హైదరాబాద్ : డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ వ్యక్తి - పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్య...!

హైదరాబాద్ లో దారుణం జరిగింది. డ్రంక్ అండ్ డ్రైవ్ పట్టుబడ్డ వ్యక్తి పోలీస్ స్టేషన్ ఎదుటే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మల్కాజ్ గిరిలోని కుషాయిగూడ పరిధిలో చోటు చేసుకుంది.

Published on: Nov 5, 2025, 12:31:13 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హైదరాబాద్‌ నగరంలో విషాద ఘటన వెలుగు చూసింది. మల్కాజ్ గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో మీన్ రెడ్డి అనే ఆటో డ్రైవర్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రాథమిక వివరాల ప్రకారం…. మంగళవారం సాయంత్రం డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో మీన్ రెడ్డి పోలీసులకు చిక్కాడు.

పోలీస్ స్టేషన్ ఎదుట యువకుడి ఆత్మహత్య..! Representational Image
పోలీస్ స్టేషన్ ఎదుట యువకుడి ఆత్మహత్య..! Representational Image

డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో 120 పాయింట్లు రావడంతో మీన్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. అతడి ఆటోను స్వాధీనం చేసుకున్నారు. కట్ చేస్తే…. అర్ధరాత్రి కుషాయిగూడ ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ వద్ద మీన్‌రెడ్డి పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్నాడు. మంటలు ఆర్పేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఆ తర్వాత ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు.

మీన్‌రెడ్డిని దమ్మాయిగూడ వాసిగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన వ్యక్తి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదుటే ఆత్మహత్య చేసుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More