు. అజ్మీర్ నుంచి హాజీ అలీ దర్గా దర్శనం కోసం కుటుంబ సభ్యులతో కలిసి ముంబై వెళ్లినట్లు తెలిపారు. అక్కడి నుంచి సీఎస్టీ రైల్వే స్టేషన్ మీదుగా నిజామాబాద్‌కు తిరిగి రావాల్సి ఉందన్నారు. అయితే డెక్కన్ ఎక్స్‌ప్రెస్ రైలు మిస్ కావడంతో, రాత్రి 9 గంటల నుంచి 9:30 గంటల మధ్య మరో రైలు కోసం వేచి చూస్తుండగా ఉగ్రవాదులు అకస్మాత్తుగా విచక్షణారహితంగా కాల్పులు జరిపారని వివరించారు.
ఆ కాల్పుల్లో 20 ఏళ్ల తన కూతురు అమీనా బేగం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పెళ్లయిన ఆరు నెలలకే ఆమె మృత్యువాత పడటం తమ కుటుంబాన్ని కోలుకోలేని దెబ్బ తీసిందన్నారు. నూర్జహాన్ భర్త అబ్దుల్ రషీద్‌కు కూడా రెండు తూటాలు తగిలాయి. ఆ గాయాల కారణంగా ఆయన అంగవైకల్యానికి గురై మంచానికే పరిమితమయ్యారు. ఆరోగ్యం పూర్తిగా కుదుటపడక….. చివరకు 2011లో ఆయన కన్నుమూశారు.
పద్దెనిమిదేళ్ల జ్ఞాపకాలు.. నెరవేరని ఉద్యోగ హామీ
ఈ విషాదం జరిగి 18 ఏళ్లు గడిచినా, ప్రతి ఏటా నవంబరు 26 వస్తే చాలు ఆ బాధాకరమైన జ్ఞాపకాలు మళ్లీ కళ్లముందు కదలాడుతూ తీవ్ర వేదనకు గురిచేస్తాయని నూర్జహాన్ బేగం చెప్పారు.
ఆ సమయంలో ప్రభుత్వం కొంత ఆర్థిక సాయం అందించిందని ఆమె తెలిపారు. అయితే తమ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్న డిమాండ్ మాత్రం ఇప్పటివరకు నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని…. ఈ ఘటనతో దెబ్బతిన్న తమ కుటుంబానికి ఆర్థిక మద్దతు ఇవ్వాలని మరోసారి ప్రభుత్వాన్ని కోరారు.
26/11 ముంబై ఉగ్రదాడి నేపథ్యం :
భారత ఆర్థిక రాజధాని ముంబై వీధుల్లో పాకిస్థాన్ మద్దతున్న లష్కరే తాయిబా (ఎల్ఈటీ) ఉగ్రవాదులు మారణహోమం సృష్టించి ఈ ఏడాదితో 18 ఏళ్లు పూర్తయ్యాయి. సాధారణంగా 26/11గా పిలిచే ఈ సమన్వయ దాడులను పది మంది ఉగ్రవాదులు నిర్వహించారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
నవంబరు 26, 2008 రాత్రి సముద్ర మార్గం ద్వారా ముంబై నగరంలోకి ప్రవేశించిన ఉగ్రవాదులు…. నాలుగు రోజుల పాటు రద్దీ ప్రాంతాల్లో దాడులు జరిపారు. ఈ దాడుల్లో 166 మంది ప్రాణాలు కోల్పోగా, 300 మంది గాయపడ్డారు.
విదేశీయులతో పాటు ముంబైలోని కీలక శ్రామిక వర్గం ఎక్కువగా వచ్చే ప్రాంతాలను గరిష్ట నష్టం కలిగించేలా ఉగ్రవాదులు ముందుగానే రెక్కీ నిర్వహించి ఎంచుకున్నారు. తాజ్, ఒబెరాయ్ హోటళ్లు, ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, నారిమన్ హౌస్‌లోని యూదు కేంద్రం, కామా ఆసుపత్రి, మెట్రో సినిమా, లియోపోల్డ్ కేఫ్‌లను లక్ష్యంగా చేసుకున్నారు.
తొమ్మిది మంది ఎల్ఈటీ ఉగ్రవాదులు భద్రతా దళాల కాల్పుల్లో మృతి చెందగా, కసబ్ ప్రాణాలతో పట్టుబడ్డాడు. మే 2010లో కసబ్‌కు కోర్టు మరణశిక్ష విధించింది. రెండేళ్ల తర్వాత పుణెలోని అత్యంత భద్రత కలిగిన జైలులో అతడిని ఉరితీశారు.

E-Paper
