AIBE 20 Notification Updates : ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు - వెంటనే అప్లయ్ చేసుకోండి
ఏఐబీఈ -20 పరీక్షకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ వచ్చేసింది. రిజిస్ట్రేషన్ గడువును పొడిగిస్తున్నట్లు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తెలిపింది. అర్హులైన అభ్యర్థులు ఈనెల 31వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని పేర్కొంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.
బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి ఏఐబీఈ -20 నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కూడా కొనసాగుతోంది. అయితే ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం… రిజిస్ట్రేషన్ల గడువు అక్టోబర్ 28వ తేదీతో ముగిసింది. ఈ నేపథ్యంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మరో అప్డేట్ ఇచ్చింది. రిజిస్ట్రేషన్ల గడువును అక్టోబర్ 31వ తేదీ వరకు పొడిగించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.

ఎల్ఎల్ బీ పూర్తి చేసిన వారితో పాటు ఫైనల్ ఇయర్ చదువుతున్న అభ్యర్థులు కూడా ఈ పరీక్షను రాయవచ్చు. అర్హత ఉన్న అభ్యర్థులు allindiabarexamination.com వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.
నవంబర్ 30న ఎగ్జామ్....
ఇక అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ గడువును కూడా పొడిగించారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఏమైనా తప్పులు ఉంటే… నవంబర్ 1వ తేదీ వరకు సరిచేసుకోవచ్చు. నవంబర్ 15వ తేదీన హాల్ టికెట్లను విడుదల చేస్తారు. నవంబర్ 30వ తేదీన ఈ ఎగ్జామ్ నిర్వహిస్తారు. తెలంగాణతో పాటు ఏపీలోనూ పరీక్షా కేంద్రాలుంటాయి.
ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ అనేది న్యాయవాదిగా వృత్తిని ప్రారంభించాలనుకునే లా గ్రాడ్యుయేట్ల కోసం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సంవత్సరానికి రెండుసార్లు సర్టిఫికేషన్ పరీక్షను నిర్వహిస్తుంది. పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సర్టిఫికెట్ ఆఫ్ ప్రాక్టీస్ అందజేస్తుంది.
AIBE 20 ఎగ్జామ్: అప్లికేషన్ ప్రాసెస్ ఇలా....
- ముందుగా ఏఐబీఈ 20 కోసం https://www.allindiabarexamination.com/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- ముందుగా ప్రాథమిక వివరాలతో లాగిన్ కావాలి.
- హోమ్ పేజీలో, ఏఐబీఈ 20 కోసం రిజిస్ట్రేషన్ లింక్ పై క్లిక్ చేయాలి.
- ముందుగా నిర్ణయించిన ఫీజును చెల్లించాలి.
- అవసరమైన వివరాలను నమోదు చేసి ద్వారా అప్లికేషన్ ఫారమ్ పూర్తి చేయాలి.
- చివరగా సబ్మిట్ చేస్తే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది.
ఇక ఆలిండియా బార్ ఎగ్జామినేషన్లో ఉత్తీర్ణత సాధించాలంటే జనరల్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు కనీసం 45 శాతం మార్కులు సాధించాలి. ఎస్సీ, ఎస్టీ, వికలాంగ అభ్యర్థులు పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి కనీస మార్కులు 40 శాతంగా ఉంది. మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
దరఖాస్తు ఫీజు కింద జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.3500 చెల్లించాలి. ఇక ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.2500గా ఉంటుంది. కేవలం ఆన్ లైన్ ద్వారానే ఈ చెల్లింపుల ప్రక్రియ పూర్తి చేయాలి.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

