నిజామాబాద్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు : ఫలించని నిందితుడు రియాజ్ ప్రయత్నాలు - పోలీసులకు ఇలా దొరికిపోయాడు
నిజామాబాద్ సిటీలో సంచలనం సృష్టించిన కానిస్టేబుల్ హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ మేరకు నిజామాబాద్ సీపీ ఓ ప్రకటన విడుదల చేశారు. మరో వ్యక్తిని హత్య చేసే క్రమంలో పోలీసులు పట్టుకున్నారని వెల్లడించారు.
నిజామాబాద్ జిల్లాలో కానిస్టేబుల్ ను కత్తితో పొడిచి చంపిన కేసు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. హత్య చేసిన తర్వాత నిందితుడు పారిపోయాడు. అయితే అతని కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టగా…. ఆదివారం నిందితుడు రియాజ్ పట్టుబడ్డాడు. దీనిపై నిజామాబాద్ సిటీ సీపీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.

“నిజామాబాద్ పట్టణంలో జరిగిన కానిస్టేబుల్ హత్యకేసులో నిందితుడు రియాజ్ ను అదుపులోకి తీసుకున్నాం. నిజామాబాద్ సారంగపూర్ ప్రాంతంలో ఒక వ్యక్తిని హత్య చేయటానికి ప్రయత్నిస్తుండగా పోలీసు బలగాలు త్వరితగతిన వెళ్లి పట్టుకున్నాయి” అని సీపీ కార్యాలయం ప్రకటించింది. దీంతో ఇద్దరినీ ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొంది.
ఇక రియాజ్ ఎన్ కౌంటర్ అయ్యాడనే వార్తలు కూడా వినిపించాయి. దీనిపై నగర సీపీ సాయి చైతన్య ప్రకటన చేశారు. అతనిపై ఎలాంటి కాల్పులు జరపలేదని స్పష్టం చేశారు. ప్రాణాలతోనే అదుపులోకి తీసుకున్నామని క్లారిటీ ఇచ్చారు.
ఎలా పట్టుబడంటే..?
పోలీసులు రెండు రోజులుగా నిందితుడు రియాజ్ కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. 6వ ఠాణా పరిధిలోని సారంగాపూర్ శివారు ప్రాంతంలోని ఓ షెడ్డులో రియాజ్ తలదాచుకున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. పోలీసుల సమాచారాన్ని గమనించిన రియాజ్…. పారిపోయే ప్రయత్నం చేశాడు.దగ్గర్లోనే ఉన్న బైక్ మెకానిక్ ఆసిఫ్ అతడిని పట్టుకున్నాడు. దీంతో రియాజ్ కత్తితో ఆసిఫ్‌ను గాయపర్చాడు. వీరిద్దరి మధ్య పెనుగులాట చోటు చేసుకుంది. అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు… నిందితుడిని పట్టుకున్నారు. ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కానిస్టేబుల్ హత్య - అసలేం జరిగిందంటే..?
ఈ సంఘటన అక్టోబర్ 17వ తేదీన రాత్రి 08.30 గంటల నుంచి 9 గంటల మధ్య జరిగింది. వాహనాల దొంగతనాలు, చైన్ స్నాచింగ్ నేరాల కేసులో నిందితుడిగా ఉన్న షేక్ రియాద్(24) అనే క్రిమినల్ ను అరెస్ట్ చేసి బైక్ పై పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే నిందితుడి… కానిస్టేబుల్ ప్రమోద్(40)ను కత్తితో పొడిచి గాయపరిచాడు. తీవ్రంగా గాయపడిన గంటల వ్యవధిలోనే మృతి చెందాడు. హత్య అనంతరం నిందితుడు రియాద్ పారిపోయాడు.
కానిస్టేబుల్ ప్రమోద్ నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ విభాగమైన సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్)లో పనిచేస్తున్నాడు. కానిస్టేబుల్ మృతి పట్ల డీజీపీ శివధర్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

