ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ కోసం 700 ఎకరాలు సేకరణ.. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
తెలంగాణ రాష్ట్రంలో మరో ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు కానుంది. ఈ మేరకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో భూ సేకరణ ప్రక్రియ మెుదలుకానుంది.
ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. 700 ఎకరాల భూ సేకరణ కోసం ఈ మేరకు ఆదేశాలు వెళ్లాయి. తెలంగాణలో 6 ప్రాంతీయ ఎయిర్‌పోర్ట్‌ల అభివృద్ధిలో భాగంగా ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ ఎంపిక చేశారు. ఈ మేరకు ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా టెక్నో ఎకనామిక్ ఫీజిబిలిటీ రిపోర్ట్ సమర్పించింది. ఈ నివేదిక ప్రకారం ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు చేయడం సాధ్యమేనని చెప్పింది.

ఆదిలాబాద్ విమానాశ్రయ అభివృద్ధిని వేగవంతం చేస్తున్నందున 700 ఎకరాలను సేకరించాలని కలెక్టర్‌కు ఆదేశాలు ఇచ్చారు. ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ ప్రభుత్వ ఉత్తర్వు విడుదల చేశారు.
ఈ సంవత్సరం ఏప్రిల్ ప్రారంభంలో ఆదిలాబాద్‌లో బ్రౌన్‌ఫీల్డ్ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయడానికి భారత వైమానిక దళం అనుమతి ఇచ్చింది. ఈ స్థలంలో ఏఐఎఫ్ ఇప్పటికే దాదాపు 362 ఎకరాల భూమిని కలిగి ఉంది. అయితే, విమానాశ్రయ విస్తరణ, ప్రణాళికాబద్ధమైన వైమానిక దళ శిక్షణా కేంద్రం రెండింటినీ ఉంచడానికి అదనపు భూమి అవసరమని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ గమనించింది.
కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 2027 నాటికి ఆదిలాబాద్ విమానాశ్రయాన్ని ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆదిలాబాద్ నుండి ప్రయాణికుల విమాన సేవలకు మార్గం సుగమం చేస్తుందని అధికారులు చెబుతున్నారు.
మరోవైపు పెద్దపల్లి జిల్లాలోని అంతర్గాంలో ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. ఎయిర్ పోర్ట్ ఏర్పాటు చేసేందుకు సాధ్యాసాధ్యాల కోసం ప్రీ ఫీజిబిలిటీ స్టడీ నిర్వహిస్తు్న్నారు. తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం అధ్యయనం చేయడానికి రూ.40.53 లక్షలను విడుదల చేసింది. ఈ మేరకు ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రతినిధులు విమానాశ్రయం ఏర్పాటుపై రిపోర్ట్ తయారు చేసిన సమర్పించనున్నారు.
నిజానికి బసంతనగర్ వద్ద పాత రన్ వే దగ్గర విమానాశ్రయం ఏర్పాటు చేయాలని అనుకున్నారు. కానీ ఆ ప్రాంతానికి ఇరుపులా గుట్టలు, హైటెన్షన్ వైర్లు ఉండటంతో అనుకూలం కాదని ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండిడా అనుకుంది. ఈ మేరకు భూ భాగం, టెక్నాలజీ, ఆర్థికంగా అనుకూలం కాదని నివేదిక సమర్పించింది. మరోవైపు పెద్దపల్లి జిల్లాలోని అంతర్గాం మండల కేంద్రానికి దగ్గరలో 591.24 ఎకరాల స్థలాన్ని ఎయిర్ పోర్ట్ ఏర్పాటుకు కేటాయించింది.
ఈ ఎయిర్‌పోర్టు ద్వారా పెద్దపల్లి ప్రజలకు, సింగరేణి సిబ్బందికి, విద్యార్థులు, వ్యాపార వర్గాలకు పెద్ద ఎత్తున ప్రయోజనం కలగనుంది. హైదరాబాద్‌కు గంటల కొద్దీ ప్రయాణం చేసే అవసరం ఉండదు. ప్రత్యక్ష కనెక్టివిటీ ఏర్పడుతుంది. అనేక అవకాశాలు లభిస్తాయి.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


