Telangana ACB : ఆర్‌అండ్‌బీ ఈఎన్‌సీ మోహన్ నాయక్‌ ఇళ్లపై ఏసీబీ సోదాలు - భారీగా అక్రమాస్తులు..!

అర్ అండ్ బీ ఇంజినీర్ ఇన్ చీఫ్ మోహన్ నాయక్ నివాసంపై ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మాధాపూర్‌తో పాటు 11 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు జరుగుతున్నాయి.

Published on: Jun 9, 2026, 14:37:17 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అధికారాన్ని అడ్డం పెట్టుకొని అవినీతికి పాల్పడే అధికారులపై తెలంగాణ ఏసీబీ ఉక్కుపాదం మోపుతోంది. గత కొంతకాలంగా దూకుడుగా ముందుకెళ్తున్న ఏసీబీ… చాలా మంది అవినీతి అధికారులను అరెస్ట్ చేసింది. తాజాగా రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ (R&B) ఇంజినీర్-ఇన్-చీఫ్ మోహన్ నాయక్ ఇళ్లపై సోదాలు జరిపింది. తెల్లవారుజాము నుంచే ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి.

ఆర్&బీ ఈఎన్‌సీ మోహన్ నాయక్ నివాసంలో  ACB సోదాలు
ఆర్&బీ ఈఎన్‌సీ మోహన్ నాయక్ నివాసంలో ACB సోదాలు

భారీగా ఆస్తులు..!

ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలు, ఫిర్యాదుల నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఆయనపై ఫోకస్ పెట్టారు. ప్రాథమిక అంచనాల ప్రకారం మోహన్ నాయక్ అక్రమాస్తుల విలువ రూ.100 కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం.

మాధాపూర్‌లో ఉన్న బాలునాయక్ ప్రధాన నివాసంతో పాటు తెలంగాణవ్యాప్తంగా మొత్తం 11 విభిన్న ప్రాంతాల్లో ఏసీబీ బృందాలు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నాయి. ఆయనకు సంబంధించిన కార్యాలయాలు, బంధువులు, అత్యంత ఆప్తులకు చెందిన ఇళ్లలో కూడా తనిఖీలు కొనసాగుతున్నాయి.

రోడ్లు, భవనాల శాఖలో అత్యంత కీలకమైన పదవిలో ఉన్న మోహన్ నాయక్‌పై గత కొంతకాలంగా అనేక అవినీతి విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ కాంట్రాక్టులు దక్కించుకున్న వివిధ కాంట్రాక్టర్ల నుంచి ఆయన భారీగా కమీషన్లు వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా…. నిబంధనలను పక్కనబెట్టి కొన్ని నిర్దిష్ట ప్రైవేట్ సంస్థలకు అనుకూలంగా ప్రభుత్వ టెండర్లను కేటాయించారనే విమర్శలు కూడా ఆయనపై వచ్చాయి.

ప్రస్తుతం జరుగుతున్న సోదాల్లో మోహన్ నాయక్‌కు సంబంధించిన చర, స్థిర ఆస్తులకు సంబంధించిన కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివిధ బ్యాంకు ఖాతాల వివరాలు, లాకర్ల కీలు, విదేశీ పెట్టుబడులకు సంబంధించిన అనుమానాస్పద పత్రాలు, డైరీలు, ఖరీదైన లగ్జరీ కార్లు మరియు ఇళ్లకు సంబంధించిన సేల్ డీడ్లను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

పెద్ద ఎత్తున ఆస్తుల వివరాలు బయటపడుతుండటంతో…. వీటన్నింటి సమగ్ర విలువను లెక్కగట్టడానికి మరియు పూర్తి సమాచారాన్ని క్రోడీకరించడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉందని దర్యాప్తు అధికారులు వెల్లడించారు. కాంట్రాక్టర్లతో జరిపిన ఆర్థిక లావాదేవీల రికార్డులను కూడా ప్రత్యేకంగా విశ్లేషిస్తున్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More