నాంపల్లి : ఫర్నీచర్‌ షాపులో భారీ అగ్నిప్రమాదం - ఆరుగురు చిక్కుకున్నట్లు గుర్తింపు, కొనసాగుతున్న రెస్క్యూ

నాంపల్లి పరిధిలోని చీరక్ గాలి లైన్‌లో ఉన్న ఓ ఫర్నీచర్ షాపులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. నాలుగు అంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో మంటలు మొదలై పైకి వ్యాపించాయి. భవనంలో ఆరుగురు చిక్కుకున్నట్లు సమాచారం. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Published on: Jan 24, 2026, 16:33:46 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హైదరాబాద్ నాంపల్లిలోని ఓ ఫర్నిచర్‌ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తూ చోటు చేసుకున్న మంటలు… ఒక్కసారిగా వ్యాపించాయి. నాలుగు అంతస్తుల భవనంలోని గ్రౌండ్‌ ఫ్లోర్‌లో అగ్నిప్రమాదం జరిగింది.

నాంపల్లి లో భారీ అగ్నిప్రమాదం
నాంపల్లి లో భారీ అగ్నిప్రమాదం

భవనంలో లోపల ఆరుగురు చిక్కుకున్నట్లు గుర్తించారు. వాచ్‌మెన్‌ కుటుంబంలో ఇద్దరు పిల్లలు, మరో కుటుంబంలోని నలుగురు పెద్దవారు చిక్కుకున్నట్లు తెలిసింది. చిక్కుకున్న ఇద్దరు చిన్నారులను అఖిల్‌ (7), ప్రణీత్‌ (11)గా గుర్తించారు. వీరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

మరోవైపు భవనం పరిసర ప్రాంతవాసులను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతుండడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది… 8 ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తోంది. మరోవైపు రోబో ఫైర్‌ మిషన్‌ ద్వారా రెస్క్యూ కొనసాగుతోంది. సెల్లార్‌ నిండా ఫర్నీచర్‌ ఉండటంతో సహాయక చర్యలకు ఇబ్బంది నెలకొంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

పోలీసుల నుంచి అలర్ట్…

మరోవైపు ఫర్నిచర్ షాపులో జరిగిన అగ్నిప్రమాదం నేపథ్యంలో హైదరాబాద్ సీపీ సజ్జనార్ ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రాంతంలో ట్రాఫిక్ స్తంభించిందని పేర్కొంది. ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని… సందర్శకులు తమ ఎగ్జిబిషన్ పర్యటనను ఈ రోజు వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More