సౌదీ ప్రమాదం.. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం!

సౌదీ అరేబియాలో బస్సు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌కు చెందిన 45 మంది సజీవ దహనం అయ్యారు. మృతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది.

Published on: Nov 17, 2025, 17:07:06 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సౌదీ అరేబియాలో ఘోర ప్రమాదం జరిగింది. బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీ కొట్టింది. దీంతో ఘోర ప్రమాదం సంభవించింది. హైదరాబాద్‌కు చెందిన 45 మంది ఈ ఘటనలో చనిపోయారు. ఒకే వ్యక్తి మాత్రమే బతికాడు. బస్సు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు మంత్రివర్గం సంతాపం తెలిపింది.

తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వం

మృతుల కుటంబాలకు రూ.5లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది. మంత్రి అజారుద్దీన్, ఎంఐఎం ఎమ్మెల్యేతోపాటుగా మైనారిటీ విభాగానికి చెందిన ఓ అధికారితో ప్రభుత్వ ప్రతినిధి బృందాన్ని సౌదీకి పంపనుంది. చనిపోయినవారి మృతదేహాలకు మత సంప్రదాయం ప్రకారం.. సౌదీలోనే అంత్యక్రియలు జరిగేలా చర్యలు తీసుకోనుంది ప్రభుత్వం. బాధితు కుటుంబాలకు చెందిన ఒక్కో కుటుంబానికి ఇద్దరు చొప్పును సౌదీకి తీసుకెళ్లాలని నిర్ణయించింది మంత్రివర్గం.

ఒకే కుటుంబానికి చెందిన 18 మంది

ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 18 మంది మరణించారు. విద్యానగర్‌కు చెందిన విశ్రాంత రైల్వే ఉద్యోగి నజీరుద్దీన్ కుటుంబంతో కలిసి మక్కాకు వెళ్లారు. సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన కుటుంబానికి చెందిన 18 మంది చనిపోయారు. మెుత్తం 45 మంది మృతుల్లో 17 మంది పురుషులు, 18 మంది మహిళలు, 10 మంది చిన్నారులు ఉన్నారు. నాలుగు ట్రావెల్ ఏజెన్సీల ద్వారా 9వ తేదీన హైదరాబాద్‌ నుంచి ఉమ్రాకు వెళ్లారు. మక్కా నుంచి మదీనాకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

మృతుల్లో మల్లేపల్లి, బజార్‌ఘాట్‌, ఆసిఫ్‌నగర్‌ తదితర ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారు. మొత్తం 54 మంది కలిసి నవంబరు 9న హైదరాబాద్‌ నుంచి వెళ్లారు. నవంబరు 23 వరకు టూర్‌ ప్లాన్‌ చేసుకున్నారు. ఇందులో నలుగురు వ్యక్తులు నిన్న కారులో మదీనాకు వెళ్లగా.. మరో నలుగురు మక్కాలోనే ఉన్నారు. మిగతా 46 మంది మక్కా నుంచి మదీనాకు బస్సులో బయలుదేరగా ప్రమాదం జరిగింది. ఇందులో ఒక యువకుడు బతికాడు. మిగిలిన 45 మంది మరణించారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More